NOTES ON VISWAROOPAM
విశ్వరూపం
-1
సాంకేతికంగా
అద్భుతమైన, నటనపరంగా ఉన్నతమైన, విస్తృతిలో
అంతర్జాతీయమైన, సన్నివేశాలపరంగ అర్ధసత్యమైన, సమర్పించడంలో అతితెలివైన, సారాంశంలో అమెరికా
అనుకూలమైన సినిమా.
విశ్వరూపం
-2
కమల్‌హసన్
భారతీయ సినిమాను సాంకేతికంగా అంతర్జాతీయస్థాయికి
తీసుకెళ్ళారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. సాంస్కృతికంగా అమెరికా స్థాయికి తీసుకువెళ్ళారు
అనంటే ఇంకా సమంజసంగా ఉంటుంది.
విశ్వరూపం
-3
కథాస్థలం
ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇరాక్ అయితే కథ ఎలా నడిచేది? అనే ఒక చిన్న సందేహం ఏఒక్కరికి కలిగినా,
విశ్వరూపం నిర్మాతలు ఆశించే అంతర్జాతీయ ప్రయోజనాలు అర్ధం అవుతాయి.
విశ్వరూపం
-4
కళనుకళగానే
చూడాలనేది పాలకవర్గాల భావజాలం. కళను సామాజికంగానే చూడాలనేది పాలితుల చారిత్రక అవసరం.
విశ్వరూపం
-5
కళాకారుడు
కళాకారుడిగానే వుంటే ఎవరీకీ అభ్యంతరం వుండదు. తెలిసిగానీ, తెలియకగానీ రాజకీయాల్లోకి
అడుగుపెడితే, ఆ తరువాత రాజకీయాలే వుంటాయి.
విశ్వరూపం
-6
అమెరికా
ప్రాయోజిత కార్యక్రమంగా అంతర్జాతీయ వేదికలపై సాగుతున్న ముస్లిం వ్యతిరేక ప్రచారానికి
అనువుగా ఈ సినిమా వుంది. అయితే, ఇందులో ఎక్కడా హిందూ -ముస్లిం విబేధాల ప్రస్తావన
లేదు. నేరుగా, ఈ సినిమావల్ల భారతదేశంలో మతఘర్షణలు చెలరేగే అవకాశాలు అస్సలు లేవు. ఈ
సినిమాను ముస్లింలు నిరసిస్తే సరిపోతుంది.
నిషేధించాల్సిన అవసరం అస్సలు లేదు.
విశ్వరూపం
-7
ఎప్పుడైనాసరే, కళాసాహిత్యాల
నిషేధం అనేది కోరదగ్గ అంశంకాదు. సాంస్కృతిక దాడిని సాంస్కృతిక దాడితోనే ఎదుర్కోవాలి.
No comments:
Post a Comment