DUAL STANDARDS
ప్రజలు ఎప్పుడు ఆగ్రహం ప్రదర్శించాలో, ఎప్పుడు సానుభూతి కురిపించాలో పాలకులు నిర్ణయించడం అణిచివేతల్లోకెల్ల అణిచివేత.
1984లో ఇందిరా గాంధి హత్యానంతరం ఢిల్లీలో శిక్కులమీద ఊచకోత సాగింది. అప్పుడు రేడియో, టీవీ ప్రభుత్వ ఆధీనంలో వున్నాయి. ఆ సందర్భంలో శిక్కుల ఊచ కోతను ప్రభుత్వ మీడియా దాచిపెట్టింది. సంయమనం పేరుతో ప్రింట్ మీడియా మౌనంగా ఉండిపోయింది. కానీ, ఇందిరాగాంధి హత్యకు విపరీతమయిన ప్రచారం కల్పించారు.
అప్పటికే ఎలక్ట్రానిక్స్ ప్రవక్తగా పేరు తెచ్చుకుంటున్న రాజీవ్ గాంధీ ఎలక్ట్రానిక్ మీడియాను ఆయుధంగా వాడారు. రేడియో, టీవీల పుణ్యాన దేశంలోని ప్రతి ఇంట్లో వారం రోజులపాటు శవం లేచినట్లే అయింది. ఎలక్ట్రానిక్ మీడియా అందుబాటులో లేనివాళ్ళ కోసం ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా ’హస్తాసుర’ భస్మాన్ని దేశంలోని గ్రామాలన్నింట్లో చల్లారు. 1985 లోక్‌సభఎన్నికల్లో వీటి ఫలితాలు ప్రస్పుటంగా కనిపించాయి. నెహ్రు, ఇందిరలకు కూడా రానన్ని సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి.
పాలకులు తమకు లాభిస్తుంది అనుకుంటే, నెత్తురోడుతున్న హతుల్ని, శవాల్ని, అంత్యక్రియల్ని చూపెడతారు. అలా చూడ్డంకుదరనివాళ్ళకు చితాభాస్మాలూ పంచిపెడతారు.
నిర్భయ అనే దామిని అలియాస్ అమానత్ కేసు ప్రభుత్వానికి వ్యతిరేకం కనుక ఈ సంఘటన వివరాలను నైతికత పేరుతో దాస్తున్నారు.
ఇవే ద్వంద్వ ప్రమాణాలు.
|
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Tuesday, 1 January 2013
DUAL STANDARDS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment