Tuesday, 30 June 2026

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

 చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. 




మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

మైనారిటీ మత సమూహాల మీద మెజారిటీ మత సమూహాలు సాగిస్తున్న అణిచివేతని 

వర్గ వైరం అందామా? వర్గ పీడన అందామా? వర్గ పోరాటం అందామా? ఇంకేదయినా అందామా? 

ఇది మొదటి అంశం


ఇక రెండో అంశం  - 

మార్క్స్ ఏంగిల్స్ లిఖిత చరిత్ర అన్నట్టు మత వైరుధ్యానికీ ఒక కాల పరిమితిని విధిద్దామా?


మూడవ అంశం 

మత వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఒక చైతన్యయుత సంఘటిత ప్రయత్నం ఏమైనా కావాలా? అక్కరలేదా?  


నాలుగవ అంశం

పెట్టుబడీదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశకు చేరుకున్నప్పుడు ప్రధాన బాధిత సమూహం ఏమిటో మనకు ఒక అంచనా వుంది. 

పెట్టుబడీదారీ వ్యవస్థ మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థగా మారినపుడు బాధిత సమూహాలు ఏవీ? 


ఐదవ అంశం 

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో బాధిత సమూహాలు వంద వరకు వుండవచ్చు. 

వాటిల్లో ప్రధాన బాధిత సమూహాలు ఏవీ? 


ఆరవ  అంశం 

ఒక నిర్దిష్ట సమాజంలో ప్రధాన బాధిత సమూహాలు  ఏవో నిర్ధారించకుండా  ఒక పోరాట / విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడం సాధ్యమౌతుందా? 


మార్క్సో, ఏంగిల్సో మరొకరో చెప్పినంత మాత్రాన అది అంతిమ సత్యమనీ దాన్ని ప్రశ్నించకూడదనే అభిప్రాయం నాకు లేదు. 


సామ్రాజ్యవాద పెట్టుబడీదారీ వ్యవస్థ మార్క్స్ . ఏంగిల్స్ కాలానికి లేదు. దాన్ని విశ్లేషించే బాధ్యతను లెనిన్ తీసుకున్నాడు. 


మతతత్త్వ  పెట్టుబడీదారీ వ్యవస్థ లెనిన్, మావో, చారు మజుందార్ కాలానికి కూడ లేదు. 

మన కాలంలో అది ముందుకు వచ్చింది. 

దాన్నీ విశ్లేషించడం, దాని పరిష్కారానికి చేయాల్సిన పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం ఈ కాలపు ఆలోచనాపరుల బాధ్యత. 


వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక  మైనారిటీ మత సమూహాలు  ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఎవ్వరూ ఇవ్వరని ఆశిస్తాను. 


ఈ అంశం మీద ఇంకా విస్తృత చర్చ జరగాలనేదే నా ఉద్దేశ్యం. 

-  డానీ 


*నిన్నటి విప్లకారులు ఈరోజు విప్లవకారులు కావలసిన పనిలేదు*

1992 డిసెంబరులో మెజారిటీ మతతత్త్వ శక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశాయి. ఆ వెంటనే విరసం 1993 జనవరిలో గుడివాడలో జరిగిన పాఠశాలలో 'విప్లవ సాహిత్యంలో మతతత్త్వం' అనే అంశం మీద ఒక సెషన్ నిర్వహించింది. 'విప్లవోద్యమంలో మతతత్త్వం' గా దీనిని కొనసాగించవచ్చు. 

అంతకు ముందే కేవిఆర్ 'మతవర్గతత్వం' పేరుతో గద్వాలలో ఒక పాఠం చెప్పారు. బాలగోపాల్ 'హిందూ మతరాజ్యం' అనే పుస్తకం రాశాడు.  ఇప్పుడు నేను 'మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ' అంటున్నాను. ఇది అవగాహనకు సంబంధించిన ఒక  చారిత్రక క్రమం. 

ఇది నచ్చనివాళ్ళు. దీన్ని గట్టిగా అడ్డుకోవాలనుకునే వాళ్ళూ చాలామంది వుంటారు. వాళ్లలో కమ్యూనిస్టులూ వుంటారు.  వాళ్ళ అవసరాలు వాళ్లకుంటాయి. వాళ్ల తర్కం వారికుంటుంది.  కారంచెడు ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు మాదిగల మీద అగ్ర కులస్తులు దాడి చేశారంంటే పాత కమ్యూనిస్టులు కొందరు నా మీద విరుచుకుపడ్డారు. రైతు కూలీల మీద భూస్వాములు దాడి చేశారు అనేది వాళ్ల నేరేటివ్. 

మనుషులు ప్రపంచాన్ని తమ భౌతిక, సామాజిక అస్తిత్వాల నుండి చూస్తారు. దీనికి మీరూ నేనూ మినహాయింపు కాదు. 

1950లలో కమ్యూనిస్టు పార్టీలు భారత దేశాన్ని ఒకలా చూశాయి. అప్పటికి వాళ్లు విప్లవకారులు. 1960లలో వాళ్లను తీవ్రంగా విమర్శిస్తూ కొత్త దృక్పథంతో కొత్త కమ్యూనిస్టులు వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. 1970లలో వాళ్లనూ విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ఇంకో కొత్త దృక్పథంతో వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. ఇప్పుడు మళ్ళీ వాళ్లను విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి వాళ్ళూ విప్లవకారులే. 

కొత్త దృక్పథాలతో ముందుకు వచ్చేవారిని పాత కమ్యూనిస్టులు నిరాకరించడం పాత సాంప్రదాయమే. ఒక చారిత్రక దశలో విప్లవ ఆలోచనాపరులుగా వ్యవహరించినవారు ఇంకో చారిత్రక దశలో విప్లవ విఘాత శక్తులుగా మారిపోతారన్నది గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రమే. 

- డానీ



Janjerla Ramesh Babu

ChatGPT ప్రకారం, ఈ వాక్యం Friedrich Engels రచించిన The Origin of the Family, Private Property and the State లోని రెండవ అధ్యాయం (Monogamous Family) నుండి తీసుకోబడింది. ఇది మార్క్సిస్టు-స్త్రీవాద ఆలోచనలో అత్యంత ప్రసిద్ధమైన వాక్యాలలో ఒకటి.
తెలుగు అనువాదం
"చరిత్రలో కనిపించిన తొలి వర్గ వైరుధ్యం (class opposition), ఏకపత్ని వివాహ వ్యవస్థలో పురుషుడు మరియు స్త్రీ మధ్య ఏర్పడిన విరుద్ధ ప్రయోజనాల అభివృద్ధితో ఏకకాలంలో ఉద్భవించింది. అలాగే, చరిత్రలో జరిగిన తొలి వర్గ అణచివేత (class oppression), పురుషుడు స్త్రీని అణచివేయడంలోనే వ్యక్తమైంది."
లేదా మరింత సులభంగా:
"చరిత్రలో మొదటిసారిగా ఏర్పడిన ఆధిపత్యం–అణచివేత సంబంధం, ఏకపత్ని వివాహ వ్యవస్థలో పురుషుడు స్త్రీపై ఆధిపత్యం చెలాయించడంతో ప్రారంభమైంది. అందువల్ల మొదటి అణచివేతకు గురైన వర్గం స్త్రీలేనని ఎంగెల్స్ పేర్కొంటాడు."
భావం (Explanation)
ఎంగెల్స్ ఇక్కడ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
ఆదిమ సమాజాల్లో వ్యక్తిగత ఆస్తి (private property) పెద్దగా ఉండేది కాదు. అందువల్ల కుటుంబంలో కూడా స్త్రీ–పురుషుల మధ్య ఆధిపత్య సంబంధాలు అంత తీవ్రంగా ఉండేవి కావని ఆయన భావించాడు.
వ్యక్తిగత ఆస్తి పెరిగిన తర్వాత, ఆ ఆస్తి తన సంతానానికే సంక్రమించాలనే ఉద్దేశంతో పురుషాధిక్య కుటుంబ వ్యవస్థ (patriarchal family) బలపడింది.
ఈ క్రమంలో ఏకపత్ని వివాహ వ్యవస్థ (monogamous marriage) స్త్రీపై నియంత్రణకు ఒక సాధనంగా మారిందని ఎంగెల్స్ వాదించాడు.
అందువల్ల సమాజంలో కనిపించిన తొలి "ఆధిపత్యం–అణచివేత" సంబంధం పురుషుడు స్త్రీపై ఆధిపత్యం చెలాయించడమేనని, తరువాత అదే నమూనా వర్గాల మధ్య (యజమాని–కార్మికుడు, పాలకుడు–పాలితుడు) కనిపించిందని ఆయన విశ్లేషించాడు.
In this quotation, "female sex" does not refer to sexual intercourse or sexual activity. It uses the older meaning of the word "sex", which means biological sex—that is, the category of being female or male.
In the sentence:
"...the first class oppression coincides with that of the female sex by the male."
"Female sex" simply means "women" or "the female sex as a social group." Engels is saying that, in his view, the earliest form of systematic oppression was the subordination of women by men.
Here, the phrase can be understood as:
Female sex = women (the biological female population)
By the male = by men
It is not referring to:
sexual intercourse,
sexual relations,
sexual behavior,
or sexuality.
Why did Engels use "sex" instead of "women"?
In the 19th century, especially in philosophical and academic writing, it was common to refer to "the female sex" and "the male sex" as formal expressions meaning women and men respectively.
For example:
"The female sex deserves equal rights." = Women deserve equal rights.
"The male sex has historically held political power." = Men have historically held political power.
In the context of the chapter
Engels argues that the emergence of the monogamous patriarchal family marked the beginning of a social relationship in which men exercised authority over women. Whether one agrees with this historical interpretation or not, the phrase "female sex" in this passage refers only to women as a social and biological group, not to intercourse.
So, the sentence is about gender-based social oppression, not about sexual relations.










No comments:

Post a Comment