Saturday, 17 September 2022

Comedy Script NENINTE – Nov 6 - 1. MODI

Script

NENINTE – Nov 6  - 1. MODI

నరేంద్ర మోదీ  :

మేరే భారత్ వాసియో !  మై నరేంద్ర మోది బోల్ రహాహూ.  నా పేరు ఇవ్వాల్టీ నుండి మారిపోయిందీ. ఇక మీరు నన్ను నరేంద్ర బీహారీ అని పిలవాలి.


లాలూ ప్రసాద్ యాదవ్  :

హల్లో నరేంద్ర మోదీజీ ! మై లాలూ ప్రసాద్ యాదవ్. ఇక్కడ బీహారీ బాబూ వున్నాడు. జబ్ తక్ దునియా మే ఆలూ రహేగా తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా.


నరేంద్ర మోదీ  :

బీహార్ ను ముగ్గురు రాక్షసులు పట్టి పిడిస్తున్నారు. లాలూ, నితీష్, సోనియా. వాళ్ళను సంహరించడానికే నేను పుట్టాను.


లాలూ ప్రసాద్ యాదవ్  :

మోదీ జీ! అసలు విషయం చెపుతాను. భార్రత దేశాన్ని ముగ్గురు రాక్షసులు పట్టి పీడిస్తున్నారు. నరేంద్ర మోదీ !  నరేంద్ర మోదీ ! నరేంద్ర మోదీ ! ఆ ముగ్గురు రాక్షసుల్ని అంత చేయడానికి ఇప్పుడు ఇండియా అంతా ఒక్కటి అవుతోంది. మాలూమ్?


నరేంద్ర మోదీ  :

నేనే బీహార్ కా బాద్షా.


లాలూ ప్రసాద్ యాదవ్  :

పాట్నాకా పిచాచి అనుకో. ఇంకా  బాగుంటుంది.


నరేంద్ర మోదీ  : ఫేస్ ఎక్స్ ప్రెషన్


కేజ్రీవాల్  :

హల్లో మోదీజీ !  బీహార్ ఎన్నికలు ముందే తెలిసిపోయాయి.  మీకు బీహార్లో కూడా ఢిల్లీ ఫలితాలే వస్తాయి. ఆల్ గుడ్ లక్.


నరేంద్ర మోదీ  :

హల్లో కేజ్రీవాల్ జీ ! నాకు ఇంకోసారి  ఢిల్లీ ఎన్నికలని గుర్తు చేయవద్దు.  నాకు చలిజ్వరం వస్తుంది.


కేజ్రీవాల్  :

ఇంక మీకు చలిజ్వరమే. పది లక్షల రూపాయల కోటు తొడుక్కున్నా వణకాల్సిందే.


నరేంద్ర మోదీ  :

మోదీకో బీహార్ జీత్ నా హోగా.  అందుకే పదిహేడుసార్లు వచ్చి ఎన్నికల ప్రచారం చేశాను.


కేజ్రీవాల్  :

ఇంత హంగామా చేస్తేనే ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని విసిరి కొట్టారు. బీహార్ కు పదిహేడుసార్లు వెళ్ళారు అంటేనే మీకు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని అర్ధం అవుతోంది. మీరు ఇండియా ప్రైమ్ మినిస్టరా? బీహార్ కు ప్రైమ్ మినిస్టరా?


నరేంద్ర మోదీ  :  ఫేస్ ఎక్స్ ప్రెషన్


వెంకయ్య నాయుడు :

అయ్యా నరేంద్ర మోదీజీ !  మీడియా మీ మీద కక్ష కట్టింది బాబూ. ఏదో విధంగా మీకు ఇబ్బందులు కలిగిస్తోంది నాయనా. వామలక్ష వాదులు, లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు అంతా ఒకటే మోదీజీ. వాళ్ళకు మీ మీద అకారణ కక్ష. దిసీజ్ క్లియర్.


నరేంద్ర మోదీ  :

వెంకయ్య నాయుడు జీ! మీడియా మీద మనం కూడా కక్షసాధించాలి. దానికి ఏదైనా ప్లాన్ చేయండి.  


వెంకయ్య నాయుడు :

అయ్యా మోదీజీ। మీరు అంత తొందర పడతారనే మీకు చెప్పలేదు బాబూ. ఇప్పటికే ఇండియాలో నాలుగు అక్షరాలు చదువుకున్న ప్రతోడూ మిమ్మల్ని తిడుతున్నాడు స్వామీ. ఇప్పుడు మీరు మీడియాను గిల్లితే మరిన్ని సమస్యలు వస్తాయి బాబూ. దిసీజ్ క్లియర్.


నరేంద్ర మోదీ  : ఫేస్ ఎక్స్ ప్రెషన్


చంద్రబాబు :

ఏం నరేంద్ర మోదీగారూ! ఏం మాట్లాడుతున్నారూ? తమాషాగా వుందా? ఎన్నికలంటే  మీరు కంగారు పడడం కరెక్టు కాదండి.


నరేంద్ర మోదీ  :

చంద్రబాబూజీ!  ఏ తమాషా నహీ హై. ఏ కంగారూ నహీ హై. ఏ భయం హై. దిల్లీలో మాడు సీట్లే వచ్చాయి. ఇక్కడ నితీష్ కుమార్ కూడా కేజ్రీవాలకన్నా క్రేజీ మ్యాన్. అతనికి మూడ్ వస్తే మనకు మూడు కూడా మిగల్చడు.


చంద్రబాబు :

ఏం నరేంద్ర మోదీగారూ! ఏం మాట్లాడుతున్నారూ? మీరు కనుక ఒకసారి చూసినట్తయితే అమరావతి పక్కన కృష్ణానది నీళ్ళు తాగితే చాలా ధైర్యం వస్తుందని చాలా క్లియర్ గా కనిపిస్తా వుంది. ఒక ముంతలో కృష్ణా నీళ్ళు పంపుతానని మీకు నేను మన్వి చేసుకుంటావున్నాను.


నరేంద్ర మోదీ  : ఫేస్ ఎక్స్‍ ప్రేషన్


రాహుల్ గాంధీ   :

నమస్కార్ నరేంద్ర మోదీజీ!  మొన్న ఎన్నికల్లో నన్ను మీరు పిల్లాడిని చేసి ఆడుకున్నారు. రాహుల్ బచ్చా బచ్చా అన్నారు.


నరేంద్ర మోదీ  :

పిల్లల్ని హిందీలో బచ్చా అంటారు. రావుల్ బచ్చా.


రాహుల్ గాంధీ   :

ఇప్పుడు నేను బీహార్ లో గంగానది నీళ్ళు తాగి  పెద్దమనిషి అయ్యాను. దాని ఎఫెక్ట్ మీకు రెండు మూడు  రోజుల్లో తెలిసిపోతుంది.


నరేంద్ర మోదీ  :

నమస్కార్ దోస్తో! రాహుల్ బాబు  కూడా నా మీద జోకులు వేస్తున్నారు. ఇక నేను వెళతాను. మళ్ళీ త్వరలో వస్తా.

No comments:

Post a Comment