లక్షద్వీప్ లో కశ్మీర్ ఫార్మూలా
Kashmir Formula in Lakshadweep
1.
ఈరోజు హాట్ టాపిక్ లక్షద్వీప్.
2.
త్రివేండ్రం నుండి ఢిల్లీ వరకు, అధికారపక్షం నుండి ప్రతిపక్షం
వరకు, యాక్టివిస్టుల నుండి న్యాయస్థానాల వరకు ఇప్పుడు చర్చంతా
లక్షద్వీప్ గురించే.
3.
లక్షద్వీప్ లో ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది?
4.
పెద్ద ఎత్తున అభివృధ్ధి పథకాలు చేపడుతున్నామనీ, అధునాతన రోడ్లు నిర్మిస్తున్నామనీ, ఫైవ్ స్టార్
హోటళ్ళు కడుతున్నామనీ, స్మార్ట్ సిటీలను సృష్టిస్తున్నామనీ లక్షద్వీప్ కేంద్ర పాలిత
ప్రాంత అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ అంటున్నారు.
5.
తాను లక్షద్వీప్ ను అభివృధ్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే
అభివృధ్ధి నిరోధకులు, అరాచకశక్తులు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు?
6.
వినడానికి ఇదంతా
చాలా బాగుంది. కానీ ప్రఫుల్ ఖోడా పటేల్ చెపుతున్నదంతా నిజమేనా? అందులో వాస్తవం ఎంత?
7.
కేరళ రాష్ట్రానికి
పశ్చిమ దిక్కున అరేబియ సముద్రంలో వున్న 36 చిన్న చిన్న ద్వీపాల సమాహారాన్ని లక్షద్వీప్ అంటారు.
8.
36 ద్వీపాల మొత్తం జనాభా 66 వేలు. అన్నింటికన్నాపెద్ద ద్వీపం
పొడవు నాలుగు కిలో మీటర్లు. మిగిలిన ద్వీపాలు ఎంత చిన్నవో ఊహించుకోవచ్చు.
9.
ఈ కేంద్రపాలిత రాష్ట్రానికి భౌగోళికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా
కేరళతో అనుబంధం ఎక్కువ.
10. అత్యధికులు
మళయాళం మాట్లాడుతారు.
11. సామాజికవర్గం
పరంగా లక్షద్వీప్ జనాభా ఆదివాసులు. వారిలో
99 శాతం మంది ముస్లింలు.
12. పర్యావరణ
పరంగా లక్షద్వీప్ కు ఒక ప్రత్యేకత వుంది. బయో డైవర్సిటీ - జీవ వైవిధ్యం చాలా ఎక్కువ.
కాలుష్యం చాల తక్కువ. తెల్లటి ఇసుక, లేత నీలం రంగు సముద్రం. సముద్రం ఇంత స్వఛ్ఛంగా
దేశంలో మరెక్కడా కనిపించదు.
13. ఫెర్టిలిటీ
రేటు (జనాభా పెరుగుదల రేటు) దేశ సగటు 2.2 కన్న
చాలా తకువ.
14. దేశంలో
ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా వున్న రాష్ట్రం బీహార్
3.2. తక్కువగా వున్న రాష్ట్రాలు ఢిల్లీ 1.5, జమ్మూకశ్మీర్ 1.6, కేరళ 1.7.
15. లక్షద్వీప్
ఫెర్టిలిటీ రేటు మ్రీ తక్కువ. కేవలం 1.4.
16. దేశంలో
అత్యధిక అక్షరాశ్యతగల రాష్ట్రం కూడ లక్షద్వీప్. ఇక్కడ మహిళల అక్షరాశ్యతే 96.5 శాతం.
17. భారతదేశంలో
అతి ఎక్కువ క్రైం రేటుగల రాష్ట్రాలు మహ్రాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్. అయితే అతి తక్కువ
క్రైం రేటు గల ప్రాంతం లక్షద్వీప్. ఇక్కడ నేరాలు దాదాపు లేనట్టే.
18. అతితక్కువ
క్రైం రేటు, అత్యధిక అక్షరాశ్యత, అతి తక్కువ జనాభా పెరుగుదల గల రాష్ట్రంలో ప్రఫుల్
ఖోడా పటేల్ కొత్తగా ఏం అభివృధ్ధి చేయదలచుకున్నారూ?
19. ఫైవ్
స్టార్ హోటళ్ళు ఎవరు కడతారూ? ఎవరికోసం కడతారూ? ఎవరి స్థలాల్లో కడతారూ?
20. ఆదివాసుల
ప్రాంతాల్లో వాళ్ళ సంస్కృతీని ప్రిరక్షించాలని రాజ్యాంగం చెపుతోంది. ప్రఫుల్ ఖోడ పటేల్ ప్రతిపాదనలు స్థానిక
సంస్కృతిని దెబ్బ తీసేలా వున్నాయి.
21. ఆదివాసీ
ప్రాంతాల్లో బయటివారు భూములు కొనరాదనే చట్టం ఒకటి వుంది. దానిని పట్టించుకునే స్థితిలో
అడ్మినిస్ట్రేటర్ లేరు.
22. ఆదివాసుల భూముల్ని బలవంతంగా
స్వాధీనం చేసుకోవడానికి ఒక చట్టాన్ని రూపొందించేపనిలో
ప్రఫుల్ పటేల్ వున్నారు. ప్రస్తుతం ఇది డ్రాప్ట్ రూపంలో వుంది. అడ్మినిస్ట్రేట్ర్ తలచుకుంటే
ఏ స్థలాన్ని అయినా ప్రభుత్వం ‘ప్లానింగ్ ఏరియా’గా
ప్రకటించి ఎలాంటి నష్టపరిహారాన్నీ చెల్లించకుండ స్వాధీనం చేసుకోవచ్చు. ఆ బిల్లు చట్టం
అయితే లక్షద్వీప్ లో మరింత విధ్వంసం సాగుతుంది.
23. ఇంత
అడ్డగోలుగా పాలన ఎలా సాధ్యం అయిందని ఎవరయినా అడగవచ్చు. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయిన
పరిపాలనకు అనేక అంతస్తులు వుంటాయి. గ్రామపంచాయితీ, మండల పంచాయితీ, జిల్లాపరిషత్, పట్టణ
పాలక మండలి, నగర పాలక సంస్థ అనే స్థానిక విభాగాలు. శాసనసభ, శాసనమండలి అనే రాష్ట్ర విభాగాలు,
లోక్ సభ, రాజ్యసభ అనే జాతీయ విభాగాలు వుంటాయి.
24. కేంద్రపాలిత
ప్రాంతాల్లో ఇన్ని అంతస్తులు వుండవు. కింద గ్రామ పంచాయితీలు వుంటాయి. మధ్యలో ఒక ఎంపీ
వుంటాడు. మొత్తం పరిపాలన విభాగానికి ఒక అడ్మినిస్ట్రేటరు వుంటాడు.
25. విద్యా,
వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పశుపోషణ, చేపల పరిశ్రమ
మొదలయినవన్నీ పంచాయితీల ఆధీనంలో వుంటాయి.
26. ప్రఫుల్ పటేల్ పంచాయితీల నుండి ఈ విభాగాలను తీసుకున్నారు.
ప్రజాస్వామాన్ని మంటగలిపి కొత్త రకం రాచరికాన్ని ప్రవేశపెట్టారు.
27. లక్షద్వీప్
లో చేపలవేట ప్రధాన వృత్తి. తరువాత వ్యవసాయం, పశుపోషణ వస్తాయి.
28. కొత్తగా
రిసార్ట్స్, స్టార్ హొటళ్ళు నిర్మించడానికి
తీరం వెంబడివున్న ఇళ్ళను, ఫిషింగ్ హార్బర్లను తొలగించారు.
29. దానితో
జాలర్లు ఆందోళనకు దిగారు. వాళ్ళను అభివృధ్ధి నిరోధకులంటూ, అరాచక శక్తులంటూ పేర్కొంటూ
అరెస్టులు చేశారు.
30. ధర్నాలు,
రాస్తారోకోలు చేసే వారిని ఏ రాష్ట్రంలో అయినా లాంఛనంగా అరెస్టు చేసి ఓ రెండు మూడు గంటల
తరువాత పోలీస్ సేషన్ బెయిలుతో వదిలేస్తారు. ఇప్పుడు లక్షద్వీప్ లో రాస్తారోకోలు చేసిన
వారిని కూడ జుడీషియల్ కష్టడీకీ పంపిస్తున్నారు.
31. ఇప్పటి వరకు నేరాలులేని ప్రాంతం కనుక లక్షద్వీప్ లో విశాలమైన జైళ్ళు కూడా
లేవు. ఇప్పుడు స్కూళ్ళను ఖాళీ చేసి జైళ్ళుగా మార్చారు.
32. రాస్తారోకో
చేసేవారిని జైళ్ళకు పంపించడానికి కేరళ హైకోర్టు
తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణం వాళ్ళను విడుదల చేయాలని లక్షద్వీప్ చీఫ్ జుడీషియల్
మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.
33. ప్రఫుల్
పటేల్ ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను తప్పించుకోవడానికి
యాంటీ గూండా చట్టాన్ని తీసుకుని వచ్చారు. అరెస్టు చేసిన వ్యక్తుల్ని విచారణ లేకుండ
ఏడాది పాటు జైల్లో వుంచడానికి ఈ చట్టం అనుమతినిస్తుంది.
34. దేశంలో
అత్యల్ప క్రైం రేటువున్న ప్రాంతంలో యాంటీ గూండా చట్టాన్ని తేవడం మీద మళ్ళీ నిరసనలువెల్లువెత్తాయి.
35. నిరసన
తెలిపిన వాళ్ళంతా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ దృష్టిలో గూండాలు, జాతి వ్యతిరేకులు, దేశద్రోహులు.
36. చేపలవేట
పోయింది, వ్యవసాయ భూములు పోయాయి, స్కూళ్ళూ జైలుగా మారాయి. ఆదివాసులు ఖైదీలుగా మారారు.
37. ఇది
చాల్దన్నట్టు ఇద్దరు కన్నా ఎక్కువ సంతానం కలిగినవారు
పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని ఇంకో కొత్త చట్టాని తెచ్చారు ప్రఫుల్
పటేల్.
38. ఫెర్టిలిటీ
రేటు అత్యంత తక్కువగా వున్న ప్రాంతంలో ఇలాంటి చట్టాన్ని తేవడం దుర్మార్గం. లక్షద్వీప్
లో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రజాప్రతిధుల్ని బలహీనపరచడానికే ఈ చట్టాన్ని తెచ్చారనేది
స్పష్టం.
39. ఇదీ
ప్రఫుల్ పటేల్ మార్కు గుజరాత్ మోడల్ అభివృధ్ధి. ఈ అభివృధ్ధి ఎవరి కోసం? టూరిజం కోసం.
స్టార్ హోటళ్ళ కోసం?
40. గుజరాత్
మోడల్ అంటే గుజరాత్ రాష్ ట్రాన్ని అభివృధ్ధి
చేయడం కాదు; దేశంలోని ప్రతి ప్రాజెక్టును గుజరాత్ కార్పొరేట్లకు కట్టబెట్టడం
41. కష్టం
లక్షద్వీప్ ఆదివాసులది; లాభం గుజరాత్ కార్పొరేట్లది.
ప్రఫుల్ పటేల్ విధానాల ఆర్ధికసారం ఇది.
42. స్కూళ్ళలో
మధ్యాహ్నభోజన పథకం కింద బీఫ్ వడ్డించడం లక్షద్వీప్
లో మొదటి నుండీ వస్తున్న సాంప్రదాయం. బీఫ్
అంటే గేదె, దున్నపోతు మాసం.
43. స్కూళ్ళలో
బీఫ్ వడ్డించడానికి వీల్లేదంటూ ప్రఫుల్ పటేల్ ఒక ఫర్మానా జారీ చేశారు.
44. బీఫ్
బ్యాన్ అనేది బిజేపికి జాతీయ విధానం ఏమీ కాదు.
అదొక ఓట్ల జిమ్మిక్కు.
45. ఉత్తరప్రదేశ్
లో బీఫ్ ను బ్యాన్ చేస్తానని చెప్పి ఓట్లు గుంజుకుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్
ను అనుమతిస్తానని చెప్పి ఓటర్లను ఆకర్షిస్తుంది.
46. నాలుగేళ్ళ
క్రితం కేరళలో మలప్పురం బై-ఎలక్షన్లో బిజేపి అభ్యర్ధి ఎన్ శ్రీప్రకాష్ “మీరు నాకు ఓటేయండి;
నేను మీకు నాణ్యమైన బీఫ్ సప్లయి చేస్తాను”
అని వాగ్దానం చేశాడు.
47. కేరళ-లక్షద్వీప్
అనుబంధాన్ని రద్దు చేయడానికి కూడ ప్రప్ఫుల్ పటేల్ ఇప్పుడు పావులు కదుపుతున్నారు.
48. మెయిన్
ల్యాండ్ భ్రతదేశంలో లక్షద్వీప్ కు అతి దగ్గరి పోర్టు కొచ్చి. కొచ్చి- లక్షద్వీప్ మధ్య
సాగుతున్న సముద్ర రవాణాను రద్దు చేసి మంగళూరుకు
మళ్ళించే ప్రయత్నాలు మొదలెట్టారు.
49. లక్షద్వీప్-
కొచ్చి మధ్య దూరం 500 కిలోమీటర్లు. లక్షద్వీప్
– మంగళూరు మధ్య దూరం వెయ్యి కిలో మీటర్లు. కొచ్చి కేరళలో వుంది. కేరళ కమ్యూనిస్టుల
పాలనలో వుంది. మంగళూరు కర్ణాటకలో వుంది. కర్ణాటకలో బిజెపి పాలన వుంది. అదీ లెఖ్ఖ.
50. ఇదంతా
చాలనట్టు సెకండ్ వేవ్ కరోనా లక్షద్వీప్ లో ఒక సునామీనే సృష్టించింది.
51. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు దేశం మొత్తమ్మీద
కోవిడ్ ఫ్రీ రాష్టంగా వున్నది లక్షద్వీప్ ఒక్కటే.
52. ఐఏఎస్
అధికారి దీనేశ్వర్ శర్మ అప్పుడు లక్షద్వీప్
అడ్మినిస్ట్రేటరుగా వుండేవారు. కరోనా నివారణ
చర్యల్ని లక్షద్వీప్ వాసులు చాలా నిష్టగా పాటించారు. బయటినుండి వచ్చేవారిని 14 రోజులు కఛ్ఛితంగా క్వారంటైన్
లో వుంచేవారు. లోపల అందరూ క్లినికల్ డిస్టాన్స్ ను నిష్టగా పాటించారు. వీటి ఫలితంగా
లక్షద్వీప్ లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదు.
53. గత
ఏడాది డిసెంబరు 5న ప్రఫుల్ ఖోడా పటేల్ కొత్త అడ్మినిస్ట్రేటరుగా నియమితులయ్యారు. ఐఏఎస్
అధికారుల్ని అడ్మినిస్ట్రేటర్లుగా నియమించడం సాంప్రదాయం. అందుకు భిన్నంగ ఒక రాజకీయ నాయకుడ్ని నియమించడం మీద మొదట్లోనే విమర్శలు వచ్చాయి.
54. ప్రఫుల్
పటేల్ ను ముందు దాద్రా-నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటరుగా నియమించారు.
తరువాత దయ్యు-దామన్ లను అప్పచెప్పారు. ఇప్పుడు లక్షద్వీప్ ను ఆయనకే ఇచ్చారు. ప్రఫుల్
పటేల్ ప్రస్తుతం ఏకంగా మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటర్ గా వుంటున్నారు.
55. టూరిజాన్ని
అభివృధ్ధి చేయాలంటూ ఆయన 14 రోజుల క్వారంటైన్ నిబంధనను ఎత్తి వేశారు. బయటి
నుండి వచ్చేవారు క్రోనా ‘నెగటివ్’ రిపోర్టు చూపిస్తే చాలు అని ప్రకటించారు. కానీ, కరోనా టెస్టు రిపోర్టుల్లో 30 శాతం తప్పుడు
అనే విమర్శలు మొదటి నుండీ వున్నాయి.
56. టూరిజం
అభివృధ్ధి పథకం లక్షద్వీప్ ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. కరోనా నిబంధనల్ని సడలించడంతో
రెండు వారాల్లోనే లక్షద్వీప్ లో కరోనా ప్రవేశించింది.
57. ఈ ఏడాది జనవరి 18న తొలి కరోనా కేసు నమోదయింది. ఇప్పటికి
అధిక్రిక లెఖ్ఖల ప్రకారం 7269 కేసులు నమోదయ్యాయి. 126 మంది చనిపోయారు.
58. 65 వేల మంది జనాభా
వున్న ప్రాంతంలో 7269 కరోనా కేసులు అంటే చాలా ఎక్కువ.
59. మనదేశ
జనాభా 137 కోట్లు. ఇప్పటికి కరోనా సోకిన కేసులు 2 కోట్ల 96 లక్షల మంది. అంటే 2.16 శాతం.
లక్షద్వీప్ జనాభా 65 వేల మంది కరోనా సోకిన కేసులు 7269 అంటే 11.18శాతం. ఇది దేశ సగటుకన్నా
5 రెట్లు కన్నా ఎక్కువ.
60. అంతేకాదు జాతీయ గణాంకాలు 18 నెలలకు సంబంధించినవి. లక్షద్వీప్ గణాంకాలు 5 నెలలకు సంబంధించినవి. దీనిని బట్టి అక్కడ
ఏ స్థాయిలో కరోనా విజృంభించిందో ఊహించుకోవచ్చు.
61. కరోన ఇంతగా విజృంభిస్తున్నా నివారణ చర్యల్ని తీసుకోవడానికి
ప్రఫుల్ పటేల్ ససేమిర అంటున్నారు. టూరిజం ఫస్ట్ అనేది ఆయన నినాదం.
62. కరోనా
విషయంలో అడ్మినిస్ట్రేటర్ అనుసరించిన తప్పుడు
విధానాలను ఆయేషా సుల్తానా అనే నటి తీవ్రంగా దుయ్యబట్టింది. ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్ పాలిట ‘బయోవెపన్’ ‘జీవాయుధం’గా
వ్యవహరిస్తున్నారు అని విమర్శించింది.
63. ఇప్పుడు
ఆమె మీద దేశద్రోహం, విద్వేష ప్రసంగం ఆరోపణలతో
సిఆర్ పిసి సెక్షన్లు 124 ఏ, 153 బిల కింద కేసులు నమోదు చేశారు.
64. విచిత్రం
ఏమంటే లక్షద్వీప్ బిజెపి శాఖలోనే అనేక మంది ఆయేషా సుల్తానాకు మద్దతుగా నిలిచారు. ఏకంగా
15 మంది బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తమ పదవులకు, పార్టి ప్రాధమిక సభ్యత్వానికీ
రాజీనామ చేశారు.
65. లక్షద్వీప్
ప్రజల మీద అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్
ఎందుకు ఇంతగా కక్షగట్టి వ్యవహరిస్తున్నారూ? అనే చర్చ ఇప్పుడు లక్షద్వీప్, కేరళలోనేకాక,
దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
66. అనేకమంది
సామాజిక కార్యకర్తలు లక్షద్వీప్ పరిణామాల
మీద అనేక ఆసక్తికర సూత్రీకరణలు చేస్తున్నారు.
67. ప్రఫుల్
పటేల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితులు. సొహ్రాబుద్దీన్ హత్య కేసులో
నిందితునిగా నమోదు కావడంతో అప్పట్లో గుజరాత్ హొం మంత్రిగావున్న అమిత్ షా తన పదవికి
రాజీనామా చేశారు. అప్పుడాయన తన వారసునిగా ప్రఫుల్ పటేల్ ను సూచించారు. అలా ప్రఫుల్
పటేల్ కొన్నాళ్ళు గుజరాత్ హొంమంత్రిగా పనిచేశారు.
68. ఇప్పుడు
అమిత్ షా పాలసీలను ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్ లో అమలు చేస్తున్నారు.
69. జమ్మూ
కశ్మీర్ కన్నా ముస్లీం మెజారిటీ అధికంగా వున్న ప్రాంతం లక్షద్వీప్.
70. జమ్ము-
కశ్మీర్ కు రాష్ట్ర హోదాను తీసివేశారు. కశ్మీర్ లోయలో స్థానిక (ముస్లిం) రైతుల ప్రత్యేక
హక్కుల్ని రద్దు చేశారు. అదేవిధంగా, లక్షద్వీప్
లో స్థానిక (ముస్లిం) ఆదివాసి తెగల ప్రత్యేక హక్కుల్ని రద్దు చేసే ఒక పథకం అమలవుతోందనేది
ఒక కథనం.
71. లక్షద్వీప్
లో స్థానికుల భూమిల్ని లాక్కోవడంలో కమలనాధులకు రెండు ప్రయోజనాలు వున్నాయి. ఒకవైపు ముస్లింల
ఆర్ధిక పునాదిని బలహీన పరచడం, మరోవైపు వాటిని
గుజరాత్ కార్పొరేట్లకు కట్టబెట్టడం.
72. ముస్లింల
సంస్కృతిని, ఆహారపు అలవాట్లను దెబ్బతీయడం
ఇంకో లక్ష్యం. మద్య నిషేధాన్ని ఎత్తివేయడం కూడ అందులో భాగమే.
73. పాఠశాల
వ్యవస్థను బలహీన పరచడం ద్వార అత్యధిక అక్షారాశ్యత రికార్డును చెరిపివేయడం ఇంకో లక్ష్యం.
74. కరోనా
నిబంధనల్ని తొలగించడం కూడ ఒక ఒక కుట్రే అంటున్నారు బుధ్ధిజీవులు.
75. కుంభమేళ
నిర్వహణ, బెంగాల్ ఎన్నికలు జరపడంతో దేశంలో కరోన సెకండ్ వేవ్ విజృంభించిందని కేంద్ర ప్రభుత్వం మీద సర్వత్రా విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.
76. లక్షద్వీప్
లో కరోనా గణాంకాలతో ముస్లింలను ‘సూపర్ స్ప్రేడర్స్’ గా చిత్రించి కుంభమేళ నింద నుండి కేంద్ర ప్రభుత్వాన్ని
తప్పించడం మరో లక్ష్యం.
77. కరోనా
ఫస్ట్ వేవ్ లోనూ అలాగే జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్య్టన,
విదేశీ యాత్రికుల ఫ్రీ ఎంట్రీ, ఢిల్లీ ఎన్నికలు, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కరోన వ్యాప్తి
చెందింది. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి మర్కజ్ మీద నిందలేశారు. కొన్ని రోజులు ముస్లింలను
‘సూపర్ స్ప్రెడర్లు’గా ప్రచారం చేశారు.
78. ఢిల్లీ
మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో నడిచిన మర్కజ్ కేసు తీర్పు ఇటీవల ఫిబ్రవరి 21న
వచ్చింది. ... as per the list of evacuees, none of the accused was having COVID
-19 symptoms and hence there was no question of any negligent act on their
part, which to their knowledge or belief was likely to spread infection. – అని కోర్టు ఆర్డర్ లో పేర్కొన్నారు.
79. ఇప్పటి
పరిస్థితి వేరు. ప్రభుత్వ పెద్దల ప్రకటనలు, ఆరోపణల్ని నమ్మేవారి సంఖ్య తగ్గిపోతున్నది.
80. అయితే,
ఇప్పుడు దేశ వ్యాప్తంగా లక్షద్వీప్ ప్రజలకు మద్దతు పెరుగుతున్నది. ప్రఫుల్ పటేల్ ను
అడ్మినిస్ట్రేటర్ పదవి నుండి తొలగించాలనే డిమాండ్ బలపడుతున్నది.
81. కేంద్ర
ప్రభుత్వం స్పందిస్తుందా? కశ్మీర్ ప్లాన్ ‘బి’ ని కొనసాగిస్తుందా?
18 జూన్ 2021, Friday
@10 a.m. LIVE on Danny Telugu TV
https://www.youtube.com/watch?v=c2j2rbkSn90
No comments:
Post a Comment