సంస్కృతి సంరక్షకుడు : జగదీశ్ మిట్టల్
ఇది
2004 నాటి సంగతి. హైదరాబాద్ దోమల్ గూడలో గగన్
మహల్ ఏడవ వీధిలో సి-టీవీ ఆఫీసు వుండేది. పదవ వీధిలోని శివా ప్యాలెస్ లో మా అప్పార్ట్ మెంట్ వుండేది. ఎనిమిదవ వీధి చివర
ఓ టీ టిఫెన్ సెంటర్ వుండేది. సి-టీవి ఎంప్లాయిస్
రోజుకు కనీసం రెండుసార్లయినా ఆ టీ సెంటరుకు
వెళ్ళేవాళ్ళు. నాతోపాటు నా భార్య అజిత
కూడ సీ-టీవీలో పనిచేసేది. మేమిద్దరం ఇంటికీ ఆఫీసుకు షాపింగ్ కు, మార్నింగ్ వాక్ కు
ఆ వీధుల్లో రోజుకు ఓ ఏడెనిమిది సార్లు తిరిగేవాళ్ళం.
ఆ టీ కొట్టు పక్కన ఒక గొప్ప ఆర్ట్ మ్యూజియం వుందని మాకు ఓ నాలుగేళ్ళ వరకు తెలీయలేదు.
ఓ
మాటల సందర్భంలో జగదీశ్ మిట్టల్, బద్రీ విశాల్ పిట్టి, బూర్గుల రామకృష్ణారావుల ప్రస్తావన
వచ్చింది. ప్రపంచం చాలా చిన్నది అన్నట్టు జగదీశ్
మిట్టల్ నివాసం మా వీధి చివరే వుందని తెలిసింది. ఆ తరువాత మిట్టల్ దంపతుల్ని చాలాసార్లు కలిశాను.
గొప్పవాళ్ళతో
మాట్లాడడం ఎప్పుడూ ఒక జ్ఞానమే. జగదీశ్ మిట్టల్ గారిని కలవడం అంటే చరిత్రను, కళా సాంప్రదాయాల్నీ
తెలుసుకోవడమే. తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యుల శిల్పకళారీతులు, చిత్రకళలో దక్కనీ
సాంప్రదాయం, కుతుబ్ షాహీలు, నిజాం ఆర్ట్, మొఘల్ ఆర్ట్, అరేబియన్ ఆర్ట్, కళల్లో అరేబియన్ నైట్స్ ప్రభావం, చైనీస్ డ్రాగన్
ప్రభావాల గురించి వారు మాట్లాడుతుంటే చరిత్ర గురించి మాట్లాడుతున్నట్టు వుండేది.
జగదీశ్
మిట్టల్ సమాజాన్ని పూర్తిగా పాజిటివ్ దృక్పథంతో
చూస్తారు. సమాజంలోని కులం చిత్రకళలో ప్రతిబింబిస్తుందని వారికి తెలుసు. ముఖ్యంగా, తెలంగాంణలో
ఒక కుగ్రామం అయిన చెరియాళ్ లో పుట్టిన స్క్రోల్ ఆర్ట్ లో కులం మరీ స్పష్టంగా కనిపిస్తుందని
వారే వివరించారు. అయితే, కళారంగంలో కులవ్యవస్థ
మీద శ్రామిక కులాల ధిక్కారం, తిరుగుబాట్లను వారు పట్టించుకోలేదు.
జగదీశ్
మిట్టల్ మీద చాలా మంది డాక్యుమెంటరీలు తీసే
ప్రయత్నం చేశారు. అదాయనకు ఇష్టం వుండేది కాదు.
డాక్యుమెంటరీ కోసం చాలా సమయాన్ని వెచ్చించాల్సి వుంటుందనీ, అంత తీరిక దొరికితే రెండు
పుస్తకాలు రాసుకోవచ్చనేవారు. వృత్తిలో భాగంగా
నేను కూడ వారి మీద ఒక డాక్యుమెంటరీ తీద్దామనుకున్నాను. నా డాక్యుమెంటరీ కోసం ప్రత్యేకంగా
సమయం కేటాయించనక్కరలేదనీ, నాతో మాట్లాడుతున్నప్పుడు షాట్స్ తీసుకుంటామని ఒప్పించాను..
దఫదఫాలుగా కొన్ని షాట్స్ తీశాము. స్క్రిప్టు
కూడ రాసుకున్నాను కానీ, ఆ ప్రాజెక్టు అలా ఆగిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకు పాత ఫైళ్ళకు
దుమ్ముదులిపి, 2008 నాటి స్క్రిప్టు ఆధారంగానే
అందుబాటులోవున్న వీడియో క్లిప్పుల ఆధారంగా ఈ వీడియోను సిధ్ధం చేశాను.
ఇక చూడండి.
గొప్ప కళాకారునికి స్వల్ప పరిచయం (GP)
1.
భారత దేశానికి చెందిన
అమూల్యమైన కళాఖండాలున్న మ్యూజియం ఒకటి హైదరాదాద్ లోనే వుందంటే చాలామందికి నమ్మబుధ్ధి
కాదు. కానీ ఇది నిజం.
2.
ప్రపంచంలో మరేచోటాలేనటువంటి
భారతీయ కళాకృతులు జగదీశ్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ లో వున్నాయి.
JKMMIA.
3.
భారతీయ చిత్రకళ మీద
అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు జరిగినప్పుడెల్లా సందర్శకులలో తరచూ వినిపించే పేరు జగదీశ్
మిట్టల్.
4.
హైదరాబాద్ లోని గగన్
మహల్ మెయిమ్ రోడ్ చివర ఎనిమిదవ వీధి దాటిన తరువాత ఓ అంతర్జాతీయ చిత్రకారుడు, ఓ అద్భుత
కళా అన్వేషకుడు అవున్నట్టు ఆ వీధిలో వున్నవారికి
కూడ తెలియదంటే అతిశయోక్తి కాదు.
5.
జగదీశ్ మిట్టల్ గురించి
తెలుగువారికి తెలిసింది చాలా తక్కువ; ప్రపంచానికి తెలిసింది చాలా ఎక్కువ.
6.
జగదీశ్ మిట్టల్ కమలా మిట్టల్ దంపతులు నెలకొల్పిన
ఆర్ట్ మ్యూజియంలో వందల కొత్తి కళాకృతులు వున్నాయి.
7.
క్రీస్తు పూర్వం మొదటి
శతాబ్దానికి చెందిన కళాకృతుల నుండి 19వ శతాబ్దపు చిత్రలేఖనాల వరకు అనేక కళాఖండాలు ఇక్కడ వున్నాయి.
8.
ఈ కళాఖండాలను దర్శించడానికి
వివిధ దేశాల నుండి ఎందరో కళాభిమానులు హైదరాబాద్ వస్తుంటారు.
9.
అలా వచ్చిన సందర్శకుల్లో
నోబెల్ బహుమతి గ్రహితలే 22 మంది వున్నారంటే ఈ మ్యూజియం గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు.
10.
జగదీశ్ మిట్టల్ జీవితం
(GP)
11.
జగదీశ్ మిట్టల్ పూర్వికులు
ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు.
12.
బులంద్ షహర్ జిల్లాలో
1925 సెప్టెంబరు 16న జగదీశ్ మిట్టల్ జన్మించారు. ఆయన తండ్రి శైంధీమల్ తల్లి హీరాదేవి.
13.
మూడుపదుల యవ్వనంలోనే జగదీశ్ మిట్టల్ తన మకాంను హైదరాబాద్
కు మార్చారు.
14.
స్వాతంత్ర్య సమరయోధుడు,
పారిశ్రామికవేత్త, కళాప్రియుడు అయిన బద్రీ విశాల్ పిట్టి ఆయనను తొలిసారిగా హైదరాబాద్
కు తీసుకుని వచ్చారు.
15.
బద్రీ విశాల్ పిట్టితోపాటు
అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, స్థానిక చిత్రకారులు, కళాభిమానులు తన మీద
చూపిన అభిమానానికి జగదీశ్ మిట్టల్ ముగ్దులైపోయారు.
16.
ఆ తరువాత వారు హైదరాబాద్ ను తన శాశ్విత చిరునామాగా మార్చుకున్నారు.
17.
హైదరాబాద్ వాతావరణమూ
బాగుంటుంది మనుషుల ప్రేమాభిమానాలు గొప్పగా వుంటాయి అంటారాయన.
18.
Sound Byte : Jagadish Mittal
19.
కుటుంబం (GP)
20.
జగదీశ్ ది ఒక విధంగా
కళాకారులు, ఇంజినీర్ల కుటుంబం. తండ్రి సివిల్ ఇంజినీర్ గోరక్ పూర్ జిల్లా కేంద్రంలో
కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత రక్షణ శాఖలో చేరి డెహ్రాడూన్ లో చాలా కాలం పనిచేశారు.
తల్లి హీరాబాయి తండ్రి కూడ ఇంజినీరే.
21.
జగదీశ్ తండ్రి సైందీమల్ కు ఐదుగురు సంతానం. నలుగురు
కొడుకులు ఒక కుమార్తె. కొడుకులు కైలాష్ చంద్, జగదీశ్ చంద్, హతీశ్ చంద్, రాజేశ్ చంద్.
వారిలో జగదీశ్ చంద్ మిట్టల్ రెండవవారు. ఆయన సోదరులు ముగ్గురూ ఇంజినీర్లు. పిడబ్ల్యూడి,
నీటి పారుదలా శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేశారు. జగదీశ్ చెల్లెలు కుసుమ్ లెక్చరర్
గా పని చేసి రిటైర్ అయ్యారు.
22.
శాంతినికేతన్ కళామార్గం పట్టించింది
23.
జగదీశ్ విద్యాభ్యాసం
బులంద్ షహర్, ముస్సోరీలలో సాగింది. హైస్కూల్ రోజుల్లోనే మంచి చిత్రకారుకిగా గుర్తింపు
తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనేక చోట్ల చిత్రలేఖనం పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు అందుకున్నారు.
24.
Sound Byte : Jagadish Mittal
25.
విఖ్యాత ల్యాండ్ స్కేప్
చిత్రకారుడు నందలాల్ బోస్, వినోద్ విహారీ ముఖర్జీలు అంటే జగదీశ్ మిట్టల్ కు వల్లమాలిన
అభిమానం.
26.
రబీంద్రనాధ్ టాగూర్
కు చెందిన శాంతి నికేతన్ లోని కళాభవన్ లో నందలాల్ బోస్ ప్రధాన అధ్యాపకునిగా వుండేవారు.
నందలాల్ బోస్ దగ్గర శిష్యరికం చేయాలనే కోరికతో తల్లిదండ్రుల్ని ఒప్పించి 1945లో శాంతినికేతన్
లో చేరారు జగదీశ్ మిట్టల్.
27.
ల్యాండ్ స్కేప్ చిత్రకళలో
చైనా వాళ్ళది ప్రపంచంలోనే విశిష్ట స్థానం. పశ్చిమ దేశాల ల్యాండ్ స్కేప్ చిత్రకారులు
ప్రకృతిని వున్నదున్నట్టు చిత్రిస్తారు. వాళ్ళ పేయింటింగ్ దాదాపు ఫొటోల్లా వుంటాయి.
చైనా శైలి వేరు. అందులో మనిషికీ ప్రకృతికి మధ్య విడదీయరాని ఒక అనుబంధాన్ని చిత్రిస్తారు.
భారతీయ చిత్రకళను చైనా సాంప్రదాయంతో మేళవించిన ఘనత నందలాల్ బోస్ కు దక్కుతుంది.
28.
Sound Byte : Jagadish Mittal
29.
గురువు నందలాల్ బోస్
అడుగుజాడల్లో జగదీశ్ మిట్టల్ కూడ చిత్రకళలో
చైనా సాంప్రదాయాన్ని అందిపుచ్చుకున్నారు.
30.
జగదీశ్ మిట్టల్ సృష్టించిన
పేయింటింగ్స్ హైదరాబాద్ లోని స్టేట్ మ్యూజియం,
సాలార్ జంగ్ మ్యూజియంలతోపాటు జాతీయ స్థాయిలోనే గాక విదేశాల్లోని మ్యూజియంలలోనూ ప్రదస్ర్శించారు.
31.
ల్యాండ్ స్కేప్ పేయింటింగ్
గొప్ప మానసిక ప్రశాంతతను ఇస్తుందంటారు జగదీశ్ మిట్టల్.
32.
Sound Byte : Jagadish Mittal.
33.
జీవిత భాగస్వామి
34.
శాంతి నికేతన్ లోనే
జగదీశ్ మిట్టల్ కు కమల పరిచయం అయ్యారు. కమల ముజఫర్ నగర్ జిల్లాలోని భూస్వామ్యకుటుంబానికి
చెందిన వారు.
35.
ఇద్దరూ చిత్రకారులు.
శాంతినికేతన్ లో ఫైన్ అర్ట్స్ లో పట్టభద్రులు. కళల మీద ప్రేమ వారిద్దరినీ ప్రేమికులుగా
మార్చింది. 1951లో కమల, జగదీశ్ మిట్టల్ పెళ్ళి చేసుకున్నారు.
36.
Sound Byte : Jagadish Mittal.
37.
కమల మిట్టల్
38.
కమల మిట్టల్ రచయిత్రి.
ఎంబ్రాయిడరీ రీతుల మీద ‘భారతీయ కసీదా’ ‘ The History of Indian Embroidery’ అనే గ్రంధాన్ని
రాశారు. దానికి జగదీశ్ మిట్టల్ ముందుమాట రాశారు.
39.
జగదీశ్ మిట్టల కళాప్రపంచం
చాలా విస్తారమైనది. 1959 నుండి దాదాపు 20 యేళ్ళు ఆయన సుప్రసిధ్ధ హిందీ పత్రిక ‘కల్పన’కు
ఆర్ట్ ఎడిటర్ గా వున్నారు. అనేక ప్రముఖ దిన, వార పత్రికల్లో ఆయన కళ్ళల మీద అనేక వ్యాసాలు
రాశారు.
40.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
1974లో ‘మిడియవల్ హిస్టరీ ఆఫ్ దక్కన్’ అనే ఓ బృహత్తర పుస్తకాన్ని ప్రచురించింది. అందులో ‘దక్కనీ పెయింటిగ్స్’
అనే అధ్యాయాన్ని జగదీశ్ మిట్టల్ రాశారు.
41.
రెండు దశాబ్దాల పాటు
చిత్రకారునిగా అందరి ప్రసంశలు అందుకున్న జగదీశ్ మిట్టల్ క్రమంగా కళాకృతుల సేకర్తగా
మారారు. భావితరాలు తమ జాతి చరిత్రను తెలుసుకోవడానికి కళాకృతుల్ని భద్రపరచాలని వారంటారు.
42.
ఒక చిత్రకారునిగా
ఎదగడం వ్యగత విజయం అవుతుందనే జగదీశ్ మిట్టల్, మానవ జాతి చరిత్రను కళాకృతుల రూపంలో భావితరాలకు
అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అవుతుందంటారు.
43.
Sound Byte : Jagadish Mittal.
44. జగదీశ్ మిట్టల్ –
కమలా మిట్టల్ - కళాసేవలో చెరో సగం (GP)
45.
జగదీశ్ మిట్టల్ కళాకృతుల
సేకర్తగా మారాక ఆయన జీవితంలో కమలా మిట్టల్ ప్రాధాన్యత పెరిగిపోయింది.
46.
శిధిలమైపోయిన చిత్రాల
మీద మరకల్ని తొలగించడంలోనూ, వాటికి కొత్త జీవితాన్ని అందించడంలోను కమల మిట్టల్ నిపుణులు.
గృహ జీవితంలోనే గాక, కళా సాహిత్య రంగాలలోనూ వాళ్ళిద్దరు భాగస్వాములుగానే కొనసాగుతున్నారు.
47.
Sound Byte : Kamala
Mittal.
48. 2 వేల కళాకృతులు
(GP)
49.
జగదీశ్ మిట్టల్ దాదాపు
రెండు వేల కళాకృతుల్ని సేకరించారు. తాము సేకరించిన కలాకృతులన్నింటి ఫొటోలు తీయించి, వాటి ప్రత్యేకతల్ని వివరిస్తూ ఒక గొప్ప గ్రంధాన్ని ప్రచురించారు. 2007లో వచ్చిన
ఈ గ్రంధం పేరు Sublime delight through works Art from Jagadish Mittal and Kamala
Mittal. కళా రంగంలో అదొక గొప్ప ఆవిష్కరణ.
50.
Sound Byte : Kamala
Mittal.
51.
కళా సాంస్కృతిక రంగాలకు
చెందిన ప్రతిష్టాత్మక సంస్థలన్నింటితోనూ జగదీశ్
మిట్టల్ కు ఒక అనుబంధం వుంది. న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్
కల్చరల్ హెరిటేజ్ కు ఆయన వ్యవస్థాపక సభ్యులు.
52.
తంజావూరులోని సౌత్
జోన్ కల్చరల్ సెంటర్ పాలక మండలిలోనూ ఆయన సభ్యులుగా వున్నారు.
53.
భారతదేశంలో హస్తకళలు, జానపద కళలు, లోహ కళలు తదితర
అంశాల మీద జగదీశ్ మిట్టల్ విస్తారమైన అధ్యయనం చేశారు. అనేక గ్రంధాలు రాశారు.
54.
1985లో అమెరికా పర్యటనకు
వెళ్ళినపుడు ఆ దేశపు మహానగరాలన్నింటిలోనూ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ అంశాల మీద కీలక ఉపన్యాసాలు
చేశారు. ఒక విధంగా భారతీయ కళా సాంప్రదాయానికి ఆయనొక బ్రాండ్ అంబాసిడర్ గా మారారంటే
అతిశయోక్తికాదు.
55.
జగదీశ్ మిట్టల్ కృషిని
ప్రశంసిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రముఖుల్లో
టాటా సంస్థల అధినేత రతన్ టాటా, ఇన్ఫోసిస్ అభినేత నారాయణమూర్తిలతో పాటు వివిధ దేశాల భారత రాయబారులున్నారు.
56. మన ప్రభుత్వాలకు కళా
దృష్టి తక్కువ (GP)
57.
మూడు దశాబ్దాలుగా
తాము సేకరించిన కళాఖండాలను భద్రపరచడం అంత సులువైన వ్యవహారం కాదు. కళాప్రేమికులు సందర్శించడానికి
వీలుగా హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద మ్యూజియంను నెలకొల్పాలనేది జగదీశ్ దంపతుల చిరకాల
కోరిక. దానికి జగదీశ్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం
ఆఫ్ ఇండియన్ ఆర్ట్ JKMMIA అనే పేరు కూడా సిధ్ధం చేసుకున్నారు.
58.
మన ప్రభుత్వాధినేతలకు
రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. కళా దృష్టి తక్కువ. కళాఖండాలకు ఒక మ్యూజియం ఉండాల్సిన అవసరాన్ని
ఏలినవారు గుర్తించలేదు.
59.
1993లో కోట్ల విజయభాస్కర
రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా కొంత కదలిక వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెం త్రీలో మ్యూజియం
నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలనే ఒక ప్రతిపాదన
కూడ ముందుకు వచ్చింది. అయితే, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడంతో ఆ కదలికలన్నీ
ఆగిపోయాయి.
60.
Sound
Byte : Kamala Mittal.
61.
ఆర్ట్ మ్యూజియం అనేది
పార్టీ వ్యవహారంకాదు. ఆ తరువాత అధికారంలోనికి వచ్చిన పార్టీలు కూడ మ్యూజీయానికి అవసరమైన
స్థలాన్ని కేటాయించవచ్చు గానీ అలా జరగలేదు.
62.
స్మగ్లర్ల బారిన పడకుండ కళాకృతుల్ని వృధ్ధ దంపతులు
పరిరక్షించడం దాదాపు అసాధ్యమైన విషయం. కళాకృతుల విలువ స్మగ్లర్లకు అర్ధం అయినంతగా ప్రభుత్వాలకు
అర్ధం కావడంలేదు. అదో విషాదం.
63. సంతతి (GP)
64.
జగదీశ్ మిట్టల్ ఒక
గొప్ప చిత్రకారుడు, కళా ప్రేమికుడు మాత్రమే కాదు నిజజీవితంలో అంతకు మించిన మహా మనిషి.
65.
మానవత్వం, సమానత్వం,
సామ్యవాదం, అణగారిన సమూహాల అభ్యున్నతి, శ్రామిక కులాల విముక్తి వగయిరాల గురించి చాలామంది
అనేక ధర్మోపన్యాసాలు ఇస్తుంటారు. అతి తక్కువ మంది మాత్రమే వాటిని పాటిస్తారు. కొందరైతే
అలాంటి ఉపన్యాసాలు ఇవ్వకుండానే వాటిని పాటిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో జగదీశ్
మిట్టల్ ఒకరు.
66.
మిట్టల్ దంపతులకు
1950లలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆనారోగ్య కారణాలతో ఆ పాప రెండేళ్ళ లోనే చనిపోయింది.
67.
అప్పట్లో బాలమ్మ అనే
ఆమె వాళ్ళ ఇంటి పనిమనిషిగా వుండేది. తమ పాప చనిపోయాక బాలమ్మ కూతుర్లు ఇద్దరిని మిట్టల్
దంపతులు చేరదీశారు.
68.
కొంతకాలానికి బాలమ్మ
అక్క మనమరాలు కూడా మిట్టల్ దంపతుల నాలుగవ కుమార్తెగా మారింది.
69.
ఆ ముగ్గుర్నీ జగదీష్
మిట్టల్ అధికారికంగా దత్తత తీసుకున్నారు. కేవలం పోషించడమేగాక పెద్ద చదువులు చదివించారు.
70.
జగదీశ్ మిట్టల్ ఉత్తరాది
వైశ్యులు, వారి కుమార్తెలు ముగ్గురూ దక్షనాది మాల సామాజికవర్గంలో పుట్టినవారు. సామాజికంగా
ఇదొక మహత్తర అంశం.
71.
తాను కులాలు వగయిరాలను
చూడలేదనీ, ఆ పిల్లల్ని ప్రేమించడం వల్లనే దత్తత తీసుకున్నాను అంటారు జగదీష్ మిట్టల్.
72.
Sound
Byte : Jagadish Mittal.
73.
పెద్దమ్మాయి జమునాదేవీ
మెడిసిన్ లో పిజి చేశారు.
74.
రెండో అమ్మాయి రాధారాణి
కామర్స్ లో పిజీ చేశారు.
75.
మూడో అమ్మాయి రమాదేవి ఆంథ్రోపాలజీలో డబల్ ఎంఏ చేశారు.
76.
పెద్దమ్మాయి జమునాదేవీ
గైనకాలజిస్టు. యశోదా హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు.
77.
రెండో అమ్మాయి, రాధారాణి
ఆంధ్రా బ్యాంకులో డిప్యూటి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.
78.
మూడో అమ్మాయి రమాదేవి
బిల్ అండ్ మిలింగా గేట్ స్వఛంద సంస్థలో పనిచేస్తున్నారు.
79. Sound Byte :
Jamuna Devi
80. Sound Byte :
Radharani
81. Sound Byte :
Ramadevi
82. వంశ వృక్షం (GP)
83. జగదీశ్ మిట్టల్ పెద్దమ్మాయి జమునాదేవీ డాక్టర్ గుడిదేవుని సూర్యనాథ్ ను పెళ్ళి చేసుకున్నారు.
డాక్టర్ సూర్యనాథ్ ప్రస్తుతం కేర్ హాస్పిటల్స్
లో మెడికల్ సర్జికల్ వింగ్ చీఫ్ గా వుంటున్నారు.
84. జగదీశ్ మిట్టల్ రెండో అమ్మాయి రాధారాణి భర్త మదన్ ప్రకాష్
వాణిజ్యరంగంలో స్థిరపడ్డారు.
85. జగదీశ్ మిట్టల్
మూడో అమ్మాయి రమాదేవు భర్త సచిన్ సిద్వేల డాక్యుమెంటరీ చిత్రాల ప్రముఖ నిర్మాత.
86. మూడవ తరం (GP)
87. జగదీశ్ మిట్టల్ పెద్దమ్మాయి డాక్టర్ జమునాదేవీకి ఒక కొడుకు
ఒక కూతురు.
88.
కూతురు అతిథి న్యూజిలాండ్
లో ఎంబిఏ చదివి యూఎస్ లో స్థిరపడ్డారు.
89.
జమునాదేవీ కొడుకు
అభిమన్యు కంప్యూటర్స్ ఇంజినీర్. న్యూజిలాండ్ లో వుంటున్నారు.
90. జగదీశ్ మిట్టల్ రెండవ అమ్మాయి రాధారాణికి ఇద్దరు కొడుకులు.
పెద్దబ్బాయి ఆదిత్య. రెండో అబ్బాయి అనిల్.
91. జగదీశ్ మిట్టల్ మూడవ అమ్మాయి ఏకైక సంతానం ప్రస్తుతం సెకండ్
స్టాండర్డ్ లో వున్నాడు.
92. వయసును లెఖ్ఖచేయని
పరిశోధనలు
93.
జగదీశ్ మిట్టల్ ఎనభయ్యవ
పడిలో స్క్రోల్ పేయింటింగ్ మీద ఎక్కువ పరిశోధనలు జరిపారు. ఇది అచ్చంగా తెలంగాణ కళ.
చెరియాళ్ గ్రామం దీని పుట్టినిల్లు.
94.
స్క్రోల్ పేయింటింగ్
లో రామాయణ గాధల్ని ఎక్కువగా చిత్రిస్తారు. వీటి మీద ‘ఆంధ్రా పేయింటింగ్స్ ఆఫ్ రామాయణ’
అనే గ్రంధాన్ని కూడ ఆయన రాశారు. ఆంధ్రప్రదేశ్ లలితకలా ఆకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
95.
మనం పద చిత్రాలు అనే
వాటినే పశ్చిమ దేశాల్లో scroll paintings అంటారు.
ఇప్పుడాయన దృష్టి తిరుపతి శైలి పేయింటింగ్స్ మీద పడింది.
96.
భారత సమాజంలో కులం
ఒక ప్రత్యేకత అయినట్టు భారత స్క్రోల్ పేయింటింగ్స్ కు కూడ ఒక ప్రత్యేక త వుంది. అందులో
కుల వృత్తుల్ని, కులాల్ని కూడ మనం గమనించవచ్చు.
97. అవార్డులు సన్మానాలు
98.
భారత ప్రభుత్వం
1990లో జగదీశ్ మిట్టల్ కు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, కలకత్తాల్లోనేగాక లండన్,
న్యూయార్క్ నన్ హట్టన్, ప్యారిస్ నగరాల్లోనూ
కలాప్రియులు జగదీశ్ మిట్టల్ ను సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. లండన్ లోని
విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియం, న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్
తదితర ప్రపంచ విఖ్యాత మ్యూజియంలలో ఆయన సన్మానాలు అందుకున్నారు.
99. ముక్తాయింపు.
100.
తను సేకరించిన కళాఖండాల ప్రదర్శనకు ఒక మ్యూజియంను
నిర్మించాలనేది జగదీశ్ మిట్టల్ జీవితకాల కోరిక. దానికోసం అవసరమైన స్థలాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం కేటాయిస్తుందని ఆశిద్దాం.
//EOM//
No comments:
Post a Comment