Monday, 30 January 2023

అత్యంత బాధితులే సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం మీద పోరాటంలో ముందుండాలి

 అత్యంత బాధితులే  

సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్  నియంతృత్వం మీద 

పోరాటంలో ముందుండాలి


పెట్టుబడీదారీ వ్యవస్థ తనకు అవసరం అయినప్పుడు హేతువాదాన్ని ప్రోత్సహించింది. కార్పొరేట్ వ్యవస్థ తనకు అవసరం అయినప్పుడు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుంది. 


మతాలు కూడా అంతే. నియంతలు కొన్ని దేశాల్లో ఇస్లాంను వాడుకున్నారు, కొన్ని దేశాల్లో క్రైస్తవాన్ని వాడుకున్నారు, కొన్ని దేశాల్లో బౌధ్ధాన్ని వాడుకున్నారు. ఇప్పటి భారత దేశంలో హిందూమతాన్ని వాడుకుంటున్నారు. ఎక్కడయినా సరే, నియంతృత్వం కాన్ స్టాంట్. మతం వేరియబుల్. 


సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వంను చాలామంది సులువుగా వుంటుందని 'ఫాసిజం' అంటున్నారు. 'ఫాసిజం' అనడం మరీ తప్పేమీ కాదుగానీ కొన్ని సందర్భాల్లో ఈ పదంవల్ల  కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కొందరు ఫాసిజం అనగానే ఇటలీ, ముస్సోలిని, జర్మనీ హిట్లర్ ల పోలికలు తెచ్చి ప్రస్తుతం ఆ పరిస్థితులు  ఇక్కడ లేవుకనుక  దీనిని ఫాసిజం అనరాదని చాలా తెలివిగా వాదిస్తున్నారు. కనుక టెక్నికల్ గా సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం అనాలనేదే నా ప్రతిపాదన. అదే సరైనది. 


ఒక సామాజిక సిధ్ధాంతంగా కమ్యూనిజం మహత్తరమైనది. కానీ, భారత కమ్యూనిస్టు పార్టీలన్నీ (ఈసంఖ్య ఇప్పుడు 100 దాటింది) అనేక చారిత్రక తప్పులు చేశాయని ఒప్పుకునే నిజాయితీ మనకు వుండాలి. గాంధీ, కాంగ్రెస్, అంబేడ్కర్, రాజ్యాంగం తదితర అంశాల మీద అప్పుడు కమ్యూనిస్టు పార్టీలు చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ ముందుకు తెస్తే ఇంకో పది ముక్కలు అదనంగా చేరుతాయి. ఇప్పటి సమస్యకు ఇది పరిష్కారం కాదు. 


ఐక్యత ఒక్కటే ఇప్పటి ఎజెండా. చైనాలో జపాన్ వ్యతిరేక జాతీయ ఐక్యసంఘటన కొనసాగిన నాలుగేళ్ల  కాలంలో రాతల్లోగానీ, ఉపన్యాసాల్లోగానీ మావో 'వర్గపోరాటం' అనే పదాన్ని ఒక్కసారి కూడ వాడలేదట. ఆ దృక్పథం వుండాలి మనకు. 


In 'Bunch of Thoughts' published in 1966, MS Golwalkar talks about 3 internal threats (enemies) - Muslims, Christians & Communists.అని ప్రకటించాడు. 


దీన్నివాళ్ళు ఈమధ్య కొద్ది మార్పులు చేసి The “malicious-5” or M5, అంటున్నారు. 

1.   Marxism

2.   Macaulayism

3.   Missionaries

4.   Materialism and

5.   Muslim extremism.


ఈ ప్రకటన ఆధారంగా  సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం బాధితులు ఎవరో ఒక జాబితా తయారు చేయవచ్చు. ఈ జాబితాలో తొలిగా వుండేది  ముస్లింలు అనే విషయంలో ఎవరికీ అభ్యంతరం వుండాల్సినపనిలేదు.  ఆ తరువాత క్రైస్తవులు. ఆ తరువాత కమ్యూనిస్టులు, ఆదివాసులు, ఎస్సీలు, బిసిలు ... ... ఇలా సాగుతుంది ఈ జాబితా. 


ఒకవైపు, మైనారిటి మత విశ్వాసుల  సంఘపరివారం ఎలాగూ దాడి చేస్తున్నది.  ఇప్పుడు హేతువాదాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం ఎవరయినా చేస్తున్నారంటే వాళ్ళు మత విశ్వాసుల మీద మరోవైపు నుండి దాడి చేయడానికి సిధ్ధపడుతున్నారని అర్ధం. 


ఇది చారిత్రక  సందర్భం అయినప్పుడు హేతువాదం గురించి మాట్లాడడం అసందర్భం. హేతువాద వేదికల్లో ముస్లింలు, క్రైస్తవులు పాల్గొనరు. అసలు బాధితులు లేకుండా సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం  మీద పోరాటానికి అర్ధమే వుండదు. 


డానీ

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

9010757776


No comments:

Post a Comment