Wednesday, 19 June 2024

Religion and the social Policing

 ఒక నమ్మకంగా వున్నంత కాలం దైవ భావన బాగుంటుంది!

నిర్బంధంగా మార్చేసిన ధార్మిక ఫత్వాలను భరించలేం!



Siva Ram

Wonderful and meaningful statement sir.

22h22 hours ago

Reply

See translation

Jameel Mohammad

లా ఇక్రాహ ఫిద్దీన్

20h20 hours ago

Reply

AL Murali Krishna

17h17 hours ago

Reply

AL Murali Krishna

మతమన్నాక, కొన్ని పద్ధతులు, కొన్ని నిర్ణయాలు, కొన్ని నిర్భందాలు తప్పవు. ఇది దాని మనుగడకోసమే..

రోజుకు ఇన్నిసార్లు దేవుణ్ణి మొక్కాలి అని ముస్లిం లో లాగా మనకు లేదే..

క్రిస్టియానిటీ లో లాగా మనకు లేదే,..

కట్టుబాట్లు లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మత మనుగడ కష్టం మిత్రమా. 👍

17h17 hours ago

Reply

Sudhakar Reddy Suravaram

I don’t think it’s correct. I don’t agree but I agree that you have a right to say so

16h16 hours ago

Reply

See translation

Fazlur Rahman

పరిమితులతో కూడిన స్వేచ్చ ధర్మం ఇస్తుంది!

అనవసరమైన స్వేచ్ఛ కు కళ్లెం వేస్తుంది.

సత్ సమాజ నిర్మాణం కోసం వ్యక్తిగత స్వేచ్ఛ కొంత త్యాగం చేయక తప్పదు.

15h15 hours ago

Reply

A.m. Khan Yazdani Danny

Fazlur Rahman ఇదంతా ఎవరు చెప్పారూ? ఎక్కడ చెప్పారూ?

14h14 hours ago

Reply

Fazlur Rahman

A.m. Khan Yazdani Danny ji

ఎవరు చెప్పారు అనే విషయం కన్నా

చెప్పిన విషయం సరైనదా? కాదా? అన్న శాస్త్రీయ పరిశీలన చేయండి!

13h13 hours ago

Reply

A.m. Khan Yazdani Danny

Fazlur Rahman ఇంకొకరి ఆధిపత్యం దేనికీ?

13h13 hours ago

Reply

A.m. Khan Yazdani Danny

ధార్మిక రంగంలో

13h13 hours ago

Reply

A.m. Khan Yazdani Danny

శాస్త్రీయ పరిశీలన అంటే?

12h12 hours ago

Reply

Fazlur Rahman

A.m. Khan Yazdani Danny ji

ఇంకొకరు మాత్రమే మీకు కనిపిస్తున్నారు.

విషయం తప్పో ఒప్పో మాత్రమే కనిపిస్తోంది ఎవరు చెప్పారో అన్నది అవసరం లేని విషయం!

12h12 hours ago

Reply

A.m. Khan Yazdani Danny

Fazlur Rahman శాస్త్రీయ పరిశీలన

అనగా ఏమి?

10h10 hours ago

Reply

Fazlur Rahman

A.m. Khan Yazdani Danny ji

మీకు తెలిసి అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా?

7h7 hours ago

Reply

A.m. Khan Yazdani Danny

ఇంకో మనిషి నా జీవితంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చదు. వాడు రోజుకు వందసార్లు నమాజ్ చేసేవాడైనా సరే.

12h12 hours ago

Reply

Fazlur Rahman

A.m. Khan Yazdani Danny ji

చట్ట పరిధిలో ఉన్నంత వరకూ ఏ వ్యక్తి (ప్రభుత్వ అధికారి) నీ.... లో జోక్యం చేసుకోడు.

చట్టాన్ని ఉల్లంఘన చేసిన మరుక్షణం మరొకరికి నీ..... జోక్యం అనివార్య మౌతుంది.

అది నీకు నచ్చినా నచ్చక పోయినా తప్పదు.

ధర్మం విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది!

7h7 hours ago

Reply

Edited

A.m. Khan Yazdani Danny

Fazlur Rahman 

ముందు మతాన్ని సైన్స్ అన్నారు.

ఇప్పుడు చట్టం, పోలీసులు అంటున్నారు.


మతం పరలోక విశ్వాసానికి సంబంధించిన అంశం.

చట్టాలు -పోలీసులు ఇహ లోకానికి చెందిన అంశాలు.

ఈ మాత్రం తేడా కూడ తెలియని నిండు అజ్ఞానం.

ఆపైన కనీసపు ముఖ పరిచయం కూడ లేకపోయినా ఏకవచన ప్రయోగం!!


పైగా పోలీసుల్లా జోక్యం చేసుకుంటాం అనడం.

మీరేమయినా ధార్మిక పోలీసులా?

ఈ భూమ్మీద నాకు నచ్చని వ్యవస్థ పోలీసులు.

వాళ్ళు ప్రభుత్వ పోలీసులు అయినా, ధార్మిక పోలీసులు అయినా సరే. 


పాపపుణ్యాలు అల్లాకు సంబంధించిన అంశాలు.

నేను చచ్చాక ఆ చిట్టా ఆయన తెరుస్తాడు.

పాపం పాళ్ళు ఎంతో పుణ్యాం పాళ్ళు ఎంతో తేలుస్తాడు.

నేను పుణ్యం ఎక్కువగా చేస్తే ఆయన మెచ్చుకుంటాడు.

నేను పాపాలు ఎక్కువగా చేస్తే ఆయన శిక్షిస్తాడు. 


అల్లామియా చేయాల్సిన పనులు మీరు చేయవద్దు.

మీకు మీరు అల్లాగా భావించుకుంటామంటే నాకు బాగా మండుతుంది.

దేవుడు ఒక్కడే అనే ఇస్లాం మౌలిక  ధార్మిక సూత్రానికే  మీ భావన పూర్తి వ్యతిరేకం. 


మనదేశంలో సంఘపరివారం కార్యకర్తలు కొన్నేళ్ళుగా ధార్మిక పోలీసుల్లా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు మీకు మీరు ధార్మిక పోలీసులు అవుదామని ఉవ్విళ్ళూరుతున్నారు.

ఇద్దరూ ఒక్కటే. మీ మధ్య తేడా ఏమీలేదు.


ఇది భారత ముస్లిం సమూహానికేకాక మొత్తం భారత సమాజపు లౌకిక ఆదర్శాలకు పెద్ద అంతర్గత ముప్పు.


1mabout a minute ago

Reply



SI Shafee

👍👌


Suraj Sayyed

మీరు భారతదేశం సంగతి మాట్లాడుతున్నారా? ఇక్కడైతే ఏ మతానికి ఆ పరిస్థితి లేదు. ఫత్వా అన్నారు కాబట్టి బహుశా మీరు ఇస్లాం ని గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. మన దేశంలో అయితే ఇస్లాంకు కూడా ఆ పరిస్థితి లేదు. మనది సెక్యులర్ స్టేట్ అనే సంగతి బహుశా మరిచిపోయినట్టున్నారు. మరి ఈ పోస్టులో సందేశం ఏమిటో నాకైతే అర్థం కాలేదు 🤔


A.m. Khan Yazdani Danny

Suraj Sayyed మత గురువులు ఇచ్చే ధార్మిక ఆదేశాలనే ముస్లింలు ఫత్వాలంటారు. 

నేను ముస్లింని కనుక ధార్మిక ఫత్వా అన్నాను. మనది సెక్యూలర్ స్టేట్ గాబట్టే ఈ పోస్టు పెట్టాల్సి వచ్చింది. సెక్యూలర్ అంటే నా ఉద్దేశ్యంలో మతసామరస్యం. 


Suraj Sayyed

A.m. Khan Yazdani Danny ఒకసారి గూగుల్ చేసి చూడండి. సెక్యులర్ అంటే మతరహితంగా ఉండడం. అది కూడా ప్రభుత్వాలు మతరహితంగా ఉండడం ఇది యూరోపియన్ కాన్సెప్ట్.


A.m. Khan Yazdani Danny

Suraj Sayyed

గూగుల్ చెప్పింది  ఒక అర్ధం మాత్రమే . దానికి  విస్తారమైన అర్ధాలు అనేకం వుంటాయి. ప్రభుత్వం మతాతీతంగా వ్యవహరించాలనేది ఒక అర్ధం. భారత రాజ్యాంగం పీఠిక సెక్యూలర్ సమాజాన్ని నిర్మిస్తామని  చెప్పుకుంది. అప్పుడు మత రహిత సమాజాన్ని నిర్మిస్తామని అర్ధమా? మత సామరస్య సమాజాన్ని నిర్మిస్తామని చెప్పడమా? పరిమిత అర్ధాలకు పరిమితం కావద్దు. 

No comments:

Post a Comment