Monday 21 June 2021

Do you know how fast the corona third wave is coming?

Do you know how fast the corona third wave is coming?

కరోనా థర్డ్ వేవ్ ఎంత ఉధృతంగా  వస్తున్నదో తెలుసా?॥

 

1.        కరోనా సెకండ్ వేవ్ అన్ లాకింగ్ ప్రక్రియ మొదలయిపోయింది. ఇప్పుడు హాట్ టాపిక్ కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తున్నదనీ?

 

2.        కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిపోతున్నప్పుడు కూడ సెకండ్ వేవ్ గురించి ఇలాంటి చర్చే జరిగింది.

 

3.        మనం చర్చిస్తామే తప్ప రానున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిధ్ధపడం. వీలయితే ప్రమాదాన్ని చాలా తేలిగ్గా తీసిపడేస్తాం.

 

4.        కరోనా ఫస్ట్ వేవ్ లో మనం సిధ్దంగా లేకపోవడాన్ని అర్థం చేసుకుని క్షమించవచ్చు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి సిధ్ధపడక పోవడాన్ని అలా క్షమించవచ్చా?

 

5.        ఇప్పుడు కరోనా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికైనా మనం సిధ్ధపడతామా? హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్య పెంచుతామా? ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతామా? అవసరమైన వెంటిలేటర్లు సమకూర్చుకుంటామా?మందులు సిధ్ధంగా వుంచుతామా? డ్రగ్స్ బ్లాక్ మార్కెటింగ్ ను నియంత్రిస్తామా? క్రోనా మృతుల అంత్యక్రియలకు అవసరమైన మేర  లాజిస్టిక్స్ ను పెంచుతామా?

 

6.        ఇవేవీ చేయకుండ మనం ఓ పన్నెండు గంటలు ఇంట్లో కూర్చొని భజన చేస్తే రోడ్డు మీద కరోనా దిక్కులేక చనిపోతుందని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తామా?

 

7.        12 గంటల తరువాత కరోనా చనిపోతుంది గనుక ఇళ్ళ కప్పులెక్కి పళ్ళాలు, చెంబులు, తప్పేళాలు వాయిస్తూ సంబరాలు  పండుగ చేసుకోమంటారా?

 

8.        మనం మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిధ్ధపడినా పడకపోయినా కరోనా మాత్రం మళ్ళీ ర్కతప్పదు అంటున్నారు నిపుణులు.

 

9.        కరోనా ఫస్ట్ వేవ్  వెనక్కు మళ్ళిన  ఆరు నెలల తరువాత కరోనా సెకండ్  వేవ్  వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ వెనక్కు మళ్ళిన  ఆరు వారాల్లోనే కరోనా థర్డ్  వేవ్  వస్తుందట.

 

10.    వస్తుంద్ట కాదు వచ్చి తీరుతుందట.

 

11.   కరోనా మూడో వేవ్ రావడం అనివార్యం "inevitable" అంటున్నారు ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్  డాక్టర్  రణదీప్ గులేరియా.

 

12.   రానున్న ఆరు లేదా ఎనిమిది వారాల్లో కరోనా మూడో వేవ్ కఛ్ఛితంగా వచ్చి తీరుతుందని వారు అంటున్నారు.

 

13.   పైగా కరోనా మొదటి వేవ్ కన్నా కరోనా రెండో వేవ్ తీవ్రంగా వున్నట్టు కరోనా రెండో వేవ్ కన్నా కరోనా మూడో వేవ్ మరీ ఉధృతంగా వుంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

 

14.   కొత్తగా వస్తున్న డెల్టా వేరియంట్ చాల వేగంగా వ్యాపిస్తుంది. చాలా త్వరగా సోకుతుంది. చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుందని డాక్టర్  రణదీప్ గులేరియా వివరిస్తున్నారు.

 

15.   మహారాష్ట్రలో కరోన రెండో వేవ్ ఒక లక్షా 40 వేల మందికి సోకింది.  రాష్ట్రంలో థర్డ్ వేవ్ 8 లక్షల మందికి సోకే ప్రమాదం వుందని వారు అంచనా వేస్తున్నారు.

 

16.   కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ మూడు రెట్లు ఎక్కువ మందికి సోకింది. కరోనా రెండో వేవ్ కన్నా మూడో వేవ్ ఐదు రెట్లు ఎక్కువ మందికి సోకుతుందట.

 

17.    మామూలు మాటల్లో చెప్పాలంటే కరోనా మొదటి వేవ్ లో ఊరికి ఒక్రు చనిపోతే రెండో వేవ్ లో వీధికి ఒకరు చనిపోయారు. కరోనా థర్డ్ వేవ్ లో ఇంటికి ఒక్రు చనిపోతారట.

 

18.   కరోనా థర్డ్ వేవ్ ను కట్టడి చేయలేమా?  అంటే ఒక ప్రణ్ళిక వుంటే కట్టడి చేయవచ్చట.

 

19.   మొదటిది; సాధ్యమయినంత మందికి సాధ్యమయినంత త్వరగా  కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయడం పూర్తిచేయాలి.

 

20.   అవసరం అయితే వ్యాక్సిన్ మొదటి డోసుకూ రెండో డోసుకు మధ్య ఆరు వారాల కాల వ్యవధిని తగ్గించాలి.

 

21.   దేశంలో ప్రతి ఒక్కరూ మాస్కులు, గ్లౌజులు, శానిటైజ్ర్లు వాడాలి. సామాజికదూరం పాటించాలి. గుమిగూడడం మానివేయాలి. లాక్ డౌన్ నిబంధనల్ని కఛ్ఛితంగా పాటించాలి.

 

22. అలాగే ప్రభుత్వాలు COVID-appropriate behaviourను పాటించాలి. అంటే వైద్య సిబ్బందిని, మందుల్ని, వైద్య పరికరాల్ని, ఆక్సిజన్ ప్లాంట్లను, క్వారంటైన్ సెంటర్లనూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సిధ్ధంగా వుంచాలీ?

 

23. ఆ పని ప్రభుత్వాలు చేస్తాయా? కరోనా నియంత్రణ బాధ్యత కేంద్రానిదని ఒకరూ, కాదూ రాష్ట్ర ప్రభుత్వాలది అని మరొకరు పరస్పరం నిందలేసుకుంటూ కాలం గడుపుతాయా?

 

24.   కేంద్ర ప్రభుత్వం తప్పుచేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుచేసినా నష్టపోయేది ప్రజలే.

 

25.   త్వరలోమరోటాపిక్ తో కలుద్దాం.   

No comments:

Post a Comment