‘బహుభార్యత్వం’పై
పట్టుపట్టకపోవటమే మంచిది!
“బహుభార్యత్త్వాన్ని రద్దు చేయడమే మేలు! దాని కోసం భారత ముస్లిం సమాజం పట్టుబట్టక పోవడమే మంచిది” - అని నేను పెట్టిన పోస్ట్ ను ఖండించిన వారందరు ముస్లిం పురుషులు. ఒక్క ముస్లిం స్త్రీ కూడ నా పోస్ట్స్ ను ఖండించలేదు.
బహుభార్యత్వం వల్లనే ప్రపంచంలో వ్యభిచారం, వివాహేతర సంబంధం, సహజీవనం కనుమరుగు అవుతుంది అన్నట్టు చాలామంది సూచించారు.
బానిసలు, ఆనాధలు, నిరాశ్రయులు, నిరుపేదల్ని మాత్రమే ముస్లిం పురుషులు రెండవ వివాహం చేసుకుంటున్నట్టు ఏ ఒక్కరు గట్టిగా చెప్పలేదు.
బహుభార్యత్వం రాజ్యాంగ బద్ధమో కాదో తేల్చడానికి మొన్న శుక్రవారం మధ్యాహ్నం (బాద్ జుమ్మా) సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించినట్టు కామెంట్ చేసిన మేధావుల్లో ఏ ఒక్కరికి కూడ తెలీదు. వీరిలో కొందరు లాయర్లు కూడ వున్నారు. ఇది మన స్థితి !
ఇతర సమాజాల ముందు ముస్లింలను మొరటువారిగా, అనాగరీకులుగా , మధ్యయుగాల సాంప్రదాయాలను వదులుకోలేనివారిగా చిత్రించడమే ఈ వివాదం లక్ష్యం. అత్యున్నత న్యాయంస్థానం కూడ ఇలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దల అభిమతం, ప్రయోజనాలను, దేశప్రజల సాధారణ మూడ్ (మూజువాణి)ను దృష్టిలో పెట్టుకుని అంతిమ తీర్పులు ఇస్తాయన్నది ఇప్పుడు బహిరంగ విషయమే. ఇలాంటి సందర్భాల్లో ముస్లిం సమాజం ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నది ఇక్కడొక సవాలు. దానిని గురించి ఆలోచన చేయకుండా ఒకరినొకరు ఎద్దేవలు ట్రోల్ చేసుకుంటూ కాలం గడిపితే గతంలో పడ్డ శిక్షలే పడుతాయి. గతంలో జరిగిన పరాభవాలే జరుగుతాయి.
No comments:
Post a Comment