జన్మభూమి, కర్మభూమి,
పుణ్యభూమి
డానీ
సమాజ–రాజకీయ విశ్లేషకుడు
రాజకీయాల్లో ధార్మిక
భావోద్వేగాలకన్నా ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యం. అమెరికా–ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై సాగిస్తున్న యుధ్ధంలో
ఈ అంశం మరోసారి స్పష్టమైంది.
భారతీయ ముస్లింలు
ఇక్కడే పుడతారు, ఇక్కడే జీవిస్తారు, ఇక్కడే చనిపోతారు — ఇది వారి జన్మభూమి, కర్మభూమి.
అయితే, కొందరు హిందూత్వ సిద్ధాంతకర్తలు “పుణ్యభూమి” ప్రమాణంతో దేశభక్తిని కొలిచే ప్రయత్నం
చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్, గురూజీ ఎంఎస్ గోల్వార్కర్ మాతృభూమి–కర్మభూమి–పుణ్యభూమి
మూడూ కలిసినప్పుడే సంపూర్ణ జాతీయత్వం సాధ్యమవుతుందని వాదించారు.
భారత ముస్లింలు, క్రైస్తవులకు
పుణ్యభూములు భారత దేశం ఆవల వున్నాయి. అప్పట్లో కమ్యూనిస్టుల ‘పుణ్యభూమి’ (ప్రపంచ విప్లవ
కేంద్రం) కూడ రష్యాలో వుండేది. పుణ్యభూమి దేశానికి
బయట వున్నవారితో దేశానికి అంతర్గత ముప్పు వుంటుందనేది వారి సిధ్ధాంతం.
పుణ్యభూమి ప్రమాణంతో
ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల్ని అన్యులుగా నిందించడానికి సావర్కర్ తదితరులు
రూపొందిన సిధ్ధంతం ఇది.
ఇలాంటి ప్రమాణాలని
భారత రాజ్యాంగం అంగీకరించదు.
పౌరసత్వానికి మతవిశ్వాసాలు ప్రమాణీకం కానేకాదు.
అంతర్జాతీయ సంఘటనలను దేశీయ విధేయతతో కలపడం ప్రమాదకరం. అనేవి ఆధునిక రాజ్యాంగాల ఆద్ర్శాలు.
ఇస్లాం పుణ్యక్షేత్రాలయిన
మక్కా, మదీన సౌదీ అరేబియాలో వున్నాయి. మూడో పుణ్యక్షేత్రం అయిన అల్ ఆక్సా మసీదు జెరూసలేంలో
వుంది. సావర్కర్, గోల్వార్కర్ సిధ్ధాంతం ప్రకారం
భారత ముస్లింలు ఇప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ ల పక్షం వహించాలి. కానీ తద్విరుధ్ధంగా
జరుగుతోంది. అమెరికా పంచన చేరిన సౌదీ అరేబియాను ఇప్పుడు భారత ముస్లింలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అలాగే ఇజ్రాయిల్ ఇస్లాం వైరం ఈనాటిదికాదు.
గతంలో ప్రస్తుతం ఆక్సా
మసీదు మీద పాలస్తీన, ఇజ్రాయిల్ లకు ఉమ్మడి అధికారం వుండేది. ప్రస్తుతం అల్ ఆక్సా మసీదును ఇజ్రాయేల్ పూర్తిగా
స్వాధీనం చేసుకుంది. యుధ్ధానికి రెండు రోజులు
ముందు జరిపిన ఇజ్రాయిల్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫాదర్ ల్యాండ్ అనే పదాన్ని
వాడారు. అంచేత ఇప్పుడు ముస్లింల పుణ్యక్షేత్రం కూడ బిజెపి అభిమానులకు గొప్పదేశం అయిపోయింది.
అలాగే, రెండు గొప్ప
ముస్లిం పుణ్యక్షేత్రాలున్న సౌదీ ఆరేబియా సహితం ప్రస్తుతం ఇజ్రాయీల్, భారత్ తోపాటు
అమెరికా క్యాంపులో వుంది. అంచేత, సౌదీ అరేబియా
కూడ ఇప్పుడు సంఘపరివారానికి బ్రదర్ లాండ్ లెఖ్ఖ.
అమెరికా పక్షం వహించే దేశాలను ఇండియాలో ఎవరు
దూషించినా సరే సంఘపరివారం సోషల్ మీడియా వాళ్ళను దేశద్రోహులు అనడానికి కూడ వెనుకాడడం లేదు. ఇరాన్ యుధ్ధాంలో సౌదీ అరేబియా
వైఖరిని ఎవరు తప్పుపట్టినా సంఘపరివారం సోషల్ మీడియా ట్రోల్స్ వెంటాడుతున్నారు. పుణ్యభూమి,
దేశభక్తి కథ ఎక్కడి నుండి ఎక్కడికి చేరిందో
చూడండి.
No comments:
Post a Comment