Saturday, 5 June 2021

దళితులకు పెట్టుబడి సమకూరుతున్న ప్రాంతాల్లోనే సామూహిక దాడులు జరిగాయి.

 దళితులకు పెట్టుబడి సమకూరుతున్న

ప్రాంతాల్లోనే సామూహిక దాడులు జరిగాయి.

 

విస్తృతంగా చర్చచేయండి. లైకులు కొట్టో,  good, nice వంటి కామెంట్లు పెట్టో తప్పుకోవద్దు. నచ్చకపోతే గట్టిగా విమర్శించండి. మీ వాదనను ప్రవేశపెట్టండి. ఈ  వేదికకు దూరంగా వుండాలనీ ట్రోల్స్ కు మనవి.

 

1.        కులాల మధ్య సాంఘీక విబేధాలు వైరుధ్యాలు శతాబ్దాలుగా వున్నాయి.

 

2.        దళిత సామాజికవర్గాల్లో వ్యసాయంవల్ల  ఆర్ధిక పెట్టుబడి, విద్యవల్ల సామాజిక పెట్టుబడి సమకూరుతున్న ప్రాంతాల్లో కుల వైరుధ్యాలు శత్రువైరుధ్యాలుగా మారి సామూహిక దాడులు జరిగాయి.

 

3.        కారంచేడు, చుండూరు, పిప్పర, వేంపెంట వంటివి నీటిపారుదలా సౌకర్యం పుష్కలంగా వుండి వ్యవసాయం లాభసాటిగవున్న  ప్రాంతాలు.

 

4.        యజమానికులాలు చాలాచోట్ల వ్యవసాయం చేయడం మానేశాయి. పొలాలు తోటలను శ్రామికకులాలకు కౌలుకు ఇచ్చి పూర్తి స్థాయి విశ్రాంతి వర్గంగా మారిపోయాయి.

 

5.        తమ వెనుక ఎకరాల కొద్దీ ఆస్తి వున్నదనే ధీమాతో అనేక గ్రామాల్లో యజమానికులాల పిల్లలకు చదువు మీద శ్రధ్ధ తగ్గిపోయింది.

 

6.        మరోవైపు దళిత యువకులు తమకు ఆస్తి లేకపోవడంతో రిజర్వేషన్లవల్ల కలిగిన సౌకర్యాన్ని ఉపయోగించుకుని విద్య మీద దృష్టి పెట్టారు.

 

7.        విస్తృతంగా కాకపోయినా అరుదుగా అయినా యజమానికులాల అమ్మాయిలకు చదువుకోని స్వీయసామాజికవర్గ అబ్బాయిలకన్నా చదువుకున్న దళిత యువకులు ఒక ఆకర్షణగా మారారు. వాళ్ళ మధ్య ప్రేమ అనేది కాకపోయినా స్నేహాలు పెరిగాయి.

 

8.        పట్టణాలలో మొదలయిన ఈ కులాంతర స్నేహాలు గ్రామాల్లో ద్వేషాలు పెరగడానికి దోహదపడ్డాయి.

 

9.        గ్రామాలు అనాగరీక కులతత్వ మురికి కూపాలు. గ్రామాల్లో పైకి కనిపించే అనుబంధాలు కూడా కులతత్వం, ముఠాత్త్వంతో ఏర్పడ్డవే. అవి అంతర్ముఖీన సమూహాలు.

 

10.   సమిష్ఠి సంపద పెరిగినా, సంపదకు సమిష్ఠి ముప్పు వచ్చినా యజమానికులాలు, శ్రామికకులాల మధ్య ఒక ఐక్యత ఏర్పడుతుంది. అలాంటి ఐక్యత ప్రస్తుతం అమరావతి గ్రామాల్లో కనిపిస్తున్నది. పట్టణీకరణ జరిగే కొద్దీ ఇలాంటి ఐక్యతలు పెరగవచ్చు.

No comments:

Post a Comment