Monday 23 January 2023

ప్రజలు ఎంతో ఆశగా కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు!

 ప్రజలు ఎంతో ఆశగా కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు!

కమ్యూనిస్టు పార్టీలు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాయి!   


ప్రజలు ఎంతో ఆశగా కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు!

కమ్యూనిస్టు పార్టీలు ఎంతో అజ్ఞానంలో కూరుకుపోతున్నాయి!  

 

వర్తమాన ప్రపంచం చాలా కొద్ది మందికి మాత్రమే ఆహ్లాదకరంగా ఉంటుంది.  అత్యధికులకు భరించశక్యంగా ఉండదు. ఈ  సమూహాలన్నీ అనేక రకాల  దోపిడీకి, అణిచివేతలకు గురవుతుంటాయి. కొందరు ఆర్ధిక  అణిచివేతకు మరికొందరు సాంస్కృతిక  అణిచివేతకు, ఇంకొందరు భాష అణిచివేతకు, ఇంకొందరు ప్రాంత అణిచివేతకు, లింగ అణిచివేతకు, తెగ అణిచివేతకు, మత అణిచివేతకు ఇంకా అనేక రకాల అణిచివేతలకు గురవుతుంటారు. 

వీరి మీద సాగే దోపిడి, అణిచివేతలు ఒకటే కాకపోవడంవల్ల  వీళ్ళందరూ  విడివిడిగా జీవిస్తుంటారు.  కొన్ని సందర్భాలలో పరస్పర విరుద్ధం గాను, ప్రత్యర్ధులుగాను కొనసాగుతుంటారు.  వీరి మీద సాగే దోపిడి, అణిచివేత రూపాలు వేరయినా వీరందరూ బాధిత సమూహాలు. అదే వీరి ఐక్యతకు సామాజిక పునాది.  దోపిడీ అణిచివేతలకు  బాధితులు కనుక వీరందరూ   దోపిడీ అణిచివేతలకు వ్యతిరేకంగా ఒక సమతా సమాజాన్ని కోరుకుంటారు.  అదే వీరి ఐక్యతకు బౌధ్ధిక  పునాది.  వీళ్లకు కార్ల్ మార్క్స్ తెలియకపోవచ్చూ, కమ్యూనిజం గురించి తెలియకపోవచ్చూ  అలాంటి గ్రంధాలూ చదివి వుండకపోవచ్చూ. అయినప్పటికీ వీళ్లు సమతావాదులు. వీళ్లు సమాజసిధ్ద సహజసిధ్ద సామ్యవాదులు. ఆర్గానిక్ కమ్యూనిస్టులు. 

మనది బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనుక  ఆర్గానిక్ కమ్యూనిస్టులు అందరూ ఒకే రాజకీయ పార్టీకి అభిమానులుగా  ఉండకపోవచ్చూ. వాళ్ళందరూ తమ ఆసక్తి సందర్భాలనుబట్టి అనేక రాజకీయ పార్టీలకు అభిమానులుగా మారవచ్చూ. వీళ్ళందరినీ ఉత్తేజ పరచి తన వైపుకు ఆకర్షించడం కమ్యూనిస్టు పార్టీకి చారిత్రక బాధ్యత.  కానీ అందుకు విరుధ్దంగా జరుగుతోంది. ఆర్ధిక దోపిడీని  మాత్రమే గుర్తించడంతో ముందు ఎస్టీ, ఎస్సి, బిసి,  మైనారిటీలు, స్త్రీలలో  ఎక్కువభాగం కమ్యూనిస్టు పార్టీలకు దూరమయ్యాయి.  మిగిలిన  కొద్దిపాటి యజమాని కులాలు, కార్మిక  సమూహాలు సహితం కమ్యూనిస్టు పార్టీలను వదిలేస్తున్నాయి.   

భారత కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారు గొప్ప  ఉన్నతులు. బాగా చదువుకున్న వారు. కుటుంబాలను, ఆస్తుల్ని వదులుకున్నవారు. దాంపత్య సుఖాన్ని సహితం  త్యాగం చేసిన వారు. జైళ్లకు వెళ్లారు. చివరకు ఆత్మబలిదానానికి కూడా సిధ్ధాపడ్డవాళ్లు.  ముజప్ఫర్   అహ్మద్ , చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎస్ ఏ డాంగే, బిటి రానాదివే, ఐఎంఎస్ నంబూద్రిపాద్, ముగ్ధుమ్ మొహియుద్దీన్, చారు  మజుందార్,  చండ్ర పుల్లారెడ్డి,  తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్య మూర్తి ఇంకా లేఖ్ఖలేనన్ని పేర్లు ఐ జాబితాలో ఉంటాయి.    

అయితే, భారత సమాజ నిర్దిష్ట వాస్తవిక స్వభావానికి సరిపడా విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడంలో  మాత్రం   భారత  కమ్యూనిస్టు పార్టీలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి.  ఒక ఉత్తేజాన్ని రేకెత్తించి ఒక నమ్మకాన్ని కలిగించి   సమూహాలు సమూహాలుగా అణగారిన వర్గాల్ని కదిలించే  విప్లవ కార్యక్రమం ఇప్పటికి ఏ కమ్యూనిస్టు పార్టీ దగ్గరాలేదు

పది కారణాలు పేర్కొనవచ్చు 

మొదటిది;  

భారత  కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారు రష్యా విప్లవ నాయకుడు వి ఐ లెనిన్ ను, చైనా  విప్లవ నాయకుడు మావో సేటుంగ్స్ ను అతిగా నమ్మారు.  

రెండోది; లెనిన్ గానీ, మావో గానీ గొప్ప సృజనశీలురు. వాళ్ళు మార్క్స్   -ఏంగిల్స్ చెప్పిన      మూల  సూత్రాలను పాటిస్తూనే, తమ దేశాల నిర్దిష్ట సామజిక చారిత్రక పరిస్థితులకు అనువుగా సృజనాత్మకంగా భిన్నమైన విప్లవ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. విజయాలు సాధించారు. అలాంటి  సృజనాత్మకత భారత కమ్యూనిస్టు నాయకులకు ఏ దశలోనూ ఏ మాత్రం లేదు. 

రెండోది; 

లెనిన్, మావో ఇద్దరూ  గొప్ప సృజనశీలురు. వాళ్ళు మార్క్స్   - ఏంగిల్స్ చెప్పిన      మూల  సూత్రాలను పాటిస్తూనే, తమ దేశాల నిర్దిష్ట సామజిక చారిత్రక పరిస్థితులకు అనువుగా సృజనాత్మకంగా భిన్నమైన విప్లవ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. విజయాలు సాధించారు. అలాంటి  సృజనాత్మకత భారత కమ్యూనిస్టు నాయకులకు ఏ దశలోనూ ఏ మాత్రం లేదు.  

మూడవది :

సృజనాత్మకత లేకపోవడంవల్ల భారత కమ్యూనిస్టు పార్టీలు మొదటి నుండి రష్యా, చైనాల తోకపట్టుకుని నడవడానికి  అలవాటు పడిపోయాయి.   తొలిదశలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ద గ్రేట్ బ్రిటన్ జనరల్ సెక్రటరీ రజని పామే దత్త్ అడుగుజాడల్లో నడిచారు.  అయన కార్యక్షేత్రం  గ్రేట్ బ్రిటన్. భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ వలస పాలన  నడుస్తోంది. ఇంగ్లండ్ కమ్యూనిస్టు పార్టీని విమర్శనాత్మకంగా చుడాలనే ఇంగితం మనోళ్లకు లేకపోయింది.  రెండవ ప్రపంచ యుద్ధకాలంలో  అక్షరాజ్యాలయిన జర్మనీ, ఇటలీ, జపాన్ కూటమికి వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్లు మరో కూటమిగా మారాయి. అంతర్జాతీయ వేదిక మీద రష్యాకు ఇంగ్లండ్ మిత్రదేశం ఉంటున్నది   గాబట్టి అప్పట్లో బ్రిటిష్ -ఇండియాలో సాగుతున్న క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. జర్మనీ జపాన్ ల మద్దతు కోరిన సుభాష్ కేంద్ర   బోస్ ను విమర్షించిందీ.    అంతర్జాతీయ మార్గదర్శకత్వంలో సిపిఐ (ఎం) చైనా మార్గాన్ని ఎంచుకొంది. చారు మజుందార్ నాయకత్వంలో ఏర్పడిన సిపిఐ (ఎంఎల్) ఏకంగా "చైనా చైర్మన్ మన చైర్మన్" అని ప్రకటించి మూఢభక్తిని ప్రకటించుకుంది. ౨౦౦౪లో అప్పటి పీపుల్స్  వార్ తనను తాను రద్దు చేసుకుని మావోయిస్టు పార్టీగా మారిపోయింది. నక్సల్బరీ ఉద్యమానికి చైనా  కమ్యూనిస్టు పార్టీ చేసిన ఉపకారం ఒక్కటే; తమ పార్టీ అధికార పత్రికలో  'వసంత మేఘగర్జన (Spring థండర్) శీర్షికన ఒక వ్యాసం రాయడం. ౧౯౫౧ లో రష్యా వెళ్లిన సిపిఐ నాయకులకులతో స్టాలిన్స్ కాస్సేపు కూర్చొని   మాట్లాడాడు. ౧౯౭౦లలో చైనా వెళ్లిన  సిపిఐ (ఎంఎల్) ప్రతినిధి బృందానికి మావో కనీసం ఇంటర్  వ్యూ కూడా ఇవ్వలేదు.  చైనా మీద జపాన్ దురాక్రమణకు పాల్పడినప్పుడు జాతీయ ప్రభుత్వంతో   ఐక్యసంఘటన కట్టి, ఒకవైపు  దేశంలో జాతీయనాయకునిగా పేరుగాంచి మరోవైపు కమ్యూనిస్టు పార్టీని బలపరచి విప్లవ దిశగా నడిపిన నాయకుడు మావో.  మన దేశం మీద దాడి చేసిన చైనాను సమర్ధించి రెండు విధాలా నష్టపోయింది సిపిఐ (ఎం). ౧౯౯౧లో తూర్పు యూరోప్ - రష్యా పతనమయ్యేమాట వరకు ఆ దేశాల్లో మారిన  పరిణామాల గురించి సిపిఐ ఎన్నడూ మాట్లాడలేదు. అసలు ౧౯౧౭లో రష్యాలో గానీ, ౧౯౪౯లో చైనాలో గానీ జరిగింది సోషలిస్టు విప్లవం కాదనే స్పృహ కూడా మన కమ్యూనిస్టు పార్టీలకు లేదు.   ఆనాటి ఛైనా సామాజికార్ధిక పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని  ౧౯౪౦లలో మావో 'నూతన ప్రజాస్వామిక విప్లవం' కార్యక్రమాన్ని రూపొందించాడు. పెట్టుబడిదారులు భూస్వామ్య వ్యవస్థను కూలదోసి తమకు అనుకూలమైన పార్లమెంటరీ వ్యవస్థను నిర్మించడాన్ని 'ప్రజాస్వామిక విప్లవం'  అంటారు. అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశాల్లో  'ప్రజాస్వామిక విప్లవాన్ని' చేపట్టడానికి  పెట్టుబడిదారులు సిదధంగా లేనప్పుడు కమ్యూనిస్టు పార్టీయే  పూనుకొని   విజయవంతం చేసే 'ప్రజాస్వామిక విప్లవాన్నే  'నూతన ప్రజాస్వామిక విప్లవం' అంటారు. ఇదేమి సోషలిస్టు విప్లవం కాదు. సోషలిస్టు విప్లవానికి పూర్వ దశ విప్లవం అన్నమాట. తమను ఎవరు అనుకరించరాదని, ప్రతి అర్ధవలస దేశం తమ సామాజిక భౌతిక స్థితిగతుల్ని బట్టి స్వంతంగా   ప్రజాస్వామిక విప్లవాన్ని రూపొందించుకోవాలని మావో చాలా స్పష్టంగా చెప్పాడు. తనను కలిసిన భారత కమ్యూనిస్టు బృందంతో ఆనాడు స్టాలిన్ కూడా ఇలాంటి హెచ్చరికే చేశాడు. స్వంతంగా భారత నూతన ప్రజాస్వామిక  విప్లవ  కార్యక్రమాన్ని రూపొందించే సాహసాన్ని భారత కమ్యూనిస్టు నాయకుల్లో ఏ ఒక్కరు చేయలేదు. పాత కమ్యూనిష్టులు ఘనంగా చెప్పుకునే 'ఆంధ్రా థీసిస్' గానీ,  సిపిఐ (ఎం) చెప్పే   జనతా ప్రజాతంత్ర విప్లవం గానీ సిపిఐ (ఎంఎల్ ), మావోయిస్టు పార్టీలు  చెప్పే   'నూతన ప్రజాస్వామిక విప్లవం' గానీ అన్ని  ౧౯౪౦ల నాటి మావో పుస్తకానికి నాకాళ్లే .  వీటిల్లో వీళ్ళందరూ మహా అయితే ఒకటి రెండు వాక్యాలు అదనంగా చేర్చి ఉంటారు.  ౮౦ ఎల్లా క్రితపు ఒక దేశపు కార్యక్రమం ఇప్పటికి మనకు పనికి వస్తుందనుకోవడం చారిత్రక bhwtika   వాదానికి వ్యతిరేకం.    


నాలుగవది: 

అతివాద మితవాదాలు కూడ కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పిదాల్లో కీలకమైనవి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిజాం సర్కారు ఏమాత్రం  అణిచివేసిందోగాని   నెహ్రు-పటేల్ కాంగ్రెస్   సైన్యం అంతకు వంద రెట్లు ఎక్కువగా ఆ పోరాటంలో  కమ్యూనిస్టుల్ని చంపేసింది.  అయినా కాంగ్రెస్ ను అతిగా నమ్మిన సిపిఐ  ఎమర్జెన్సీ రోజులో ఆ పార్టీ పక్షాన  నిలిచింది.  అదే సమయంలో కాంగ్రెస్ ను అతిగా ద్వేషించిన సిపిఐ (ఎం)  పాలిట్  బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు జనసంఘ్ తో  అపవిత్ర అనుబంధాన్ని కొనసాగించారు.  ఇది ఆరెస్సెస్ కు అప్పటి అనుబంధ రాజకీయ సంస్థ; ఇప్పటి బిజెపికి పూర్వ రూపం.   బిజెపి నాయకత్వంలోని ఆరేళ్ళ  ఎండిఏ పాలన తరువాత ౨౦౦౪లో కేంద్రంలో వామపక్షాల మద్దతుతో  సెంట్రిస్టు  కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ)  ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి పరిస్థితుల్లో అదొక మంచి రాజకీయ ప్రయత్నం. ప్రజలు కూడ మంచి జరుగుతున్నదనే ఆశలో వున్నారు. అమెరికాతో ఇండియా అణుఒప్పందం చేసుకుంటునప్పుడు  వామపక్షాలు తమ నిరసన తెలిపితే సరిపోయేది. అవి  అతిగా అలిగి ఏకంగా యుపిఎ నుండి బయటికి వచ్చేశాయి. ఇదొక చారిత్రక తప్పిదం. ఆ పిదప ఒకవైపు యుపిఎ నైతికగా  పతనం అయింది. మరో వైపు వామపక్షాల బలం కూడ పతన దిశగా సాగింది.  మధ్యలో బిజెపి భారీగా పుంజుకుని మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 

ఐదవది :

ఎస్టీ, ఎస్సి, బిసి, మైనారిటీలు, స్త్రీలు  దాదాపు ౮౫ శాతం  ఉన్న  దేశం మనది. అనేక పద్ధతుల్లో  అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న శ్రేణులు ఇవి. కార్మికవర్గంలోనూ వీరి శాతం చాలా ఎక్కువ.   ఐ    శ్రేణుల ప్రత్యేక అస్తిత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వీరిమీద   సాగుతున్న ప్రత్యేక దోపిడీ పీడనల్ని కమ్యూనిస్టు పార్టీలు ఎన్నడూ సీరియస్ గా  పట్టించుకోలేదు. పార్లమెంటరీ ఎన్నికల్లో  రాజ్యాధికారాన్ని చేపట్టి  ఆర్ధిక సమానత్వాన్ని  సాధిస్తే సాంస్కృతిక సమానత్వం దానికదే వస్తుందనే ఒక కంటితుడుపు మాటలు మాత్రమే అనేవారు.  దాదాపు ౬౦-౭౦  సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలను  నమ్ముకున్న ఎస్టీ, ఎస్సి, బిసి, మైనారిటీలు, స్త్రీలు  ౧౯౮౦వ దశకం తరువాత ప్రత్యామ్నాయాలు వెతకడం మొదలెట్టారు. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఐ అణగారిన సమూహాల ఆవేదనను అర్ధం చేసుకోకపోగా వాళ్ళు వదిలి వెళ్లిపోవడం వల్లనే దేశంలో కమ్యూనిస్టు    ఉద్యమాలు బలహీనపడిపోయాయనే ఎదురు నిందను మోపారు. వర్గం మన దేశంలో కులం, మతం, తెగ, లింగం తదితర రూపాల్లో ఆపరేట్ అవుతున్నదనే ఆలోచనే కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఎన్నడూ రాలేదు. ఇవికాక మిగిలిన ౧౫ శాతం యజమాని సామాజిక వర్గాల   సెంటిమెంట్ దెబ్బతింటుందనే భయం  వాళ్ళను వెంటాడింది. ఆ ౧౫ శాతం కూడ తమ ప్రత్యామ్నాయాల్ని ఎంచుకుంది.    


ఆరవది: 

కమ్యూనిస్టు పార్టీల నాయకుల మూలంగా ప్రపంచా వ్యాప్తంగా కమ్యూనిజానికి ఆమోదాశం తగ్గుతున్నది గమనించిన ప్రపంచ బ్యాంక్ ౧౯౮౪లో ఒక్కసారిగా విజృంభించి  ముప్పేట దాడి సాగించింది.  ఒకవైపు ఫైనాన్స్  తోటి, మరోవైపు సంస్కృతీ తోటి అణగారిన సమూహాల మీద దాడి మొదలెట్టింది.  పెట్టుబడిదారీ వ్యవస్థ తన ప్రయోజనాల కోసం మతాన్ని ఆశ్రయిస్తుందనేది  సాంప్రదాయ కమ్యూనిస్టుల   ఊహకు కూడ అందని విషయం. మూడోవైపు,  ఐటి విప్లవాన్ని ప్రవేశపెట్టింది. కార్ల్స్ మార్క్స్ పెట్టుబడిదారీ విధానం పుట్టుక పెరుగుదలల్ని వివరించాడు. లెనిన్ పెట్టుబడిదారీ విధానం అత్యున్న దశగా సామ్రాజ్యవాద యుగాన్ని వివరించాడు. సామ్రాజ్యవాద దశలో ఒక భూస్వామ్య దేశంలో పెట్టుబడిదారీ (ప్రజాస్వామిక) విప్లవాన్ని ఎలా పూర్తి చేయవచ్చొ మావో చుపించాడు. కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ మతాన్ని కవచంగా ధరించి కార్మికుల్ని చీల్చేసి అణిచివేస్తున్నపుడు కమ్యూనిస్టు పార్టీలకు దరి చూపడానికి అంతర్జాతీయ మార్గదర్శి లేకుండాపోయాడు. జీవిత కాలమంతా ఇతరుల్ని అనుకరిస్తూ గడిపేసిన భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు దారీతెన్నూ కనిపించలేదు. కొత్తగా వఛ్చిన ఐటి విప్లవం వాళ్ళను మరి ఉక్కిరిబిక్కిరి చేసేసింది.    

ఏడవది :

కమ్యూనిస్టులు వేరు
కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వేరు

అవసరమైనవాళ్ల ద్వార కాకుండా  అవసరం లేనివాళ్ల ద్వార
భారత దేశంలోనికి కమ్యూనిజం  వచ్చింది.

కమ్యూనిజం అవసరమైనవాళ్ళు
దాన్ని  స్థానిక అవసరాలకు అనువుగా
సృజనాత్మకంగా అన్వయిస్తారు

కమ్యునిజం అవసరంలేనివాళ్ళు
అతివాదం పేరుతో
కమ్యూనిజాన్ని జడపదార్ధంగా మారుస్తారు


అణగారిన వర్గాల మధ్య అనేక వైరుధ్యాలున్నమాట వాస్తవం. అయినప్పటికీ అణగారినతనం వాళ్లను ఏకం చేస్తుంది. కలిసిపోరాడడం నేర్పుతుంది. ఐక్యత సందర్భం అయినప్పుడు వైరుధ్యాల గురించి మాట్లాడేవాడు మూర్ఖుడు.


ఎనిమిదవది :

తొమ్మిదవది :


పడవది  :  

భారత దేశంలో ఒక రాజకీయ విషాదం ఉంది. మన సమాజం ఆహ్లాదకరంగా ఉందని భావించే సమూహాలు వందేళ్లలో వంద సంస్థలుగా విస్తరించగా,  భారత కమ్యూనిస్టు పార్టీ  వంద ముక్కలుగా చీలిపోయింది.  కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఎన్నడూ విప్లవ కార్యక్రమాన్ని అడగరు. వాళ్ళు ఎప్పుడు పార్టీ అగ్రనాయకుడ్ని నమ్ముతారు.  పార్టీలు చీలిపోయినప్పుడు నాయకత్వం మీద అభిమానము, నమ్మకమే ప్రాతిపదికగా ఉంటుంది. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి ఏ సిద్ధాంత ప్రాతిపదిక మీద చీలిపోయారని అడిగితె వివరం చెప్పేవాళ్ళు దొరకడం కష్టం. "'దున్నేవానికే  భూమి' ప్రాతిపదికగా సాగే  వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక  విప్లవం"  వర్ధిల్లాలి, "పల్లెపట్టు పైరగాలి పట్టణాల చుట్టును; భూతాలకు ప్రేతాలకు గోరీలే కట్టును" అంటుంటే     ౧౯౭౦-౮౦ లలో వీధులు దద్దరిల్లేవి. అలా  నినదించిన వారిలో పది శాతము మందికి కూడా adelA జరుగుతుందో తెలీదు. యాభయ్ ఏళ్ళ తరువాత కూడా ఆ పార్టీల కార్యక్రమాలు మారలేదు; అప్పుడప్పుడు తక్షణ పరిణామాల మీద  కొన్ని అనుబంధ తీర్మానాలు తప్ప     

No comments:

Post a Comment