ఎప్పుడైనాసరే, కళాసాహిత్యాల నిషేధం అనేది కోరదగ్గ అంశంకాదు.
సాంస్కృతిక దాడిని సాంస్కృతిక దాడితోనే ఎదుర్కోవాలి.
వాదించే శక్తిలేనపుడు మనుషులు తిట్లు లంఘించుకుంటారు.
ప్రభుత్వాలు నల్లచట్టాలను రూపొందిస్తాయి
Rulers,
Ruled and Art
కళను కళగానే చూడాలనేది పాలకవర్గాల భావజాలం.
కళను సామాజికంగానే చూడాలనేది పాలితుల చారిత్రక అవసరం.
Comfort ability and individual
సౌకర్యవంతంగా బతకాలనే ఆలోచన వచ్చిన మరుక్షణమే మనిషి చనిపోతాడు.
Modernsociety and comforts
సౌకర్యాలను సాధించడమే మనిషి సామర్ధ్యానికి అంతిమ కొలమానంగా ఆధునిక సమాజం మార్చేస్తుంది.
Modern
Society and Human relations
ఆధునిక సమాజం అనేది ఒక భ్రమ. అందులో మానవ సంబంధాలు వుండవు. వుండేదల్లా మానవ వినాశనమే.
Parents,
Children and comfortism
పిల్లలు సౌకర్యంగా జీవించాలని తల్లిదండ్రులు తమ సౌకర్యాలను ఫణంగా పెడతారు. సౌకర్యాలు ఒక సంస్కృతిగా మారగానే పిల్లలు మొదట మోసంచేసేది తలిదండ్రులనే.
Parents
and children
మన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ సర్వస్వాన్ని ఫణంగా పెడతారు. మనం మన సౌకర్యాల్లో ఆచితూచి కొంత భాగాన్ని మాత్రమే వాళ్లకు ఇస్తాము.
Parents,
children and Parents
మన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ సర్వస్వాన్ని ఫణంగా పెడతారు. మనమూ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తాము. ఇందులో మర్మం ఏమంటే, మన పిల్లలకు మన సర్వస్వాన్ని ఫణంగా పెట్టే క్రమంలో మనం మన తల్లిదండ్రులకు అన్యాయం చేస్తాము.
Selfishness
స్వార్ధానికి కొనసాగింపే మోసం.
Individual
and family
మన ఆలోచనలు కుటుంబం చుట్టూ తిరుగుతాయన్నది ఒక భ్రమ. మన ఆలోచనలు మన చుట్టే తిరుగుతాయి.
Modernsociety
and invidual
ఆధునిక సమాజంలో వ్యక్తి మాత్రమే వుంటాడు. సమూహం వుండదు. మనిషి సమూహం నుండి ఒంటరి అవుతాడు.
Social
group and individual
సమూహం లేకుండా మనిషి బతకలేడు. కానీ, సమూహాన్ని అధిగమించి మనిషి ఎదగాలనుకుంటాడు. అదే ఆధునిక జీవితంలో వైవిధ్యం.
Betrayals
of parents
మనమంతా తల్లిదండ్రుల ద్రోహులం.
Society and individual
సమాజానికి భిన్నంగా వుండేవారూ కొందరు వుంటారు. అయితే, మనుషుల్ని తనకు భిన్నంగా సమాజం ఎన్నడూ వుండనివ్వదు.
Modern society and Parents
మనం మన తలిదండ్రుల్ని బాగా చూసుకోవాలనేది మన వ్యక్తిగత ఆలోచన. ఆధునిక సమాజ చలన శక్తులు దాన్ని ఒప్పుకోవు.
Everything for children
అసలు కిటుకంతా పిల్లలకు సర్వస్వం ధారపొయాలనేదానిలోనే వుంది. పిల్లలకు సర్వస్వం ధారపోసాక ఇంకేమీ మిగలదు కనుక అలాంటివాళ్ళు మిగిలినవారు ఎవరికీ ఏమీ ఇవ్వలేరు. ఆక్రమంలో మనుషులు తల్లిదండ్రుల్నేకాదు, తమనుతాము కూడా మోసం చేసుకుంటారు. దీన్ని నేరము-శిక్ష అనే అర్ధంలో చూడకూడదు. ఒక జీవన విధానంగా చూడాలి. ఇప్పుడుదాన్నే మార్చాలి.
Relativity between parents and children
Relativityతల్లిదండ్రులు, పిల్లలు అనేవి సాపేక్ష పదాలు. తల్లిదండ్రుల నుండి పిల్లలు పుట్టుకొచ్చినట్టే, పిల్లల నుండి తల్లిదండ్రులు పుట్టుకువస్తారు.
Three generations
ప్రతికుటుంబంలో మూడుతరాలు వుండాలి. పోషించినవాళ్ళు, పోషిస్తున్నవాళ్ళు, పోషించేవాళ్ళు. ఇదొక వృత్తం. తరాల స్థానాలు ప్రతి తరానికీ మారిపోతుంటాయి.
Three generations
కుటుంబం అంటే కనీసం మూడు తరాల సమిష్టి ఆర్ధిక సమూహం.
Family
and three generations
మూడుతరాలులేని జీవనవ్యవస్థని, కుటుంబం అనకూడదు.
కలిసి జీవించే వ్యక్తుల సంఖ్యనుబట్టి, వాటిని, ఇంగ్లీషులో, Nuclear, solo parent, Atomistic వగయిరా పేర్లతో పిలుస్తున్నారు.
Market and family
మార్కెట్ గురించి మాట్లాడకుండా కుటుంబం, సమాజం గురించి ఎంత మాట్లాడినా మనం సమస్యను కనీసంగా తడిమినట్టు కూడా కాదు. మనం ఇంటా బయట ఎదుర్కొంటున్న సంస్థాగత విషాదాలకు మూలం మార్కెట్టే!
Television
బయటికి వెళితే బూచాడు పట్టుకు పొతాడని పిల్లల్ని తలిదండ్రులు భయపెట్టేవాళ్ళు. ఇది యాభై యేళ్లక్రితం నాటి సంగతి. ఇప్పుడు బూచాడిని ఇంట్లోకి తెచ్చి, అగ్రపీఠం మీద కూర్చోబెట్టి పిల్లల్ని అప్పచెపుతున్నారు తల్లిదండ్రులు.
Television
మన ఇళ్లల్లోకి చాలా విషయాలను ఉచితంగా తీసుకువస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికది మనల్ని పట్టుకుపోయి మార్కెట్ కు అప్పచెపుతుంది.
Market
మార్కెట్ ప్రవేశమూ, కుటుంబ వ్యవస్థ పతనం ప్రారంభమూ ఒక్కసారే మొదలవుతాయి.
Market
మార్కెట్ ప్రభావంతో, మనిషి పగలంతా సామాజిక జీవితానికి చిల్లులు పెటుతుంటాడు. సామాజిక సంబంధాలు పతనమైపోతున్నయని రాత్రంతా ఏడుస్తుంటాడు.
Market
మార్కెట్ మన జీవితాల్లోకి ఆనందాన్నీ, దుఖ్ఖాన్నీ నింపుతుంది. తియ్యటినీళ్ళు ఆవిరైపోయి, సముద్రపు నీరు ఉప్పగైపొయినట్టు ఆనందం ఆవిరైపొతుంది. దుఖ్ఖం స్థిరపడిపొతుంది.
Caretaking
మనల్ని విమర్శించాల్సినవాళ్ళు విమర్శించనపుడు మనల్ని మనమే విమర్శించుకుందాం.
మనల్ని పొగడాల్సినవాళ్ళు పొగడనప్పుడు మనల్ని మనమే పొగుడుకుందాం. అప్పుడు అతివిశ్వాసమూ తగ్గుతుంది. ఆత్మన్యూనతా తగ్గుతుంది; అపధ్ధర్మం
Crony Capitalism
క్రొనీ క్యాపిటలిజం కొద్ది మందిని రాత్రికిరాత్రే సహస్ర కోటీశ్వరుల్ని చేసేస్తుంది. మిగిలిన శతకోటి జనంలో వ్యామోహాన్ని పెంచి స్వీయవినాశనానికి దారితీస్తుంది.
Purchasing capacity
మారుతున్న తరాలు
1950
ల నాటి తరాల దగ్గర కొనడానికి శక్తీ వుండేదికాదు,
కొనుక్కోవడానికి బజార్లో సరుకులూ, వస్తువులు వుండేవికావు.
1970ల నాటి తరాలు అవసరాన్నిబట్టి, స్తోమతనుబట్టి
బజార్లో సరుకులు, వస్తువులు కొనేవారు.
2000
ల నాటి తరాలు అవసరం, స్తోమతలబట్టికాక బజార్లో అమ్ముతున్నారు
గాబట్టి సరుకులు, వస్తువులు కొంటున్నారు.
Three Seasons
మూడు
రుతువులు
బాల్యంలో మనిషి పని నేర్చుకుంటాడు, ఇతరులమీద ఆధారపడతాడు.
యవ్వనంలో మనిషి పనిచేస్తాడు, ఇతరులనీ పొషించగలుగుతాడు
వృధ్ధాప్యంలో మనిషి పనిచేయలేడు, ఇతరుల మీద ఆధార పడతాడు.