Saturday, 1 June 2024

Notes on Territorial Nationalism, Cultural Nationalism and Religious Nationalism

 Notes on Territorial Nationalism, Cultural Nationalism and Religious Nationalism

ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ప్రాదేశిక జాతీయవాదం (Territorial Nationalism) వుంటుంది. కొన్ని దేశాల్లో ప్రాదేశిక  జాతీయవాదంతోపాటు ఆత్మగౌరవంతో కూడిన సాంస్కృతిక జాతీయవాదం (Cultural Nationalism) కూడ వుంటుంది. భారత ప్రజలతోపాటు చైనా, రష్యా, జపాన్ వంటి ఆసియా ధేశాల్లో, ఫ్రాన్స్ హంగేరి వంటి యూరప్ దేశాల్లో మనకు సాంస్కృతిక జాతీయవాదం బలంగా కనిపిస్తుంది. 

సాంస్కృతిక జాతీయవాదం అతిశయించి వికటించి వికృత రూపం తీసుకుని  మత జాతీయవాదం (Religious Nationalism) గా మారిన దేశాలూ కొన్ని వున్నాయి.  పాకిస్తాన్, ఇజ్రాయేల్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాలు ఈ కోవలోనికి వస్తాయి. ప్రపంచంలో 120కు పైగా దేశాల్లో అత్యధిక జనాభా క్రైస్తవులది. కానీ, వాటిల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన  దేశాలేవీ మత రాజ్యాలు కావు.

భారత జాతియోద్యమ కాలంలో ప్రాదేశిక జాతీయవాదంతోపాటూ సాంస్కృతిక జాతీయవాదం కూడ వికసించింది. అది ఒక మేరకు మేలే చేసింది. దానికి ఒక గౌరవం గర్వం రెండూ కలిగాయి. భారత సాంస్కృతిక జాతీయవాదానికి మత జాతీయవాదంగా ఒక ప్రమాదకర రూపాన్ని ఇచ్చిన ఘనత దామోదర్ వినాయక్ సావర్కర్ కు దక్కుతుంది. వారు  తన సిధ్ధాంతాన్ని వివరిస్తూ 1923లో ‘హిందూత్వ’ పేరిట ఒక కొత్త మత - రాజకీయ నిర్వచనాన్ని ముందుకు తెచ్చారు.  సావర్కర్ ఆశించిన  హిందూత్వ సమాజాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ పుట్టింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ‘సమగ్ర మానవతావాదం’ (Integral humanism) పేరుతో ‘హిందూత్వ’ను సాకారంచేసే రాజకీయ వ్యూహం ఒకదాన్ని రచించారు.  ఇదే అప్పటి జనసంఘ్ కు ఇప్పటి బిజెపికి రోడ్‍ మ్యాప్ గా వుంటున్నది.


“భారతదేశంలో ముస్లింలు ప్రభుత్వ ఎలిమెంటరీ                                                                పాఠశాలల్లో చదువుకోవచ్చు. జబ్బో జ్వరమో వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందవచ్చు. అంతకు మించి వారు ప్రభుత్వం నుండి మరేమీ కోరకూడదు” అని 1990ల నాటి రథయాత్రల సందర్భంగా అడవాణి అనేవారు.  

No comments:

Post a Comment