ఆలోచనాపరులకు ఒక విన్నపం.
ఫాసిజం సాధారణ లక్షణాలు – ప్రత్యేక లక్షణాలు.
ఏ దేశంలో అయినా ఫాసిజానికి కొన్ని సాధారణ లక్షణాలు వుంటాయి. ఆయా దేశాల
కాలమాన పరిస్థితులు, పాలకుల అధికార కాంక్ష, కార్పొరేట్ల అత్యాశల్ని బట్టి ప్రతిదేశంలోనూ
ఫాసిజానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడ వుంటాయి.
ఫాసిజం సాధారణ లక్షణాలను నిర్వచించడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. ఇది
సమగ్రంగా వుందోలేదో చూసి అవసరమైన సూచనలు చేయగలరు.
ఫాసిజం సాధారణ లక్షణాలు
“సమాజాన్ని మతప్రాతిపదిక మీద చీల్చి, అల్పసంఖ్యాకులను శత్రువులుగా చిత్రించి, వాళ్ళను క్రూరంగా వేధించి, అధికసంఖ్యాకులను బుజ్జగించి, భౌగోళిక జాతీయవాదాన్ని అవహేళన చేసి, చారిత్రక సంఘటనలకు కట్టుకథల్ని జోడించి, వీరావేశంతో సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రచారం చేసి, ప్రజల్ని ఒక సామూహిక పూనకంలో ముంచి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించి, ఉన్మాద అల్లరి మూకలకు శిక్షల నుండి మినహాయింపులిచ్చి, శ్రామికులు, సామాన్య ప్రజలు, అస్తిత్వ సమూహాలను నిర్దయగా అణిచివేసి, రాజ్యాంగ వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని రద్దుచేసి, అడ్డంగా స్వాధీనం చేసుకున్న కేంద్రీకృత అధికారాలతో రాజకీయరంగం, మీడియా వ్యవస్థల్లో అసమ్మతికి చోటులేకుండాచేసి, అస్మదీయ కార్పొరేట్లను ప్రపంచ సంపన్నులుగా మారుస్తూ, ప్రపంచంలో ఒక మహాశక్తిగా దేశం వెలిగిపోతున్నట్టు చిత్రించడమే ఫాసిజం.”
- ఉషా ఎస్ డానీ
ఆరెస్సెస్, భారత కమ్యూనిస్టు పార్టి రెండూ 1925లో పుట్టాయి. మొదటి సంస్థ లక్ష్యం హిందూ మత రాజ్యస్థాపన, రెండో సంస్థ లక్ష్యం నూతన ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించడం. ఈ వందేళ్ళలో మతతత్త్వ వాదులు తమ లక్ష్య సమూహాల మద్దతును కూడగట్టడంలో పూర్తిగా సఫలం అయ్యాయి. కమ్యూనిస్టు పార్టీలు తమ లక్ష్య సమూహాల మద్దతును కూడగట్టడంలో దారుణంగా విఫలం అయ్యాయి.
నూతన
ప్రజాస్వామిక విప్లవం నాలుగు వైరుధ్యాలు
No comments:
Post a Comment