ఆకురాతి మురళీ కృష్ణ ముస్లిం సమాజం మీద చేసిన ఆరోపణల మీద ఈ గ్రూపులో ఇంత చర్చ జరుగుతోందా? నాకు ఈ క్షణం వరకు తెలీదు.
ఆకురాతి మురళీ కృష్ణ ఐక్యవేదిక గ్రూపులో ముస్లిం సమాజం మీద అకారణంగా దాడి చేశారు. నేను వారి మీద గానీ వారి సామాజికవర్గం మీదగానీ ఏ దశలోనూ ఎలాంటి పరుష పదాలూ వాడలేదు. నేను చాలా వినయంగా -
MuraliKrishna Akurati గారూ!
ఇది చాలా అభ్యంతరకర పోస్టు.
1. ముస్లిం నాయకత్వాలు ఆ.కు. (ఆధిపత్య కులాల) పార్టీలనే నమ్ముకుని వుంటున్నారు.
2. దళితబహుజనులతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణానికి ముస్లింలు ముందుకు రావడంలేదు.
3. ముస్లింలకు ఫూలే అంబేడ్కర్ ఐడియాలజీ లేదు.
4. ముస్లింలు ఎంతసేపటికీ వ్యాపార దృక్పథాన్ని వదలడం లేదు.
అనే 4 ఆరోపణలు మీరు చేశారు.
మీ ముందు మూడు ఆప్షన్లున్నాయి.
1. మీరు చేసిన ఆరోపణల్ని నిరూపించాలి.
2. నిరూపించలేకపోతే ఆ ఆరోపణల్ని ఉపసంహరించుకోవాలి.
3. ఫాసిజానికి అత్యంత బాధితులయిన ముస్లిం సమాజం మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.
అని అడిగాను.
అలాగే గ్రూపు adminsకు మూడు విజ్ఞప్తులు చేశాను.
1. అణగారిన సమూహాల ఐక్యతకు భంగం కలిగిస్తూ మురళీకృష్ణ ఆకురాతి ముస్లిం సమాజం మీద అసంబర్ధంగా చేసిన ఆరోపణల పోస్టును ముందు తొలగించండి.
2. వారి ఆరోపణల్ని తిప్పికొట్టే ఆవకాశాన్ని నాకు కల్పించండి.
3. మురళీకృష్ణ ఆకురాతి ఈ గ్రూపు ఆశయాలకు భంగం కలిగించారని తేలితే వారిని ఈ గ్రూపు నుండి తప్పించండి.
ఇది ఎక్కడయినా డెమోక్రాటిక్ ప్రాసెస్. ఇది జరగాల్సిందే.
ఈ సందర్భంలో ముసిం సమాజ ప్రతినిధులు ఈ డెమోక్రాటిక్ ప్రాసెస్ ను ప్రారంభించమని ఈ గ్రూపు adminsను కోరాలి.
MuraliKrishna Akurati ఆరోపణల మీద తమ అభ్యంతరాలను చెపుతూ పోస్టులు పెట్టాలి. (అభ్యంతరాలను చెప్పడం అంటే హిందూ బిసీ సమూహాలను విమర్శించమనికాదు)
వాళ్లు ఇంకో పనికూడ చేయవచ్చు. నాకు ఫోన్ చేసి MuraliKrishna Akurati పెట్టిన పోస్టు అభ్యంతరకరమే అయినప్పటికీ ఐక్యత కోరుతూ ఈ చర్చను ఇక్కడితో ఆపేద్దాం అని నాకు సూచించవచ్చు. నేను వెంటనే సానుకూలంగా స్పందించేవాడిని. ఏ ఒక్కరూ ఆ రెండు పనులు చేయలేదు.
గ్రూపు అడ్మిన్ డెమోక్రాటిక్ ప్రాసెస్ ను మొదలు పెట్టకముందే ఒక
ముస్లిం ప్రతినిధి MuraliKrishna Akuratiని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టారు.
MuraliKrishna Akurati గారు ఈ పోస్టు పెట్టడంలో malice ఏమిటీ? అనే సందేహం కూడా వీరికి రాలేదు.
"MuraliKrishna Akurati చాలా మంచి మనిషి. నాకు చాలాకాలంగా తెలుసు. నాకు పెద్దన్నలాంటివారు" అని కితాబు ఇచ్చారు.
ఈ వివాదంలో ఆయన MuraliKrishna Akurati పక్షం వహించారు. అంటే MuraliKrishna Akurati ముస్లిం సమాజం మీద చేసిన ఆరోపణల్లో నేరుగా భాగస్వామి అయ్యారు.
గ్రూపులో MuraliKrishna Akurati పక్షం వహిస్తూ పోస్ట్ పెట్టాక వారు నాకు ఫోన్ చేసి MuraliKrishna Akurati గారి గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం మొదలెట్టారు.
ఇది కపటం! గుంటనక్క వ్యవహారం!
కృష్ణార్జున బోధి మంగళగిరి గారికి,
MuraliKrishna Akruti గారు చేసిన ఆరోపణల్ని నేను ఇంకా ఖండించలేదు. వారు తన ఆరోపణలకు వత్తాసుగా ఒక ఆడియో కూడ పెట్టారు. ఆ ఆరోపణల్ని నిరూపించమని నేను వారిని సమంజసంగా కోరుతున్నాను.
రెండు రోజుల్లో వారు తన ఆరోపణల్ని నిరూపించాలి. లేకపోతే గ్రూపు ఐక్యతకు భంగం కలిగించినందుకుగాను వారిని ఈ గ్రూపు నుండి తొలగించండండి. ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి జరక్కపోతే, వారెంత నిరాధార బూటకపు అసంబధ్ధపు కపటపు చారిత్రక అజ్ఞానపు వాస్తవ విరుధ్ధపు ఆరోపణలు చేశారో నిరూపించడానికి నాకు అవకాశం ఇవ్వండి.
Danny MTF 9010757776
కృష్ణార్జున బోధి మంగళగిరి గారికి,
నేను నిన్న రూ. 8000 లు పెట్టి మార్చి 11, 12 తేదీల ఢిల్లీ సమావేశానికి నా భార్యతోసహా రానూపోనూ రైలు టిక్కెట్లు కొని వుంచుకున్నాను.
బయట ముస్లింల మీద జరుగుతున్న భౌతిక మూక దాడుల్లో కాల్బలంగా పనిచేస్తున్న సమూహాలే ఈ గ్రూపులోనూ ముస్లిం సమూహాల మీద నైతిక దాడులు చేస్తుంటే సహించడం కష్టం. నాకిది ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఢిల్లీ సమావేశానికి ముస్లింలను రావద్దంటే అది మీ ఇష్టం.
Danny MTF 9010757776
కృష్ణార్జున బోధి మంగళగిరి గారూ!
మీరు మురళి కృష్ణ ఆకృతి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదు.
మిత్రమా ! M Subba Rao DNT Political Party
MuraliKrishna Akruti గారు! ఈ గ్రూపులో ముస్లిం సమాజం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారి చేత ఆ ఆరోపణల్ని ఉపసంహరింపచేయండి. లేదా ఆ ఆరోపణలకు సమాధానం ఇచ్చే అవకాశాన్ని మాకు ఇవ్వండి. లేదా వారిని గ్రూపు నుండి తొలగించండి. అని మూడు ప్రతిపాదనలు చేశాను. ఇవేవీ మేము చేయము. ముస్లింలు మాత్రం ఢిల్లీ రావాలి మీరు అంటున్నారు. ఇదొక కొత్త రకం ఆధిపత్యమా?
Danny 9010757776
ఇప్పుడే ఒక విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. MuraliKrishna Akurati గారు! ఈ Group Admin లలో ఒకరట!
Bhaskara Rao C OPDR గారూ!
సంఘపరివారం అనాదిగా ముస్లింల మీద రకరకాల దాడులు చేస్తునే వుంది. సంఘపరివారం దాడుల్ని ఎదుర్కొంటామంటూ పెట్టిన 'భారత్ బచావో' వాట్సప్ గ్రూపు కూడ ముస్లిం వ్యతిరేక ప్రచారం మొదలెట్టింది. ఇలాంటి దుష్ప్రచారాల మీద అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ముస్లింలకు లేకుండా చేసినందుకు ధన్యవాదాలు.
ముస్లింల మీద వ్యతిరేక కామెంట్ పెట్టిన MuraliKrishna Akurati గారిని Admin గా వుంచి, వారిని ఎవరూ విమర్శించకుండా హఠాత్తుగా Bhaskara Rao C OPDR changed this group's settings to allow only admins to send messages to this group అని నిర్ణయం తీసుకున్నందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు. దీన్ని మీ స్టైలు మత సామరస్యం అనుకోవాలా? లేక మీ టైపు ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ అనుకోవాలా? You are really great.
మన భారత్ బచావో Admin MuraliKrishna Akurati గారి పేరు చెప్పుకుని ఈ టిక్కెట్లతో నాలుక గీసుకోవాలి.
ఆ సమయంలో adminగా పదిసార్లు ముందుకు వచ్చిన కృష్ణార్జున బోధి మంగళగిరి గారిని పదేపదే ప్రాధేయపడ్డాను. ఆ పోస్ట్ తీసేయండి అని లేదా సమాధానం ఇచ్చే అవకాశం నాకు ఇవ్వండని. ఆ admin కనీసం నా విన్నపాన్ని acknowledge కూడ చేయలేదు. ఈ లోగా పోస్ట్ చేసే అవకాశం నుండి నన్ను మీరు తొలగించారు. బాధితుడ్నే శిక్షించే న్యాయం. పిర్యాదిదారుడ్నే నోరు మూయించే ధర్మం. ఈ అనుభవం చాలు. ఎక్కువ నష్టం జరక్కముందే కళ్ళు తెరిపించినందుకు మరొక్క మారు మీకు ధన్యవాదాలు.
నేను గుమ్మం ముందు నిలబడి ఒక గంట సేపు బతిమిలాడాను. ఆరుగురో ఏడుగురో admins వున్నారు. ఏ Admin కూడ స్పందించలేదు.
ముస్లిం సమాజం అంతర్ముఖంగావున్నా, మౌనంగా ఇంట్లో కూర్చున్నా ఇంట్లో దూరి గిల్లికజ్జాలు పెట్టుకుని ఎదురుదాడి చేసే సంస్కృతిని మేము చాలా కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడా అదే సంస్కృతి. ఒకరు ముస్లింలను రెచ్చగొడతారు. ఇంకొకరు ముస్లింల నోరు మూస్తారు. మరొకరు వచ్చి ముస్లింలు ఇంతేనబ్బా లొల్లి చేస్తారు అని తీర్పు ఇస్తారు. 1947లో మొదలయిన ఆట ఇది.ఇది మీకూ కొత్తకాదు; మాకూ కొత్త కాదు.
ముస్లిం సమాజం మీద నిందవేసిన వ్యక్తి సాధారణ సభ్యుడు కాదు; ఒక admin అనే ఎరుక మీకు ఇంకా కలిగినట్టులేదు. ముస్లిం సంఘాలు లేకుండ, ముస్లిం ఆలోచనాపరులు లేకుండా మీ భారత్ బచావో వాట్సప్ గ్రూప్ వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను.
కృష్ణార్జున బోధి మంగళగిరి గారూ!
మీరు మురళి కృష్ణ ఆకృతి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదు.
మిత్రమా ! M Subba Rao DNT Political Party
MuraliKrishna Akurati గారు! ఈ గ్రూపులో ముస్లిం సమాజం మీద టివ్రమైన ఆరోపణలు చేశారు. వారి చేత ఆ ఆరోపణల్ని ఉపసంహరింపచేయండి. లేదా ఆ ఆరోపణలకు సమాధానం ఇచ్చే అవకాశాన్ని మాకు ఇవ్వండి. లేదా వారిని గ్రూపు నుండి తొలగించండి. అని మూడు ప్రతిపాదనలు చేశాను. ఇవేవీ మేము చేయము. ముస్లింలు మాత్రం ఢిల్లీ రావాలి మీరు అంటున్నారు. ఇదొక కొత్త రకం ఆధిపత్యమా?
Danny 9010757776
ఇప్పుడే ఒక విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. MuraliKrishna Akurati గారు! ఈ Group Admin లలో ఒకరట!
Bhaskara Rao C OPDR గారూ!
సంఘపరివారం అనాదిగా ముస్లింల మీద రకరకాల దాడులు చేస్తునే వుంది. సంఘపరివారం దాడుల్ని ఎదుర్కొంటామంటూ పెట్టిన 'భారత్ బచావో' వాట్సప్ గ్రూపు కూడ ముస్లిం వ్యతిరేక ప్రచారం మొదలెట్టింది. ఇలాంటి దుష్ప్రచారాల మీద అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ముస్లింలకు లేకుండా చేసినందుకు ధన్యవాదాలు.
ముస్లింల మీద వ్యతిరేక కామెంట్ పెట్టిన MuraliKrishna Akurati గారిని Admin గా వుంచి, వారిని ఎవరూ విమర్శించకుండా హఠాత్తుగా Bhaskara Rao C OPDR changed this group's settings to allow only admins to send messages to this group అని నిర్ణయం తీసుకున్నందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు. దీన్ని మీ స్టైలు మత సామరస్యం అనుకోవాలా? లేక మీ టైపు ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ అనుకోవాలా? You are really great.
మన భారత్ బచావో Admin MuraliKrishna Akurati గారి పేరు చెప్పుకుని ఈ టిక్కెట్లతో నాలుక గీసుకోవాలి.
ఆ సమయంలో adminగా పదిసార్లు ముందుకు వచ్చిన కృష్ణార్జున బోధి మంగళగిరి గారిని పదేపదే ప్రాధేయపడ్డాను. ఆ పోస్ట్ తీసేయండి అని లేదా సమాధానం ఇచ్చే అవకాశం నాకు ఇవ్వండని. ఆ admin కనీసం నా విన్నపాన్ని acknowledge కూడ చేయలేదు. ఈ లోగా పోస్ట్ చేసే అవకాశం నుండి నన్ను మీరు తొలగించారు. బాధితుడ్నే శిక్షించే న్యాయం. పిర్యాదిదారుడ్నే నోరు మూయించే ధర్మం. ఈ అనుభవం చాలు. ఎక్కువ నష్టం జరక్కముందే కళ్ళు తెరిపించినందుకు మరొక్క మారు మీకు ధన్యవాదాలు.
నేను గుమ్మం ముందు నిలబడి ఒక గంట సేపు బతిమిలాడాను. ఆరుగురో ఏడుగురో admins వున్నారు. ఏ Admin కూడ స్పందించలేదు.
ముస్లిం సమాజం అంతర్ముఖంగావున్నా, మౌనంగా ఇంట్లో కూర్చున్నా ఇంట్లో దూరి గిల్లికజ్జాలు పెట్టుకుని ఎదురుదాడి చేసే సంస్కృతిని మేము చాలా కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడా అదే సంస్కృతి. ఒకరు ముస్లింలను రెచ్చగొడతారు. ఇంకొకరు ముస్లింల నోరు మూస్తారు. మరొకరు వచ్చి ముస్లింలు ఇంతేనబ్బా లొల్లి చేస్తారు అని తీర్పు ఇస్తారు. 1947లో మొదలయిన ఆట ఇది.ఇది మీకూ కొత్తకాదు; మాకూ కొత్త కాదు.
ముస్లిం సమాజం మీద నిందవేసిన వ్యక్తి సాధారణ సభ్యుడు కాదు; ఒక admin అనే ఎరుక మీకు ఇంకా కలిగినట్టులేదు. ముస్లిం సంఘాలు లేకుండ, ముస్లిం ఆలోచనాపరులు లేకుండా మీ భారత్ బచావో వాట్సప్ గ్రూప్ వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను.
మురళీకృష్ణగారు పోస్టు పెట్టింది 12.45 కు.
అప్పటి నుండి మూడు గంటల పాటు నేను నాకూ అవకాశం ఇవ్వాల్సిందిందిగా బతిమిలాడుతున్నాను.
మీరు నాకు కామెంట్ చేసే అవకాశం కూడ లేకుండా చేసింది. 15.37కు.
మురళీ కృష్ణ ఆకురాతి గారు ఒక గంటలో వివరణ ఇస్తారని మీరు ప్రకటించింది 16. 46కు. అంటే ఒక గంటా 10 నిముషాల తరువాత. ఆ తరువాత మురళీ కృష్ణ ఆకురాతిగారు ఇంకో గంట తీసుకుంటారా? 17. 46? ఏంటిది సార్ ! నవ్వులాటనా?
🙏🏼 మిత్రులకు వందనం 🙏🏼
నేను గత 6గం.క్రితం హాస్పిటల్ కు వెళ్లి, ఇప్పుడే తిరిగి వచ్చాను. ఈలోగా చాలా విమర్శలు నా మీద వచ్చాయి. అందుకు ముందుగా మన్నించండి.
1. ఒక చిన్న పొరపాటు నా ద్వారా జరిగింది , ఐనా మిత్రులు సరిగా అవగాహన చేసుకోలేక నన్ను అపార్ధం చేసుకున్నారు.
* నా పొరపాటు : మిత్రులు కరీముల్లా గారిని మాత్రమే ఉద్దేశించి పెట్టిన పోస్ట్, వారి వ్యక్తిగత ఇన్బాక్స్ లో పోస్ట్ చేయాల్సింది , హాస్పిటల్ కు వెళ్ళే హడావుడిలో ఈ గ్రూపులోనే రాయడం జరిగింది. అది మన గ్రూపుకు సంబంధించిన విషయం కాదు. ఐనా పొరపాటే. అందుకు మన్నించండి.
* షుమారు గత 10సం.లుగా నేనూ, ఊ.సా.గారు, మరికొందరు మిత్రులం "బహుజనులకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణం" కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కువగా అబిడ్స్ లోని మిత్రుడు జహీరుద్దీన్ ఆలీఖాన్ గారి సియాసత్ పత్రిక కార్యాలయంలో జరిగినవి. ఆ సందర్భంగా మేము ఎదుర్కొన్న ఇబ్బందుల్లో భాగంగా పైన పేర్కొన్న అంశం గుర్తుచేసుకోవడం జరిగింది.
* ఐనప్పటికీ " ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణంలో" అని కూడా నా పోస్ట్ లో ఉటంకించడం జరిగింది. మరొకసారి చదివివుంటే ,నా పైన ఇలాంటి విమర్శలు వచ్చివుండేవి కాదు. ఐనప్పటికీ అపార్ధం కలిగించే అవకాశం కల్పించినందుకు విచారం వ్యక్తపరుస్తున్నాను.
* నేనేదో వాయిస్ మెయిల్ పెట్టాననీ , సాక్ష్యాలతో నిరూపించుకోవాలనీ , లేకపోతే నామీద యాక్షన్ తీసుకోవాలనీ సోదరుడు డేనీ గారు తనకోపం ప్రదర్శించారు. ఆ సోదరుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదని భావిస్తాను, పరిచయం లేకపోవడంచేత.
2. పోతే నా స్నేహితులు అందరకూ తెలుసు ముస్లిం సోదరుల పట్ల నావైఖరి. నిన్న నా ఫేస్బుక్ లో కూడా ముస్లింలు, క్రిస్టియన్లు వైదీక మత అవమానాలు భరించలేక మతం మార్చుకున్న మా సోదర మూలవాసీలే , విదేశీ వలసవాదులైన ఆర్యుల లాగా కాదు అని.
* బాబ్రీ మసీదు ధ్వంసం చేసిన రోజున , మా "బీసీ ఫోరం" బ్యానర్తో ర్యాలీ తీసి , నిరసన సభ జరిపింది నేనే.మా పొన్నూరు ముస్లిం సోదరులెవరినైనా అడగండి, చెప్తారు. ఆంధ్రభూమి పొన్నూరు విలేకరి కరీముల్లాను అడగండి (98480 41355)
నా గురించి చెబుతాడు.
* షేక్ జిలానీ (టీచర్, కరోనా వలన దివంగతుడు)ని "మా పెద్దబ్బాయి" అని బహిరంగ సభలలో చెప్పుకున్నవాడిని.
* నేనేమీ శీలపరీక్ష చేసుకోనక్కర లేదు. కాకపోతే నాగురించి తెలియనివారు ఆవేశంలో రాసినారు. వారికి తెలియజెప్పడానికే ఈ వివరణ..
2. పోతే మరో పోస్ట్ లో @Samasamaj Chacha Vedika గారు "నాయకత్వంలో ఉండేవారు హేతువాద/నాస్తిక భావజాలం కలవారై ఉండాలి" అని రాశారు. నేను వారి అభిప్రాయాలను సమర్ధించాను. ఎందుకంటే మా సంస్థ అదేవిధంగా నియమాలను పెట్టుకుని ఆచరిస్తున్నది కాబట్టి. నియమాలను కాదని ఆచరణలో మరోరకంగా ప్రవర్తించే వారిమికాదు. ఒకవేళ అలాంటి నియమంలో అనర్ధం వుంటే హేతుబద్ధంగా వివరించండి. అంతేగాని నియంతల లాగా రూలింగ్ ఇవ్వకూడదు గదండీ.
3. పోస్టును చదవకుండా, అవగాహన చేసుకోకుండా , "పోస్ట్ లో బూతు"లు వెతికేవారి విమర్శలు నేను పట్టించుకోను, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.
4. ఈ వివరణను అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నా.
అందరకూ "నీల్-లాల్ సలాం"
- ఆకురాతి మురళీకృష్ణ.
నిరూపించమనండి ఆయన్ని ఈ నిందల్ని?
1. ముస్లిం నాయకత్వాలు ఆ.కు. (ఆధిపత్య కులాలు అనేనా? ) పార్టీలనే నమ్ముకుని వుంటున్నారు.
2. దళితబహుజనులతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణానికి ముస్లింలు ముందుకు రావడంలేదు.
3. ముస్లింలకు ఫూలే అంబేడ్కర్ ఐడియాలజీ లేదు.
4. ముస్లింలు ఎంతసేపటికీ వ్యాపార దృక్పథాన్ని వదలడం లేదు.
మొన్నటి సదస్సు తరువాత సంఘపరివారం ఒక agent Provocateur ద్వార ఒక చిచ్చు పెడుతుందని భయపడ్డాను. నా భయాన్ని MuraliKrishna Akruti గారు నిజం చేశారు!
మొదటి నుండి నా డిమాండ్ అదే!
దయచేసి మళ్ళామళ్ళా ఇదే పోస్టు పెట్టవద్దు. మురళీకృష్ణ ఆకృతి గారికి ఒక రాజకీయ పార్టిని స్థాపించి నిర్వహించగల సామర్ధ్యంలేదని జహీరుద్దీన్ ఆలీఖాన్ కు ఆరోజు అనిపించి వుండవచ్చు. జహీరుద్దీన్ ఆలీఖాన్ లేకపోయినా సరే తనే తనను నమ్మే సామాజికవర్గాలు, ప్రముఖులతో ఒక రాజకీయ పార్టిని నిర్మించి గెలిపించి తన సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశం మురళీకృష్ణ ఆకృతి గారికి బోలెడు వుండింది. కానీ, వారు ఇన్నేళ్ళకు కూడ ఆ పని చేయలేకపోయారు. దీని అర్ధం ఏమిటీ?
అయినా ఫాసిస్టు అణిచివేతను అందరికన్నా అనుభవిస్తున్న సమూహం మీద ఒక వ్యక్తిగత అనుభవంతో ఇంత పెద్ద నింద వేస్తారా? సజావుగా సాగుతున్న గ్రూపులో చిచ్చు పెడతారా? ఇలా చిచ్చు పెట్టే వారిని ఆంగ్లంలో ఏమంటారో నాకు బాగా తెలుసు.