Covid strains 60
కరోన అవతారాలు అరవై
1.
కరోనా
పేరు ఒకటే అవతారాలు అరవై.
2.
ఇప్పుడు
మనం కరోన అంటున్న దాని పూర్తి పేరు Corona Virus Disease 2019. క్లుప్తంగా COVID-19 అంటున్నాం. 2019 డిసెంబరులో
చైనాలోన వూహాన్ లో ఇది మొదటిసారి బయటపడింది.
3.
2003లో
కూడ కరోనా వచ్చింది. అప్పుడు దాన్ని Severe acute respiratory syndrome (SARS) అనేవారు.
4.
ఇప్పుడున్న
కరోనాకు కూడ అనేక శాఖలు, గోత్రాలు, కుదుళ్ళు వున్నాయి. వీటినే strains అంటున్నారు. ఇప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 50 రకాల క్రోనా వైరస్ లను కనుగొన్నది.
5.
ఇది ఇప్పటికి రెండు అలలుగా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా
18 కోట్ల మందికి సోకింది. 40 లక్షల మందిని బలిగొంది. ఇప్పుడు మూడో అల వస్తున్నది అంటున్నారు.
6.
ఇది
చాలనట్టు కొత్త స్ట్రేయిన్ ఒకదాన్ని కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31న ప్రకటించింది.
దానికి ‘లామ్డా’ అని పేరు పెట్టారు.
7.
ముందుగా
దీన్ని పెరూ దేశంలో కనుగొన్నారు. దక్షణ అమెరికా ఖండంలోని 29 దేశాల్లో ‘లామ్డా’ వునికిని
గుర్తించారు.
8.
లాటిన్
అమెరిక ప్రాంతంలోని చీలీ, పెరూ, ఈక్వెడార్, అర్జెంటైనా దేశాల్లో ‘లామ్డా’ వైరస్ విస్తరిస్తోంది
9.
వైరస్
లను సాధారణంగా రెండు రకాలుగా విభజిస్తారు. పరిశీలనలో వున్నవి; పట్టించుకోవాల్సినవి.
of interest and of concern.
10.
పట్టించుకోవాల్సినవి
అంటే వేగంగా వ్యాపిస్తున్నవి అని, పరిశీలనలో వున్నవి అంటే ఇంకా ఆ సామర్ధ్యాన్ని పుంజుకోనివి
అని అర్ధం చేసుకోవచ్చు.
11.
ప్రపంచ
ఆరోగ్య సంస్థ ‘లామ్డా’ వైరస్ ను జూన్ 14న ‘పరిశీలనలో వున్నవి’ of interest గా
ప్రకటించింది. అంటే ఇప్పటికి అంత ప్రమాదకరమైనది కాదని అర్ధం.
12.
ఇప్పుడు
ప్రమాదకరంకానిది రేపు ప్రమాదకరం కావచ్చు. మనం దేనికైనా సిధ్ధంగా వుండాలి.
ముక్కుకు, నోటికి మాస్క్, చేతులకు గ్లౌజులు. ఇతరులకు దూరంగా వుండడం. క్లినికల్ డిస్టాన్స్. అంతే
No comments:
Post a Comment