"భారతదేశాంలో ఫాసిజం వచ్చే అవకాశాలు లేవు" "నేటి మోదీ పాలనను ఫాసిస్టు అని అనలేం”
అంటూ కొన్ని కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా బల్లగుద్ది వాదిస్తున్నాయి. ఈ జాబితాలో మావోయిస్టులు కూడ చేరారు. ఇప్పటికే ఫాసిజాన్ని అనుభవిస్తున్న మైనారిటీ సమూహాల ఆవేదన వాటికి అర్ధం కావడంలేదు.
ఈ అంశం మీద నేను త్వరలో ఒక చర్చ చేయదలిచాను. దానికి పూర్వరంగంగా 2020 నాటి తమ్మినేని వీరభద్రం ప్రసంగాన్ని వినాలని కోరుతున్నాను. పాఠక్షకుల సౌకర్యార్ధం. వారి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలను టైమ్ లైన్ తో పాటు ఇచ్చాను. తప్పక చదవండి.
"నేటి మోదీ పాలనను ఫాసిస్టు అని అనలేం”
– కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం.
Tammineni Veerabhadram - On Fascism / 9 December 2019 / MBK - Vijayawada
1. …. భారత దేశంలో వున్న ప్రభుత్వం అత్యంత నియంతృత్వంగా, ఒక మతోన్మాద రాజ్యంగా, ఒక టెర్రరిస్టు కేంద్రంగా మారిపోతోంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఈ పోకడల్ని ఎదుర్కోవడం ఎలా? ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ఎలా? రాజకీయాలను స్వఛ్ఛ రాజకీయాలుగా మార్చడం ఎలా? ఇదీ భారత ప్రజల ముందున్న కర్తవ్యం. (16.40 – 17.28 mnts.)
2. అయితే ఇక్కడే ఒక సమస్య. దీన్ని ఫాసిస్టు అందామా? అనడానికి ఏమీ అభ్యంతరం లేదు. నాకు కూడ మోడీ ప్రభుత్వం మీద చాలా ఎక్కువ ఎక్కువగా కోపం వుంది. కాని తిట్టేటప్పుడు కూడ శాస్త్రీయంగా తిట్టాలి. (17.28 – 17.50 mnts.).
3. ఒక పాసిస్టు గవర్నమెంటు ఇదీ అని ఒక డెఫినిషన్ ఇచ్చామనుకోండి ఆటోమెటిక్ గా ఒక కర్తవ్యం ప్రజాతంత్రవాదుల ముందుకు వచ్చేస్తుంది. ఆటోమెటిక్ గా కమ్యూనిస్టులు అందరి ముందుకు ఒక కర్తవ్యం వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ కమ్యూనిస్టులు మొత్తం ఈ దేశంలో వున్న సకల పౌరులు …. సకల పౌరులు టాటా బిర్లా గోయంకాలతో సహా ఈదేశ ప్రజానీకం మొత్తానికి ఒక కర్తవ్యం ముందుకు వస్తుంది. ఆల్ ఇన్ ఒన్ పొలిటికల్ ఫ్రంట్. ఈ పరిణామాన్ని కోరుకునేవారు చేసే వాదన వేరు. లేదా ఆ పరిణామం సంగతి సరిగా తెలియక కూడ ఫాసిజం అనీ … ఇలాంటి మాటలు మాటలు మాట్లాడే పరిస్థితులు కూడా వేరే వుంటాయి. (18.50 – 19.36 mnts.).
4. సరే ఫాసిజం అంటే ఏమిటీ? What is the definition of Fascism? దీన్ని నేనొక డెఫినిషన్ వేరొకరు ఇంకో డెఫినిషన్ చెప్పడం వేరు. బట్.. పాసిజం ప్రపంచం లోనికి 1920s నుండి 1930s 40s దాక ఏదైతే వున్నాయో ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా వున్న పరిస్థితి కార్మికోద్యమం ఉధృతంగా వున్న ఉద్యమం. ఈ అప్ సర్జ్ లో వున్న కమ్యూనిస్టు ఉద్యమాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక ధోరణి ఒక రూపం ఫాసిజం. ఒక కమ్యూనిస్టు ఉద్యమాన్నీ రివల్యూషన్ ను నాశనం చేయడమేకాదు కేపిటలిస్టులకు లేబర్ కు మధ్యన జరిగిన ఆ ఘర్షణలో, పెట్టుబడీ శ్రమల మధ్య జరిగిన యుధ్ధంలో ఆ యుధ్ధం ఎత్తుగడల్లో శ్రమను లొంగదీసుకోవడాని కోసం పెట్టుబడి తన విశ్వరూపాన్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించడం కోసం మార్కేట్ల వేటలో ముందుకు వచ్చిన ఒక రూపం ఫాసిజం. (19.36 – 20.36 mnts.).
5. ఆనాటి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 1930లో కొమింగ్ టర్న్ 6వ కాన్ఫెరెన్స్ లో ఫాసిజం గురించి చర్చించి ఒక సైంటిఫిక్ డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ డెఫినిషన్ వ్యాలీడ్. దీని ప్రకారమే ఆ క్లాసికల్ ఔట్ లుక్ తోటే ఆ వర్గ దృష్టితోటే దాని విశ్లేషణ జరుగుతావుంది. (20.36 – 21.12 mnts.).
6. ఈ రకంగా చూసినపుడు ఆ సిక్త్ కాన్ఫెరెన్స్ లో Fascism కు ఇచ్చినటువంటి ఆ డెఫినీషన్ ఏంటీ? “Open terrorist dictatorship of most reactionary, most chauvinistic and most imperialistic elements of finance capital” This is the definition given by the 6th communists international. Open terrorist dictatorship. Open అని ఎందుకు అంటున్నారూ? అది చాటు కాదు. కల్బుర్గీని ఎలా చంపారూ? దారుణంగా చంపేశారు కానీ ఓపెన్ కాదు. డిక్లేర్ చేసి కాదు. ఫాసిజంలో సైనికులు వెళ్ళి ఒక ఇంటికి స్వస్తిక్ గురు వేసి వచ్చేవాళ్ళు నైట్ వెళ్ళి. స్వస్తిక్ గురు వేశారంటే ఇక ఆ ఇల్లు ఖతం అన్నట్టు. ఇంట్లో వున్న వాళ్లందర్నీ చంపివేయడం. (21.13 -21.34 mnts.). ఓపెన్ అది. Open terroristic … Open terroristic dictatorship. పార్లమెంటు వుండదింక. ప్రజాస్వామ్యం వుండదింక. ఓట్లు వుండవింక. (21.13 -23.10 mnts.).
7. ఈ డెఫినిషన్ లోని ప్రతి పదానికీ ఒక అర్ధం వుంది. Open terroristic dictatorship అన్నాం. ఎవరిదీ ఈ ఓపెన్ టెర్రరిస్టిక్ డిక్టేటర్ షిప్పు? మోస్ట్ రియాక్షనరీస్. అత్యంత అభివృధ్ధి నిరోధకులు. మోస్ట్ ఛావనిస్టిక్. అత్యంత దురభిమాన దుర్మార్గులు. మోస్ట్ ఇంపీరియలిస్టిక్. సామ్రాజ్యవాద లక్షణం ఏమిటీ? ఎందుకు సామ్రాజ్యవాదం అంటూన్నాం. అది కూద పెట్టుబదీదారీ విధానమే. మరి సామ్రాజ్యవాదం అని ఎందుకు అంటున్నాం. జర్మనీ స్పెయిన్ ఆస్ట్రియా లను అప్పుడు సామ్రాజ్యవాదం అని ఎందుకు అన్నాం. ఎందుకంటే ఆ దశలో వాళ్ల పెట్టుబడి సైజు పెరుగుతోంది. కానీ దానికి ప్లేస్ సరిపోవడంలేదు. దానికి విస్తరణ కాంక్షవుంది. మార్కెట్ కావాలి. అప్పటికే ప్రపంచం విభజన జరిగిపోయింది. కొత్త మార్కెట్ కావాలంటే యుధ్ధం చేయాలి ఇంకో మార్గం లేదు. మార్కెట్ల విస్తరణ కోసం జరిగిన యుధ్ధం. (23.10 – 24.24 mnts.).
8. ఫాసిజం యొక్క రెండు ప్రధాన లక్షణాలేమంటే; ఎక్స్ టెర్నల్ గా చూసినపుడు ఇతర దేశాలను ఆక్రమించే లక్షణాలను కలిగి వుంటుంది. ఇంటర్నల్ గా చూసినపుడు రివల్యూషనరీ ఉద్యమాన్ని అణిచివేసి జెనోసైడ్ నరమేధం ద్వార నాశనం చేసే లక్షణం కలిగి వుంటుంది. ఈ రెండు లక్షణాల మూర్తిభవమే ఫాసిజం. (24.24 – 25. 30 mnts.).
9. ఇతర దుర్మార్గాలు అనేకం సాగుతున్నాయి. వాటిని మతరాజ్యం అంటాం దుర్మార్గ రాజ్యం అంటాం దుష్ట రాజ్యం అంటాం. కానీ ఫాసిస్టు అని అనలేం మనం. అయితే ప్రభాత్ పట్నాయక్ వంటివారు రూపం మార్చుకున్న ఫాసిజం కావచ్చు అని అంటున్నారు. ఫాసిజాన్ని రూపాన్ని బట్టి నిర్ణయించలేం. దాని ఎసెన్స్ ను బట్టి మాత్రమే నిర్ణయిస్తాం. (25. 30 - 26.45 mnts.)
10. ఈనాడు మోదీ పరిపాలన అత్యంత దుర్మార్గమైనదని చెప్పడంలో అత్యంత అప్రజాస్వామికమైనదని చెప్పడంలో అత్యంత నియంతృత్వంగా, టెర్రరిస్టుగా వ్యవహరిస్తున్నదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం వుండాల్సిన పనిలేదు. భవిష్యత్తులో ఇది అత్యంత ప్రమాదకంగా పరిణమిస్తుంది అని చెప్పడానికి కూడ అభ్యంతరం లేదు. ఈనాడున్న రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రిజర్వు బ్యాంకు కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, కాగ్ కావచ్చు, ఇంక అనేక సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్న తీరును చూస్తే భవిష్యత్తులో పార్లమెంటును ఏం చేస్తుందీ? రాజ్యాంగాన్ని ఏం చేస్తుందీ? ఈ సందేహాలను కూడ కలిగి వుండాలి. వాటికి వ్యతిరేకంగా ఫైట్ కూడ చేయాలి. మనం ఈ అవగాహనతో ఆలోచించడం మంచిది. (26.48 – 27-30 mnts.)
11. ఈరూపంలో వున్న మోదీ ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గ దుష్ట ప్రభుత్వాన్ని, మతోన్మాద ప్రభుత్వాన్నీ, జాతీయవాదం పేరుతో మతోన్మాదాన్ని ముందుకు తీసుకు వస్తున్న ప్రభుత్వంతో ఫైట్ చేయడం ఎలా? (27. 30 - mnts.)
No comments:
Post a Comment