కొందరి
ఆహారం మరికొందరికి విషం కావచ్చు. దీనికైనా సందర్భం ముఖ్యం.
Stupid
people
మూర్ఖులకు అద్భుత శక్తి వుంటుంది. ఎంతటి గొప్పవాళ్లనైనా వాళ్ళు తమస్థాయికి దిగజార్చేయగలరు.
Stupid people
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మిత్రులతో మాట్లాడవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే
శత్రువులతో మాట్లాడవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూర్ఖులతో మాట్లాడలేము.
Beauty of life
జీవనశౌందర్యం
అంటే మరేదోకాదు అణగారినవాళ్ళు స్వేఛ్ఛా గాలులు పీల్చడానికి చేసే పెనుగులాట.
స్త్రీ-పురుష సంబంధాల గురించి మనం మాట్లడేదంతా సారాంశంలో ఆస్తిసంబంధాల గురించే.
మనిషి వ్యవహార శైలిలో ఉన్న మర్మికతే అది. అదే అతన్ని ఇతర జీవుల నుండి విడగొడుతుంది.
లేకపోతే ఆర్ధిక నిర్ణాయకవాదం అయిపోతుంది. మనిషి అలా ప్రవర్తించడు. కానీ సారంశం అదే.
ఆధిపత్య భావన అనేది స్వంతాస్థి కొనసాగింపే. ఉన్నత రూపం అనవచ్చు.
Learned Person
జ్ఞానుల్ని నాలుగుసార్లు కలవకండి
జ్ఞానుల్ని మొదటిసారి కలిసినపుడు, వాళ్ల జ్ఞానం మీద గౌరవభావంతో మొక్కాలనిపిస్తుంది.
జ్ఞానుల్ని రెండవసారి కలిసినపుడు, వాళ్ళ జ్ఞానాన్ని ఎలాగైనా తస్కరించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని మూడవసారి కలిసినపుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానంతోనే వాళ్ళను అధిగమించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని నాలుగవసారి కలిసినపుడు, ఆత్మన్యూనతాభావంతో వాళ్లపై నైతిక దాడి చేయాలనిపిస్తుంది.
Victory & Defeat
మనం సాధించిన ప్రతి విజయం వెనక మన పాత్ర వున్నట్టు. మనం ఎదుర్కొన్న ప్రతి పరాజయం వెనుక మన పాత్ర వుంటుంది.
Food & Poison
ఒకరి ఆహారం మరొకరికి విషం కావచ్చు. ఒకరి విషం మరొకరికి ఆహారం కావచ్చు.
vice versa
ప్రపంచంలో ప్రతీదీ తద్వెతిరేకంగానూ (the other way around, vice versa) వుంటుంది.
Marxism
ఆధునిక సమస్యలన్నింటి ప్రస్తావన మార్క్స్ రచనల్లో లేకపోవచ్చు. అయినప్పటికీ, ఆధునిక సమస్యలన్నింటినీ అర్ధం చేసుకోవడానికేకాక, వాటిని మార్చడానికి అవసరమైన పనిముట్లు కూడా మార్క్సిజంలో వున్నాయి. మనం వాటిని సమర్ధంగా వాడడం నేచుకోవాలి.
Human creativity
మనుషులు సృజనాత్మకంగా రెండు పనులు చేస్తారు. చేతనైతే తమను పోలిన ప్రపంచాన్ని సృష్టిస్తారు. అది చేతకాకపోతే, ప్రపంచమంతా తమలానే వుందనే భ్రమల్లో బతికేస్తారు.
Statues
ఎప్పుడైనాసరే ఓట్లు సమకూర్చిపెట్టే విగ్రహాలనే అధినేతలు గౌరవిస్తారు.
History
చరిత్రలేనివాళ్ళకు ఇతరుల చరిత్ర జీర్ణంకాదు.
Crime and Punishment
దొంగతనం జరిగినపుడెల్లా వాడుకగా రెండు సూచనలు ముందుకు వస్తుంటాయి.మొదటిది, దొంగను కఠినంగా శిక్షించాలనీ. రెండోది, ఇళ్ళకు పెద్ద తాళంకప్పలు వేసుకొవాలనీ. ఈ రెండు సూచనలు ఇవ్వడానికి మనుషులకు మెదడు అనే పదార్ధం లేకపోయినా ఫరవాలేదు.
Being
సృష్టిలో అయినా, సమాజంలో అయినా ఏదీ ఊరికే ఉనికిలోకిరాదు. ఏదీ ఊరికే పోదు. ఒక అంశం పుట్టుకకుగల కారణాలను రూపమాపకుండా, దాన్ని ఎన్నటికీ రూపమాపలేం.
Best & Most Terrible
Seasons of Life
Friday, December 23,
2011
యక్ష : జీవితంలో అన్నింటికన్నా గొప్ప రుతువేదీ?
యుధిష్ఠిర: మన శత్రువులు కూడా మన వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే కాలం.
యక్ష : జీవితంలో అన్నింటికన్నా బాధాకర రుతువేదీ?
యుధిష్ఠిర: మన మిత్రులు కూడా మన శత్రువుల నాదస్వరాలకు నాట్యమాడే కాలం.
24 January 2013
Stupid people
ఎలాంటి
జాగ్రత్తలు తీసుకోకుండా మిత్రులతో మాట్లాడవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే
శత్రువులతో మాట్లాడవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూర్ఖులతో మాట్లాడలేము.
24 January 2013
Stupid
people
మూర్ఖులకు
అద్భుత శక్తి వుంటుంది. ఎంతటి గొప్పవాళ్లనైనా వాళ్ళు తమస్థాయికి
దిగజార్చేయగలరు.
24 January 2013
Beauty of life
జీవనశౌందర్యం
అంటే మరేదోకాదు అణగారినవాళ్ళు స్వేఛ్ఛా గాలులు పీల్చడానికి చేసే పెనుగులాట.
26 January 2013
Man and Private Property
మనుషులు
మనుషులుగా వున్నప్పుడు మనుషులుగానే వుండాలనుకుంటారు.
కానీ,
స్వంతాస్థి భావన మనుషులను ఎన్నడూ మనుషులుగా వుండనివ్వదు.
Private Property and
Selfishness
స్వంతాస్థి
భావన మనసుల్ని స్వార్ధంతోనో, నిర్వేదంతోనో నింపేస్తుంది.
మనుషుల్ని
స్వార్ధపరులుగానో, నిస్సహాయులుగానో మార్చేస్తుంది.
Man and Woman Relations
స్త్రీ-పురుష
సంబంధాల గురించి మనం మాట్లడేదంతా, సారాంశంలో,
ఆస్తిసంబంధాల గురించే.
Human Relations
నిజానికి
ఈనాడు మనం చూస్తున్న మానవ సంబంధాలన్నీ, సారాంశంలో ఆస్థి సంబంధాలే.
Human Relations
మనిషితప్ప, సృష్టిలో
ఏ జీవీ దుస్తులు ధరించదు. పారదర్శకంగావుంటుంది.
మనిషి
దుస్తులులేకుండా తిరగలేడు, భావోద్వేగాలు లేకుండా ఆలోచించలేడు
Nature , private
property and man
ప్రకృతి
నుండి మనిషి స్వంతాస్థిని సృష్ఠించాడు.
స్వంతాస్థి
మనిషి నుండి ఒక స్వార్ధపరుడ్ని సృష్ఠించింది.
Private property - Bane and Bliss
స్వంతాస్థి
మానవత్వానికి ఒక శాపం. విచిత్రం ఏమంటే,
స్వంతాస్థి కోసమే మనిషి జీవితాంతం తప్పస్సు చేస్తాడు.
Learned Person
జ్ఞానుల్ని
నాలుగుసార్లు కలవకండి
జ్ఞానుల్ని
మొదటిసారి కలిసినపుడు, వాళ్ల జ్ఞానం మీద గౌరవభావంతో మొక్కాలనిపిస్తుంది.
జ్ఞానుల్ని
రెండవసారి కలిసినపుడు, వాళ్ళ జ్ఞానాన్ని ఎలాగైనా తస్కరించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని
మూడవసారి కలిసినపుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానంతోనే వాళ్ళను అధిగమించాలనిపిస్తుంది
జ్ఞానుల్ని
నాలుగవసారి కలిసినపుడు, ఆత్మన్యూనతాభావంతో వాళ్లపై నైతిక దాడి చేయాలనిపిస్తుంది.
Women and private property
స్వంతాస్థి
లేకుంటే వారసత్వపు హక్కులు వుండవు.
వారసత్వపు
హక్కులు లేకుంటే స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పని వుండదు.
స్త్రీలు
పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పనిలేకుంటే వాళ్లమీద పురుషాధిపత్యం వుండదు.
పురుషాధిక్య
సమాజంలో విత్తనానికే హక్కులుంటాయి; భూమికి వుండవు.
Women and private property
స్వంతాస్థి
లేకుంటే వారసత్వపు హక్కులు వుండవు.
వారసత్వపు
హక్కులు లేకుంటే స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పని వుండదు.
స్త్రీలు
పాతివ్రత్యాన్ని పాటించాల్సిన పనిలేకుంటే వాళ్లమీద పురుషాధిపత్యం వుండదు.
పురుషాధిక్య
సమాజంలో విత్తనానికే హక్కులుంటాయి; భూమికి వుండవు.
Women’s Lib
స్త్రీల
విముక్తి పోరాటాలు స్వంతాస్థిని రద్దు చేయడం కోసం సాగాలి.
కానీ,
సాంస్కృతిక శేషదుష్ప్రభావం కారణంగా, తరచూ, తద్వేతిరేకంగా జరుగుతుంది.
ముందువాళ్ళు
పాతివ్రత్యాన్ని ప్రేమించి, తరువాత స్వంతాస్థిని ప్రేమించవచ్చు.
లేదా,
ముందు స్వంతాస్థిని ప్రేమించి, తరువాత పాతివ్రత్యాన్ని ప్రేమించవచ్చు.
Oppressed and
Private property
పీడితవర్గాల విముక్తి పోరాటాలు స్వంతాస్థిని రద్దు చేయడం కోసం
సాగాలి.
కానీ,
సాంస్కృతిక శేషదుష్ప్రభావం కారణంగా, తరచూ, తద్వేతిరేకంగా జరుగుతుంది.
ముందువాళ్ళు
ఆధిపత్యవిధానాలని ప్రేమించి, తరువాత స్వంతాస్థిని ప్రేమించవచ్చు.
లేదా,
ముందు స్వంతాస్థినే ప్రేమించి, తరువాత ఆధిపత్యవిధానాలని ప్రేమించవచ్చు.
ఈ
దుష్పరిణామాల్ని నివారించడానికి సమాజానికి ఎప్పుడూ ఒక అగ్రగామిదళం కావాలి.
Chaste and
Commercial sex
మనం
స్వంతాస్తిని పరిరక్షించుకున్నంత కాలం సమాజంలో దొంగలు వుంటారు.
పాతివ్రత్యం,
ఏకపత్నీవ్రతం వున్నంతకాలం సమాజంలో వేశ్యా వృత్తి, వివాహేతర సంబంధాలు వుంటాయి.
Plastic Money Generation
క్రెడిట్ కార్డ్ తరం
కష్టపడు, సంపాదించు, ఆస్వాదించు - పాతతరం
ఆస్వాదించు, చెల్లించు, కష్టపడు - కొత్తతరం
Weaker
Sections
బలహీనవర్గాలు పొలాల్లో పండిస్తారు, ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేస్తారు. ఉద్యమాల్లో తుపాకీగుళ్ళకు ఎదురెళతారు. విజయాల్లో పక్కకు నెట్టివేయబడతారు.
Ban on Literature
ఎప్పుడైనాసరే, కళాసాహిత్యాల నిషేధం అనేది కోరదగ్గ అంశంకాదు.
సాంస్కృతిక దాడిని సాంస్కృతిక దాడితోనే ఎదుర్కోవాలి.
వాదించే శక్తిలేనపుడు మనుషులు తిట్లు లంఘించుకుంటారు.
ప్రభుత్వాలు నల్లచట్టాలను రూపొందిస్తాయి
Rulers,
Ruled and Art
కళను కళగానే చూడాలనేది పాలకవర్గాల భావజాలం.
కళను సామాజికంగానే చూడాలనేది పాలితుల చారిత్రక అవసరం.
Comfort ability and individual
సౌకర్యవంతంగా బతకాలనే ఆలోచన వచ్చిన మరుక్షణమే మనిషి చనిపోతాడు.
Modernsociety and comforts
సౌకర్యాలను సాధించడమే మనిషి సామర్ధ్యానికి అంతిమ కొలమానంగా ఆధునిక సమాజం మార్చేస్తుంది.
Modern
Society and Human relations
ఆధునిక సమాజం అనేది ఒక భ్రమ. అందులో మానవ సంబంధాలు వుండవు. వుండేదల్లా మానవ వినాశనమే.
Parents,
Children and comfortism
పిల్లలు సౌకర్యంగా జీవించాలని తల్లిదండ్రులు తమ సౌకర్యాలను ఫణంగా పెడతారు. సౌకర్యాలు ఒక సంస్కృతిగా మారగానే పిల్లలు మొదట మోసంచేసేది తలిదండ్రులనే.
Parents
and children
మన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ సర్వస్వాన్ని ఫణంగా పెడతారు. మనం మన సౌకర్యాల్లో ఆచితూచి కొంత భాగాన్ని మాత్రమే వాళ్లకు ఇస్తాము.
Parents,
children and Parents
మన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ సర్వస్వాన్ని ఫణంగా పెడతారు. మనమూ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తాము. ఇందులో మర్మం ఏమంటే, మన పిల్లలకు మన సర్వస్వాన్ని ఫణంగా పెట్టే క్రమంలో మనం మన తల్లిదండ్రులకు అన్యాయం చేస్తాము.
Selfishness
స్వార్ధానికి కొనసాగింపే మోసం.
Individual
and family
మన ఆలోచనలు కుటుంబం చుట్టూ తిరుగుతాయన్నది ఒక భ్రమ. మన ఆలోచనలు మన చుట్టే తిరుగుతాయి.
Modernsociety
and invidual
ఆధునిక సమాజంలో వ్యక్తి మాత్రమే వుంటాడు. సమూహం వుండదు. మనిషి సమూహం నుండి ఒంటరి అవుతాడు.
Social
group and individual
సమూహం లేకుండా మనిషి బతకలేడు. కానీ, సమూహాన్ని అధిగమించి మనిషి ఎదగాలనుకుంటాడు. అదే ఆధునిక జీవితంలో వైవిధ్యం.
Betrayals
of parents
మనమంతా తల్లిదండ్రుల ద్రోహులం.
Society and individual
సమాజానికి భిన్నంగా వుండేవారూ కొందరు వుంటారు. అయితే, మనుషుల్ని తనకు భిన్నంగా సమాజం ఎన్నడూ వుండనివ్వదు.
Modern society and Parents
మనం మన తలిదండ్రుల్ని బాగా చూసుకోవాలనేది మన వ్యక్తిగత ఆలోచన. ఆధునిక సమాజ చలన శక్తులు దాన్ని ఒప్పుకోవు.
Everything for children
అసలు కిటుకంతా పిల్లలకు సర్వస్వం ధారపొయాలనేదానిలోనే వుంది. పిల్లలకు సర్వస్వం ధారపోసాక ఇంకేమీ మిగలదు కనుక అలాంటివాళ్ళు మిగిలినవారు ఎవరికీ ఏమీ ఇవ్వలేరు. ఆక్రమంలో మనుషులు తల్లిదండ్రుల్నేకాదు, తమనుతాము కూడా మోసం చేసుకుంటారు. దీన్ని నేరము-శిక్ష అనే అర్ధంలో చూడకూడదు. ఒక జీవన విధానంగా చూడాలి. ఇప్పుడుదాన్నే మార్చాలి.
Relativity between parents and children
Relativityతల్లిదండ్రులు, పిల్లలు అనేవి సాపేక్ష పదాలు. తల్లిదండ్రుల నుండి పిల్లలు పుట్టుకొచ్చినట్టే, పిల్లల నుండి తల్లిదండ్రులు పుట్టుకువస్తారు.
Three generations
ప్రతికుటుంబంలో మూడుతరాలు వుండాలి. పోషించినవాళ్ళు, పోషిస్తున్నవాళ్ళు, పోషించేవాళ్ళు. ఇదొక వృత్తం. తరాల స్థానాలు ప్రతి తరానికీ మారిపోతుంటాయి.
Three generations
కుటుంబం అంటే కనీసం మూడు తరాల సమిష్టి ఆర్ధిక సమూహం.
Family
and three generations
మూడుతరాలులేని జీవనవ్యవస్థని, కుటుంబం అనకూడదు.
కలిసి జీవించే వ్యక్తుల సంఖ్యనుబట్టి, వాటిని, ఇంగ్లీషులో, Nuclear, solo parent, Atomistic వగయిరా పేర్లతో పిలుస్తున్నారు.
Market and family
మార్కెట్ గురించి మాట్లాడకుండా కుటుంబం, సమాజం గురించి ఎంత మాట్లాడినా మనం సమస్యను కనీసంగా తడిమినట్టు కూడా కాదు. మనం ఇంటా బయట ఎదుర్కొంటున్న సంస్థాగత విషాదాలకు మూలం మార్కెట్టే!
Television
బయటికి వెళితే బూచాడు పట్టుకు పొతాడని పిల్లల్ని తలిదండ్రులు భయపెట్టేవాళ్ళు. ఇది యాభై యేళ్లక్రితం నాటి సంగతి. ఇప్పుడు బూచాడిని ఇంట్లోకి తెచ్చి, అగ్రపీఠం మీద కూర్చోబెట్టి పిల్లల్ని అప్పచెపుతున్నారు తల్లిదండ్రులు.
Television
మన ఇళ్లల్లోకి చాలా విషయాలను ఉచితంగా తీసుకువస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికది మనల్ని పట్టుకుపోయి మార్కెట్ కు అప్పచెపుతుంది.
Market
మార్కెట్ ప్రవేశమూ, కుటుంబ వ్యవస్థ పతనం ప్రారంభమూ ఒక్కసారే మొదలవుతాయి.
Market
మార్కెట్ ప్రభావంతో, మనిషి పగలంతా సామాజిక జీవితానికి చిల్లులు పెటుతుంటాడు. సామాజిక సంబంధాలు పతనమైపోతున్నయని రాత్రంతా ఏడుస్తుంటాడు.
Market
మార్కెట్ మన జీవితాల్లోకి ఆనందాన్నీ, దుఖ్ఖాన్నీ నింపుతుంది. తియ్యటినీళ్ళు ఆవిరైపోయి, సముద్రపు నీరు ఉప్పగైపొయినట్టు ఆనందం ఆవిరైపొతుంది. దుఖ్ఖం స్థిరపడిపొతుంది.
Caretaking
మనల్ని విమర్శించాల్సినవాళ్ళు విమర్శించనపుడు మనల్ని మనమే విమర్శించుకుందాం.
మనల్ని పొగడాల్సినవాళ్ళు పొగడనప్పుడు మనల్ని మనమే పొగుడుకుందాం. అప్పుడు అతివిశ్వాసమూ తగ్గుతుంది. ఆత్మన్యూనతా తగ్గుతుంది; అపధ్ధర్మం
Crony Capitalism
క్రొనీ క్యాపిటలిజం కొద్ది మందిని రాత్రికిరాత్రే సహస్ర కోటీశ్వరుల్ని చేసేస్తుంది. మిగిలిన శతకోటి జనంలో వ్యామోహాన్ని పెంచి స్వీయవినాశనానికి దారితీస్తుంది.
Purchasing capacity
మారుతున్న తరాలు
1950
ల నాటి తరాల దగ్గర కొనడానికి శక్తీ వుండేదికాదు,
కొనుక్కోవడానికి బజార్లో సరుకులూ, వస్తువులు వుండేవికావు.
1970ల నాటి తరాలు అవసరాన్నిబట్టి, స్తోమతనుబట్టి
బజార్లో సరుకులు, వస్తువులు కొనేవారు.
2000
ల నాటి తరాలు అవసరం, స్తోమతలబట్టికాక బజార్లో అమ్ముతున్నారు
గాబట్టి సరుకులు, వస్తువులు కొంటున్నారు.
Three Seasons
మూడు
రుతువులు
బాల్యంలో మనిషి పని నేర్చుకుంటాడు, ఇతరులమీద ఆధారపడతాడు.
యవ్వనంలో మనిషి పనిచేస్తాడు, ఇతరులనీ పొషించగలుగుతాడు
వృధ్ధాప్యంలో మనిషి పనిచేయలేడు, ఇతరుల మీద ఆధార పడతాడు.
ఇపుడే మీ బ్లాగ్ చూసాను
ReplyDeleteకోట్స్ బావున్నాయి.అభినందనలు