నిర్బయ
/ జ్యోతిసింగ్ బిల్లు - నోట్స్
సామూహిక అత్యాచార మృతురాలు ' నిర్భయ ' కేసు అనేక మౌలిక అంశాలను చర్చావేదిక మీదికి తెచ్చింది. మనం ముసుగుల్ని
తొలగించుకుని, భేషజాల్ని వదిలుకునికొన్ని విషయాలను మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది.
ఆహారం, నిద్ర, మైధూనాలు జీవ ధర్మాలు. ఈ ధర్మాలని పాటించకుండా సృష్టిలొ ఏ జీవీ
కూడా మన జాలదు. "కూడూ, గుడ్డ, నీడ (రోటీ, కపడా,
మకాన్)" అనేది సౌలభ్యం కోసం కొందరు "మర్యాదస్తులు " ముందుకు తెచ్చిన నినాదం.
గుడ్డ, నీడ లేకపొయినా మనుషుల జీవిక కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు మన సమీప
అడావుల్లో సహితం గుడ్డ, నీడ లేకుండానే లక్షల మంది జీవించేవారు. 1980వ దశకంలో కూడా, విజయనగరం-
సుంకి-జైపూర్ బస్సు మార్గంలో రోడ్డుకు దూరంగా అనేక చోట్ల ఒంటి మీద ఏమాత్రం ఆఛ్ఛాదన
లేని ఆదివాసులు కనిపించేవారు. అండమాన్ వంటి దీవుల్లొ అయితే సరేసరి.అయితే, వాళ్ళు
ఆహారంతోపాటూ, నిద్రా, మైధూనాలని కూడా ఆస్వాదించేవారు. నాగరీక సమాజం మాత్రం విధిగా
పాటించాల్సిన వాటిని అవకాశాన్నిబట్టిగా మార్చేసింది.ఈనాటి అనేక సామాజిక
వైపరీత్యాలకు ఇది కూడా ఒక కారణం.
కూడూ, గుడ్డ, నీడ నినాదం హొరులో మనుషుల మౌలిక జీవధర్మాలకు ఘోర అన్యాయం
జరిగింది. నిద్రా, మైధూనాలను నిర్లక్ష్యం చేశారు. ఆ రెండు విషయల్లో ఎవరి తంటాలను
వాళ్లను పడమన్నారు. నిద్ర విషయంలో నైతిక విలువలు మాత్రమె వున్నాయిగానీ, మైధూనాన్ని
నియంత్రించడానికి అనేక చట్టాలున్నాయి. నిద్రకు జరుగుతున్న నిర్లక్ష్యం గురించీ,
తద్వారా సమాజంలో తలెత్తుతున్న కొత్త వైపరీత్యాల గురించీ చెప్పాల్సింది చాలా
వున్నా, ప్రస్తుత చర్చనీయాంశం మైధూనమే.
సామాజిక సంక్షేమంలో భాగంగా ప్రభుత్వాలు అనెక పథకాలు చెపడుతూ వుంటాయి. తిండి
లేనివాళ్ళకోసం చౌక / ఉచిత బియ్యం, బట్టలులేని వాళ్లకోసం జనతా వస్త్రాలు,
ఇళ్ళులేనివాళ్ళకోసం ఇందిరా ఇళ్ళు పథకాలున్నాయి.
నిద్ర, మైధూనాలు అందుబాటులో లేనివాళ్ళకు వాటిని కల్పించడానికి ఏమైనా
పథకాలున్నాయా? అనే ప్రశ్న విడ్డూరంగా వుండవచ్చుకానీ, చాలామందికి ఇది ఇప్పుడు
జీవన్మరణ సమస్య.
భారదేశంలో
యుక్తవయస్సు ఎంత?
నిర్భయ
సంఘటన తరువాత యుక్తవయస్సును తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం వుందని వార్తలు
వస్తున్నాయి. అంటే, యుక్త వయస్సుని 18 నుండి 15 కు తగ్గించవచ్చు.
యుక్త
వయస్సు వేరు, అభిప్రాయాలు చెప్పే వయస్సు వేరు, ఓటింగు హక్కు వచ్చే వయస్సువేరు,
పెళ్ళి వయస్సు వేరు.
అసలు
సమస్య అదికాదు. 120 కోట్ల దేశ జనాభాలో
యుక్త వయస్సు దాటిన వాళ్ల జనాభా శాతం ఎంత?.
వాళ్లలో
చట్టబధ్ధంగా మైధూనాన్ని పొందుతున్న వారి శాతం ఎంత?
మిగిలినవాళ్ళు
మైధూనాన్ని ఎలా పొందుతున్నారూ?
ఆ
మిగిలిన వాళ్ళు
మైధూనాలు
లేకుండా ఉంటారని మనం నమ్ముతున్నామా?
మైధూనాలు
లేకుండా ఉండాలని కోరుకుంటున్నామా?
మైధూనాల్లో
పాల్గొనరాదని శాసిస్తున్నామా?
సృష్టిలో
ఏ జీవి అయినా ప్రాధమికంగా మూడు పనులు చేస్తుంది. ముందు తన జీవికను కాపాడుకుంటుంది.
తరువాత తన సంతతిని సృష్టిస్తుంది. తన సంతతిని కాపాడడానికి ఆహారాన్ని సేకరించి
పెడుతుంది.
సమస్త
జీవుల్లాగే, మనిషి కూడా ఈ మూడు పనులూ చేస్తాడు. అయితే అతను ఈ మూడు పనులతో పాటూ
ఇంకో పని కూడా చేస్తాడు. తన సంతతిని కొనసాగించడానికి భౌతిక ఉత్పత్తి కూడా
చేస్తాడు. దానికోసం కొన్ని పనిముట్లను కూడా సృష్టిస్తాడు. మ్యాన్ ఈజ్ ఏ టూల్
మేకింగ్ యానిమల్. అదే అతని ప్రత్యేకత. అదే
అతన్ని బలహీనత.
భౌతిక
ఉత్పత్తి చేసే క్రమంలో కొందరు మనుషులు కొందరికి బానిసలుగా మారిపొతారు. బానిసలుగా
మారిన మనుషులు నిద్రా, మైధూనాల వంటి ప్రాధమిక ధర్మాలను కొల్పోతారు.
SELECTION OF SEX PARTNER
సెక్స్
విషయంలో మనం పొంతనలేని రెండు తప్పులు చేస్తున్నాం. మొదటిది, విపరీతమైన
భావోద్వేగాలతొ దాన్ని కప్పి పెట్టేస్తున్నాం. లేదా చాలా తేలిగ్గా బజార్లో దోరికే
సరుకుగా భావిస్తున్నాం.
గొడ్లకు
ఏ దొడ్లో గడ్దయినా ఒక్కటే. మనుషులకు అలా కుదరదు. ఎంపిక ప్రమాణాలు కొన్నుంటాయి.
మైధూనం భాగస్వాముల్ని ఎంచుకొవడంలో జంతువులు కూడా ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తాయట.
మనుషులు మైధూనం భాగస్వాముల్ని ఎంచుకునే
ప్రక్రియ చాలా సంక్లిష్టంగా వుంటుంది. అందులో కేవలం శారీరక ధర్మం మాత్రమేకాక,
మానసిక ఉద్వేగాలు, సాంస్కృతిక విలువలు, ఆర్ధిక నియమాలు, కాలానుగుణంగా వచ్చిన
చట్టాలు, సౌందర్య దృష్టి, అన్నీ
కలగలిసివుంటాయి. అందుబాటులోవున్న చంద్రముఖిని పక్కనపెట్టి, దూరమైపొయిన పార్వతిని
తలుచుకుని తపించే దేవదాసు మనకు తెలుసు.
ఏదో
ఒక వైపరీత్యం జరిగినప్పుడు మాత్రమే మనం మైధునం గురించి మాట్లాడుతున్నాం.
అప్పుడు
కూడా ఒక కొవ్వొత్తి వెలిగించి, తోచిన ఒక తీర్పు ప్రకటించి, తప్పుకుంటున్నాం.
ప్రభుత్వాలకు
కూడా ఇది సౌకర్యంగానే వుంటుంది. అధికారంలోవున్నవాళ్ళు చట్టానికి కొన్ని మాట్లు
వేస్తారు. అధికారంలో లేనివాళ్ళు తమకు అధికారాన్ని ఇస్తే కొన్ని కొత్తచట్టాలు
తెస్తామంటారు. ఇది ఒక నిరంతర పువరావృత నాటకం.
పనిహక్కు,
చదువు హక్కు, సమాచారహక్కు వగయిరాలన్నీ బక్వాస్. ఇప్పుడు మైధునం హక్కు గురించి
మాట్లాడాలి. అప్పుడు దాని విధివిధానాలు ముందుకు వస్తాయి.
Frustration
ఒకే
space లో, ఒకే TIME లో రెండు objects ప్రవేసిస్తే, జరిగే చర్యను భౌతికశాస్త్రంలో
accident అంటారు. accident జరిగాక ఆ రెండు objects ల కక్ష్యలు కూడా గతి తప్పుతాయి.
ఒకే
వ్యక్తి, ఓకే సమయంలో రెండు పనులు చేస్తే Stress, strain, pressure, anxiety, tension, trauma పెరుగుతాయి. దానితో, ఆ వ్యక్తి ఆలోచన సరళి గతితప్పి
Frustration కు దారితీస్తుంది. Frustration కు గురైన వ్యక్తి రెండు పనులు కాదుకదా ఒక్కపని కూడా చేయలేడు.
దొంగతనం జరిగినపుడెల్లా వాడుకగా రెండు సూచనలు ముందుకు వస్తుంటాయి.
మొదటిది,
దొంగను కఠినంగా శిక్షించాలనీ. రెండోది, ఇళ్ళకు పెద్ద తాళంకప్పలు వేసుకొవాలనీ.
ఈ
రెండు సూచనలు ఇవ్వడానికి మనుషులకు మెదడు అనే పదార్ధం లేకపోయినా ఫరవాలేదు.
సృష్టిలో
అయినా, సమాజంలో అయినా ఏదీ ఊరికే ఉనికిలోకిరాదు. ఏదీ ఊరికే పోదు.
ఒక
అంశం పుట్టుకకుగల కారణాలను రూపమాపకుండా, దాన్ని ఎన్నటికీ రూపమాపలేం.
ప్రతి
జీవీ గుంపుగానే బతుకుతుంది. మనిషి గుంపుగానేకాక, సమాజంగానూ జీవిస్తాడు. సమాజం
అనేది మనిషికి మాత్రమే ప్రత్యేక లక్షణం. పందుల గుంపు, ఎలుకల మంద వున్నట్టు, మనుషుల
గుంపు, మనుషుల మంద కూడా వుంటాయి. వీటికి భిన్నంగా, మనుషుల సమాజం కూడా వుంటుంది.
పులి
అడవిలోవున్నా, మనుషుల మధ్య వున్నా గుంపు స్వభావంతో ఒక్కలాగే ప్రవర్తిస్తుంది.
మనిషి అలాకాదు. మనిషి సమాజంలో పెరిగితే సామాజికుడిగానూ, అడవిలో పెరిగితే గుంపు
స్వభావంతోనూ ప్రవర్తిస్తాడు. టార్జన్, జింబోలు శరీరధర్మాలరీత్యా మానవజీవులు (Biological men) మాత్రమే తప్ప, సామాజిక
జీవులు (Social men)మాత్రం
కాదు.సామాజిక మనిషి సమాజంలో మాత్రమే పెరగాలి.
గుంపులో
చేరడానికి ఎవ్వరికీ ఎలాంటి అర్హతలూ అఖ్ఖరలేదు. కేవలం సహజాత ప్రవృత్తితో గుంపు /
మంద బతికేస్తుంది. కానీ, సమాజసభ్యుడు కావడానికి కనీసం 18 సంవత్సరాల ప్రత్యేక పెంపకం (nurture) కావాలి. ఈ పెంపకాన్ని
పూర్తిచేయనివాళ్ళు సమాజ సభ్యులుకారు. సమాజం ఎర్పరుచుకున్న నీతి, నియమాలు, స్మృతి
తదితరాలతో సమాజ సభ్యులుకానివారిని శిక్షించడం కుదరదు. నేరం కూడా. 18 సంవత్సరాల పెంకాన్ని పూర్తి
చేయని పిల్లలు సమాజ సభ్యులుకారు. వినడానికి వింతగా ఉండొచ్చుగానీ, తార్కికంగా
పిల్లలు ఇతర జీవులతో సమానం. అందుకే పిల్లల్ని శిక్షించకూడదనే విలువ ముందుకు
వచ్చింది.
ఇంతకీ
ఈ సాకటం అంటే ఏమిటీ?
సాకడం
/ పెంపకం
nurture
నిత్యజీవితంలో
మనిషి ప్రవర్తన మూడు స్థాయిల్లో వుంటుంది. తనసాటివాళ్ళతో సమానంగా, తనకన్నా
పెద్దలతో చిన్నవాడిగా, తనకన్నా చిన్నవాళ్ళతో పెద్దరికంగా మనిషి ప్రవర్తిస్తాడు.
సామాజిక సంబంధాలకు సంబంధించి ఇది తొలి
అవగాహన మాత్రమే.
ఒక
పురుషుడికి ఓక డజనుమంది మహిళలు ఏదురైతే వాళ్ళందరూ అతనిని సమానం కాదు. వాళ్ళలో అతని
తల్లి, చెల్లి, అక్క, వదిన, పెద్దమ్మ, పిన్ని, అత్త, మరదలు, భార్య, మేనకోడలు, అమ్మమ్మ, నాయనమ్మ, వగయిరాలు వుంటారు.
అదే
ఓక డజను పురుషులకు, మరో డజను మహీళలు ఏదురయితే? వాళ్ళ మధ్య బంధుత్వాలు Permutations and
Combinations 144 వరకు వుంటాయి.
అయితే
సమాజంలో కేవలం బంధుత్వాలు మాత్రమే వుండవు. అనేకానేక ఇతర సంబంధాలు కూడా వుంటాయి. ప్రేయసి, స్నేహితురాలు, శతృవు, యజమాని, పనివాడు, గురువు,
శిష్యుడు వగయిరా వగయిరా.
మానవసంబంధాల
సంక్లిష్టత అంతటితో ఆగదు. ఒక్కో నిర్దిష్ట సంబంధానికి కొన్ని నిర్ధిష్ట Dos and Donts వుంటాయి. సాలెగూడు వంటి ఈ మానవ సంబంధాలని
అర్ధం చేసుకోవడానికి ప్రతి మనిషికీ కనీసం 18 సంవత్సరాల శిక్షణ అవసరం అవుతుంది.
ఈ శిక్షణ పూర్తయిన తరువాతే పిల్లలు సభ్యసమాజంలో చేరడానికి అర్హులు (యుక్తము) అవుతారు.
ఈ
పధ్ధెనిమిదేళ్ళ శిక్షణలో, తొలి ఆరేళ్ళు ప్రత్యక్షంగా తల్లి పర్యవేక్షణలోనూ, చివరి రెండేళ్ళు అనుభవజ్ఞుల
పర్యవేక్షణలోనూ వుండడం మేలని నిపుణులు అంటారు. యుక్త వయస్సు రావడానికిముందు ప్రత్యేక
గురుకులాల్లో, ప్రత్యేక శిక్షణ పొందే సాంప్రదాయమం కొన్ని జానపద కథల్లో, ’ఏడుతరాలు’
వంటి నవలల్లో కూడా కనిపిస్తుంది.
పిల్లల్ని
సాకడంలో సాహిత్యం, కళలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
ఆధునిక
జీవనశైలి పిల్లల పెంపకాన్ని విపరీతంగా నిర్లక్ష్యం చెస్తోంది.
24 యేళ్ళకే అమేరికాలో MS పూర్తిచేయించాలనే ఆతృతలో పిల్లల్ని మూడేళ్ళకే LKG లో పడేస్తున్నారు. దానికి ముందు బేబి సిట్టర్స్, ప్లేస్కూల్స్ కూడ వచ్చాయి. ఇక
తల్లులు పిల్లల్ని సాకె దేప్పుడూ?
స్థితిమంతులైన
తల్లులు సౌలభ్యాలు ఎక్కువ కావడంతో పిల్లల పెంపకాన్ని
ఇతర agenciesకు
బదిలీ చేసేస్తున్నారు. స్థితిలేని తల్లులు, సౌలభ్యాలు లేకపొవడంతో పిల్లల పెంపకాన్ని
పర్యవేక్షించలేకపోతున్నారు. రెండు సందర్భాల్లోనూ పిల్లలకు తల్లుల పెంపకం మాత్రం దక్కడంలేదు.
మరి
పిల్లల్ని పెంచుతున్నదెవరూ? మూర్ఖులైన వార్డెన్లు, శిక్షణలేని ఆయాలు. ఆ తరువాత, సినిమాలు,
టీవీలు, వీడియో గేమ్స్ వగయిరాలు. ఒక్కమాటలొ చేప్పాలంటే మన సమాజం ఇప్పుడు వీడియో గేమ్స్
లా సాగుతోంది.
Crèche వచ్చాక మనం పూర్తిగా మన పిల్లల్ని
crushers కు వదిలివేశాము.
సామాజిక
సంబంధాల్లో అంతస్థుల దొంతరల్ని నిర్ణయించేది కేవలం వయస్సు, బంధుత్వాలు
మాత్రమేకాదు. కులం, మతం, వర్ణం, లింగం,
సంపద, అధికారం, జ్ఞానం, విజ్ఞానం, సంస్కృతి, కళ, భాష మొదలైనవన్నీ ఇందులో
ప్రభావం చూపుతాయి.
William
Fielding Ogburn, Meyer Francis Nimkoff,
P. S. J. Gisbert, Melvin M. Tumin, George Andrew Lundberg, Raymond W.
Murry వంటివాళ్ళు social stratification మీద అనేక పరిశోధనా వ్యాసాలు
రాసారు.
నిర్భయా కేసు - ఉరి శిక్ష
కంటికి కన్ను పంటికి పన్ను బాగానే ఉంది. అందరూ పొలీసులు పేర్కొన్న నిందితులనే నిందిస్తున్నారు. పొలీసులు నిందితులు కారా? హోం మినిస్టర్స్ నిందితులు కారా? అధికారులు నిందితులు కారా? వాళ్ళ మీద కంటికి కన్ను పంటికి పన్ను అమలు చేద్దామా?
శిక్షలు కఠినంగా వుంటే నేరాలు తగ్గుతాయని ఎవరు చెప్పారూ? నిర్భయ కేసులో ఢిల్లీలో అంత గొడవ జరుగుతుండగానే అరడజను కేసులు బయటపడ్డాయి. ఉరి శిక్ష అమల్లో వున్న దేశాల్లో నేరాలు జరగవా?
SELECTION OF SEX PARTNER
సెక్స్ విషయంలో మనం పొంతనలేని రెండు తప్పులు చేస్తున్నాం. మొదటిది, విపరీతమైన భావోద్వేగాలతొ దాన్ని కప్పి పెట్టేస్తున్నాం. లేదా చాలా తేలిగ్గా బజార్లో దోరికే సరుకుగా భావిస్తున్నాం.
గొడ్లకు ఏ దొడ్లో గడ్దయినా ఒక్కటే. మనుషులకు అలా కుదరదు. ఎంపిక ప్రమాణాలు కొన్నుంటాయి. మైధూనం భాగస్వాముల్ని ఎంచుకొవడంలో జంతువులు కూడా ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తాయట. మనుషులు మైధూనం భాగస్వాముల్ని ఎంచుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా వుంటుంది. అందులో కేవలం శారీరక ధర్మం మాత్రమేకాక, మానసిక ఉద్వేగాలు, సాంస్కృతిక విలువలు, ఆర్ధిక నియమాలు, కాలానుగుణంగా వచ్చిన చట్టాలు, అన్నీ కలగలిసివుంటాయి. అందుబాటులోవున్న చంద్రముఖిని పక్కనపెట్టి, దూరమైపొయిన పార్వతిని తలుచుకుని తపించే దేవదాసు మనకు తెలుసు
నిర్భయా కేసు - ఉరి శిక్ష
కంటికి కన్ను పంటికి పన్ను బాగానే ఉంది. అందరూ పొలీసులు పేర్కొన్న నిందితులనే నిందిస్తున్నారు. పొలీసులు నిందితులు కారా? హోం మినిస్టర్స్ నిందితులు కారా? అధికారులు నిందితులు కారా? వాళ్ళ మీద కంటికి కన్ను పంటికి పన్ను అమలు చేద్దామా?
శిక్షలు కఠినంగా వుంటే నేరాలు తగ్గుతాయని ఎవరు చెప్పారూ? నిర్భయ కేసులో ఢిల్లీలో అంత గొడవ జరుగుతుండగానే అరడజను కేసులు బయటపడ్డాయి. ఉరి శిక్ష అమల్లో వున్న దేశాల్లో నేరాలు జరగవా?
SELECTION OF SEX PARTNER
సెక్స్ విషయంలో మనం పొంతనలేని రెండు తప్పులు చేస్తున్నాం. మొదటిది, విపరీతమైన భావోద్వేగాలతొ దాన్ని కప్పి పెట్టేస్తున్నాం. లేదా చాలా తేలిగ్గా బజార్లో దోరికే సరుకుగా భావిస్తున్నాం.
గొడ్లకు ఏ దొడ్లో గడ్దయినా ఒక్కటే. మనుషులకు అలా కుదరదు. ఎంపిక ప్రమాణాలు కొన్నుంటాయి. మైధూనం భాగస్వాముల్ని ఎంచుకొవడంలో జంతువులు కూడా ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తాయట. మనుషులు మైధూనం భాగస్వాముల్ని ఎంచుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా వుంటుంది. అందులో కేవలం శారీరక ధర్మం మాత్రమేకాక, మానసిక ఉద్వేగాలు, సాంస్కృతిక విలువలు, ఆర్ధిక నియమాలు, కాలానుగుణంగా వచ్చిన చట్టాలు, అన్నీ కలగలిసివుంటాయి. అందుబాటులోవున్న చంద్రముఖిని పక్కనపెట్టి, దూరమైపొయిన పార్వతిని తలుచుకుని తపించే దేవదాసు మనకు తెలుసు
No comments:
Post a Comment