వంటింటి రసాయనాలు
వంటగది ఒక రసాయనశాల, ఒక మందుల అంగడి. వంటవాళ్ళు ఫార్మసిస్టులు.
ఒకరికి ఇవ్వాల్సిన మందులు ఇంకొకరికి ఇస్తే ప్రమాదం సంభవిస్తుంది.
బ్లడ్ గ్లూకోజ్ 400 mg/dl వున్నవాడికి ప్రేమతో పాయసం ఇస్తే ఏమవుతుందీ?
పేగుల్లో అల్సర్ వున్నవాళ్ళకు రోజూ ఇష్టంగా చింతపండు వంటకాలు పెడితే ఏమౌతుంది?
LDL కొలెస్ట్రాల్ 200 mg/dl కన్నా ఎక్కువ వున్నవాళ్లకు
రోజూ ఆప్యాయంగా వెన్నతో భోజనం పెడితే ఏమవుతుందీ?
ఇష్టమని పాలక్ పోటాటో కూర వడ్డిస్తే, తిన్న అరగంటకు చనిపోయారన్న వార్త ఎప్పుడైనా విన్నారా?
వైట్ బీన్స్, పాలక్, పొటాటోల్లో పొటాషియం ఎక్కువగా వుంటుంది.
పొటాషియం ఎక్కువయితే cardiac arrest అయ్యి, మనుషులు హఠాత్తుగా చనిపొతారు.
పొటాషియం తక్కువైనా మనుషులు pulse beats పెరిగి, V -tach (ventricular tachycardia) తో హఠాత్తుగా చనిపొతారు.
ఎంత ప్రేమతో వడ్డిస్తున్నామన్నది ముఖ్యం కాదు; ఏం వడ్డిస్తున్నాం?, ఎవరికి వడ్డిస్తున్నాం? అన్నదే ముఖ్యం.
మనం ఏదైనా తినడానికి ముందు అది ఆహారమో, విషమో నిర్ధారించుకోవాలి.
ఒకరి ఆహారం మరొకరికి విషం కావచ్చు. ఒకరి విషం మరొకరికి ఆహారం కావచ్చు.
ప్రపంచంలో ప్రతీదీ తద్వెతిరేకంగానూ (the other way around, vice versa) వుంటుంది.
No comments:
Post a Comment