It is a notes only. It should be edited.
అనైతిక విజయం ఘోరపరాజయంకన్నా హీనమైనది.
తాలిబాన్లు "రాజకీయ నాయకులు, సైనికాధికారులు మా లక్ష్యం" అనివుంటే అది వాళ్ల వ్యవహారం అనుకోవడానికి వీలుండేది. "కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు మా పిల్లల్ని చంపుతున్నందుకు వాళ్ల పిల్లల్ని కూడా చంపుతాం" అనేసిన తరువాత తాలీబాన్ల అమెరికా -ఇజ్రాయిల్ వ్యతిరేక ఆమోదాంశం అంతరించిపోయింది. పెషావర్ లో నూటయాభై మంది పసికందుల్ని చంపి వాళ్ళు ఒక హీనమైన విజయాన్ని నమోదు చేసుకుని వుండవచ్చు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఇస్లాంకు ఒక నైతిక మచ్చను అంటగట్టారు. అనైతిక విజయం ఘోరపరాజయంకన్నా హీనమైనది.
పదేళ్ల క్రితం ఒక నక్సలైటు దళం చిలకలూరిపేటలో ఒక యస్సైను హతం చేయడానికి వెళ్ళింది. ఆసమయంలో యస్సై ఇంట్ళో లేడు. అతని తల్లి వుంది. దళం ఆమెను చంపేసింది. దాదాపు ఆ కాలంలోనే నల్లమల దళం ఒకటి వేంపెంట ఊరి పెద్దల్ని చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచినవాళ్ళు చంపరనే నమ్మకంతో ఊరి పెద్దలు అడవికి వెళ్ళారు. చర్చలకు వచ్చినవారిని దళం అడవిలో చంపేసింది. ఈ రెండు సంఘటనలు నక్సలైట్లకు రెండు హీనమైన విజయాలను సాధించిపెట్టి వుండవచ్చు. దాదాపు మూడున్నర దశాబ్దాల ఘన చరిత్ర గలిగిన నక్సలైట్ ఉద్యమం ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఆమోదాంశాన్ని కోల్పోయింది.

No comments:
Post a Comment