Saturday, 21 January 2023

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులు పదేపదే కమ్యునిజాన్ని బలహీనపరుస్తూ వచ్చారు.

     వందేళ్లలో  భారత కమ్యూనిస్టు పార్టి వంద ముక్కలుగా చీలిపోయింది. ఆ వందేళ్లలోనే ఆరెస్సెస్‍ వంద  అనుబంధ సంఘాలుగా విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకుని అజేయశక్తిగా మారింది.  organisms best adjusted to their environment are the most successful in surviving and reproducing. Survival of the fittest!

భారత కమ్యూనిస్తు పార్టీలకు చాలా మంది గొప్పవాళ్ళు నాయకత్వం వహించారు. వీరి త్యాగాల్ని, కమిట్ మెంట్ ను తక్కువగా చూడలేం. అయితే వీరందరిలోనూ ఒక లోపం వుంది. లెనిన్ లానో, మావో లానో తమ దేశ సామాజిక వాస్తవికతకు అవసరమైన నిర్ధిష్ట విప్లవ కార్యక్రమాన్ని   రూపొందించడంలో వీళ్లంతా విఫలం అయ్యారు. మార్క్సిజాన్ని సృజనాత్మకంగా నిర్దిష్ట భారత సమాజానికి అన్వయించడం వీరికి చేతకాలేదు. కొంతకాలం ఇంగ్లండ్ కమ్యూనిస్టు పార్టిని నమ్ముకుని కాలం గడిపేశారు. కొంతకాలం రష్యన్  కమ్యూనిస్టు పార్టిని అనుకరిస్తూ  కాలం గడిపేశారు. కొంతకాలం చైనా  కమ్యూనిస్టు పార్టిని అనుసరిస్తూ  కాలం గడిపేశారు. 1984-94వ దశాబ్దంలో ప్రపంచ బ్యాంక్ కొత్త వ్యూహాలతో విరుచుకుపడినప్పుడు అనుసరించడానికి అంతర్జాతీయ మోడల్ దొరక్క చేతులేకాక కాళ్ళూ ఎత్తేశారు. 


మన కమ్యూనిస్టు నాయకులకు ఒక దేశ విప్లవ కార్యక్రమాన్ని రూపొందించగల మేధావితనం. విప్లవానికి  నాయకత్వం వహించదగ్గ  సామర్ధ్యం రెండూ లేవని నాకు 1986 ప్రాంతం నుండే ఒక అనుమానం పీకసాగింది. అది 1989లో బలపడింది. 2004లో వీరివల్ల కాదని తేలిపోయింది. 


భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులు పదేపదే కమ్యునిజాన్ని బలహీనపరుస్తూ వచ్చారు. కానీ; కమ్యూనిజం ఓడిపోలేదు; ఓడిపోదు. 

No comments:

Post a Comment