ఉద్యోగస్వామ్యంలో
వర్గవిభజన
డానీ
మొదటి
భాగం
1.
జీతభత్యాల
పెంపుదల మీద రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగులకు
మధ్య ఓ వివాదం నడుస్తోంది.
2.
ప్రభుత్వంతో
తలపడుతున్న ఉద్యోగులకు ప్రతిపక్షపార్టి సహజంగానే
మద్దతునిస్తుంది. అలా చాలామంది ఈ వివాదాన్ని వైసిపి, టిడిపిల రాజకీయ వ్యవహారంగా చూస్తున్నారు.
3.
కొన్ని ఉద్యోగ
సంఘాలు ఈ వివాదాన్ని న్యాయస్థానాల వరకు తీసుకుని వెళ్ళాయి. ప్రభుత్వాలకు ఉద్యోగుల జీతభత్యాలను
పెంచే అధికారమేతప్ప, తగ్గించే అధికారం వుండదని న్యాయస్థానాలు తేల్చి చెప్పేస్తే అదో కత.
4.
కొన్ని ఉద్యోగ
సంఘాలు – ముఖ్యంగా, ఉపాధ్యాయ సంఘాలు - ఉద్యమబాట పట్టాయి.
5.
ప్రభుత్వ
ఖజానాలో వెసులుబాటును బట్టి, ఉద్యోగ సంఘాల నాయకుల లాబీయింగ్ సామర్ధ్యాన్నిబట్టి, ప్రభుత్వ
పెద్దల ఇష్టాయిష్టాలను బట్టి, ఈ వివాదం త్వరలోనే ఏదో ఒక స్థాయిలో పరిష్కారం అవుతుంది.
6.
శాసన సభ్యులు,
మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి, గవర్నర్నర్, హైకోర్టు న్యాయమూర్తులతో
పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు, నిర్వహణ ఖర్చులు, అభివృధ్ధి ప్రాజెక్టులకు, ప్రజాసంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు మొదలయిన వాటన్నింటికీ మూలాధారం
ఒక్కటే; పన్నులు.
7.
పన్నుల ద్వార
సమకూరిన నిధుల్ని ప్రతి ప్రభుత్వం వివిధ విభాగాలకు తన ప్రాధాన్యతల్ని బట్టి పంపిణి చేస్తుంది.
8.
ప్రభుత్వం
నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో ప్రధానమైనది నిరుపేదలు, నిస్సహాయులు, అణగారిన సమూహాల
సంక్షేమం.
9.
పన్నుల సాంప్రదాయానికి చాలా పెద్ద చరిత్ర
వుంది. చాలా మంది వలస పాలన కాలంలో పన్నుల వ్యవస్థ పుట్టిందని భావిస్తారు.
మధ్యయుగాలకు ముందు కాలంలోనే పన్నుల వ్యవస్థవుంది. పన్నుల్ని ఎలా వసూలు చేయాలీ? ఎలా
ఖర్చు చేయాలీ? అనే విషయంలోనూ ప్రాచీన కాలం నుండే కొన్ని ఆదేశాలున్నాయి.
సూర్యుడూ భూమి నుండి తేమను
స్వీకరించి భారీ వర్షాలను కురిపించినట్టు, దిలీప మహారాజు ప్రజల నుండి పన్నుల్ని
వసూలు చేసి వారి కోసం అంతకన్నా ఎక్కువగా ఖర్చు చేసేవాడని
10.
‘రఘువంశం’లో
కాళిదాసు రాశాడు. ప్రజలకు నొప్పి కలగకుండ పన్నులు వసూలు చేయాలనీ, వాటిని ప్రజల
కోసం ఖర్చు చేయాలనీ, లేకుంటే అనర్ధాలు వస్తాయని మహాభారతం శాంతి పర్వంలో ధర్మరాజుకు
భీష్ముడు ఉపదేశిస్తాడు.
11.
పన్నుల ద్వార
వసూలయిన నిధుల్ని ఇతర విభాగాలకు నిష్పత్తికి
మించి కేటాయించేస్తే ప్రజా సంక్షేమం సంక్షోభంలో
పడిపోతుంది.
12.
పన్నుల్ని
భరించేదీ చెల్లించేది ప్రజలే కనుక ఈ వివాదాన్ని కేవలం ప్రభుత్వానికీ, ఉద్యోగులకు మధ్యన
సాగుతున్న ఘర్షణగా చూడకూడదు. దీన్ని విశాల ప్రజానీకానికి సంబంధించిన అంశంగా చూడాలి.
13.
ప్రభుత్వ
ఉద్యోగుల జీతభత్యాల్లోని హెచ్చుతగ్గులు సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్నది
సమాజానికి అవసరమైన ప్రశ్న అవుతుంది.
14.
ప్రజలకు
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యన వున్న ఐక్యత- ఘర్షణల గురించి చర్చించాల్సిన సమయం ఇది.
(ఇంకావుంది)
ఉద్యోగస్వామ్యంలో
వర్గవిభజన
డానీ
రెండవ
భాగం
15.
ప్రజాస్వామిక
వ్యవస్థకు శాసన, పరిపాలన, న్యాయ విభాగాలు మూడు అంగాలు. ఆధునిక పాలన వ్యవస్థలో ఇది అంగాంగి
సంబంధం.
16.
అంగాలు విడిగా
స్వతంత్రంగా కనిపిస్తాయిగానీ ఇవి అంగి లేకుండా స్వతంత్రంగా బతకలేవు. ప్రమాదంలో విరిగిపోయి
విడిపోయిన చెయ్యి ఇక పనిచేయదు. అలాగే అంగాలు లేకుండ అంగి కూడ తన కార్యక్రమాలను కొనసాగించలేదు.
అంచేత ఈ మూడింటిని ఒకే యూనిట్ గా చూడాలి. త్రికం.
17.
ఈ మూడు వ్యవస్థలు
ఒకటి మరొకదాన్ని అదుపుచేస్తున్నట్టుగా నటిస్తుంటాయి.
18.
కీలక సమయాల్లో
రాజ్యానికి సంబంధించిన ఈ మూడు విభాగాలు ఏకమైపోతాయి.
ప్రజాధనాన్ని పంచుకుని తినడంలో వీటి మధ్య ఏకాభిప్రాయం వుంటుంది.
19.
శాసన వ్యవస్థలో
వుండే విభాగాలే పరిపాలన వ్యవస్థల్లో వుంటాయి. ఆ మేరకు వీటి మధ్య ఐక్యత వుంటుంది. భిన్నమైన
విభాగాలు కనుక వాటి మధ్య చిన్న ఘర్షణ వున్నట్టు ఒక బహిరంగ నాటకం కొనసాగుతూ వుంటుంది.
20.
టీచర్లు
ఆందోళనకు దిగితే శాంతిభద్రతల్ని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోనికి దిగుతారు. విచిత్రం
ఏమంటే టీచర్ల జీతాలు పెరిగితే అదే నిష్పత్తిలో పోలీసుల జీతాలు కూడ పెరుగుతాయి.
21.
పరిపాలన
విభాగంలో జీత భత్యాలు పెరగగానే న్యాయ, శాసన
వ్యవస్థల్లోనూ జీత భత్యాలు పెరుగుతాయి.
22.
ఉద్యోగుల్ని
చూపించి శాసన సభ్యులు, శాసన సభ్యుల్ని చూపించి ఉద్యోగులు నిరంతరం తమ జీత భత్యాలను పెంచుకుంటుంటారు.
23.
ఈ మూడు వ్యవస్థల్లోని
ఏ విభాగంలో జీతాలు పెరిగినా మిగిలిన వ్యవస్థల్లోని
అన్ని విభాగాల్లోనూ కొన్ని రోజులు అటుఇటుగా అదే నిష్పత్తిలో జీతాలు పెరుగుతాయి.
24.
వీళ్ళందరి
జీతాల పెరుగుదలలో అనులోమ అనుపాతం (Direct Proportional) వుంటుంది. ఎవరి జీతం
పెరిగినా అందరి జీతాలు పెరుగుతాయి.
25.
బ్యూరాక్రసీలో
ఒక విచిత్రం వుంటుంది. అందులో కొన్ని విభాగాలు మేకలు, గంగిగోవుల్లా కనిపిస్తుంటాయి.
కొన్ని విభాగాలు రక్తం మరిగిన పులులు, హైనాలుగా కనిపిస్తుంటాయి. నిజానికి ఇవన్నీ ఒకే
నక్షత్రంలో పుడతాయి. మేకలకు ఫిట్ మెంట్ ఇస్తే ఆదే నిష్పత్తిలో పులులు, హైనాల ఫిట్ మెంట్ పెరుగుతుంది. పులులు, హైనాల ఫిట్ మెంట్ పెరిగితే మేకల ఫిట్ మెంట్ కూడ పెరుగుతుంది.
ఇవన్నీ అవిభాజ్యాలు.
26.
సూత్రం ప్రకారం
ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల ద్వార ప్రజల (యొక్క) ప్రభుత్వాలు ఏర్పడుతాయి అని మనం ఎలిమెంటరీ స్కూలు
పాఠ్యపుస్తకాల దశ నుండి వింటూవున్నాం.
27.
ప్రజలు వేసే
ఓట్ల ద్వార కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతాయనీ మనకు తెలుసు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారనే
ప్రభుత్వాలు నడుస్తాయని మనలో చాలా మందికి గుర్తుండదు.
28.
పన్నుల ద్వార
సమీకరించిన నిధుల్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలనేది ప్రజాస్వామ్యంలో ప్రాణప్రదమైన
అంశం.
29.
“ప్రజల చేత ఏర్పడే ప్రజల (యొక్క) ప్రభుత్వాలకన్నా ప్రజల కొరకు పని చేసే ప్రభుత్వాలే గొప్పవి” అని అంబేడ్కర్ అన్నాడు.
30.
ప్రజాస్వామ్యం
అంటేనే పెట్టుబడిదారుల రాజకీయ పరికరం.
31.
పెట్టుబడీదారుల
అనే మాట కటువుగా కనిపిస్తున్నదని మనం దీనిని గౌరవ ప్రదంగా ఆధునిక రాజకీయ పరికరం అంటున్నాం.
32.
పవన్ కళ్యాన్
తోనో, కేసిఆర్ తోనో, చంద్రబాబుతోనో ఎన్నికల పొత్తు పెట్టుకోవాల్సిన గత్యంతరం విఐ లెనిన్
కు లేదు కనుక మొగమాటం లేకుండ పెట్టుబడీదారీ
రాజ్యానికి సంబంధించిన ఈ మూడు వ్యవస్థలు సమిష్టిగా “పెట్టుబడీదారుల ఉమ్మడి ప్రయోజనాలను
నెరవేరుస్తూ వుంటాయి” అని సిధ్ధాంతికరించాడు.
33.
పార్టి ఏదయినా
ప్రభుత్వాధినేత ఎవరయినా ఐదేళ్ల పాలన ముగిశాక వచ్చే ఫలితాలు మూడే. కార్పొరేట్ల సంపద
పెరుగుతుంది, శాసన సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు పెరుగుతాయి కూడు, గుడ్డ,
నీడ కోసం విలపించే దీనుల సంఖ్య పెరుగుతుంది.
34.
పరిపాలన
సాగించడానికి ప్రభుత్వాలకు రెండే ఆప్షన్లు వుంటాయి. ప్రజల్ని అణిచివేయడం; సంక్షేమ పథకాలతో
బుజ్జగించడం.
35.
కొందరు ప్రభుత్వాధినేతలు
అణిచివేతను తగ్గించి, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. మరికొందరు సంక్షేమానికి
తక్కువ ప్రాధాన్యత నిచ్చి అణిచివేతను పెంచుతారు.
36.
ఇందిరాగాంధి,
ఎన్ టి రామారావు, విపి సింగ్, వైయస్ రాజశేఖర రెడ్డి, జయలలిత మొదలయినవారు సంక్షేమానికి
ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నేతల్లో ముఖ్యులు.
37.(ఇంకావుంది)
ఉద్యోగస్వామ్యంలో
వర్గవిభజన
డానీ
మూడవ
భాగం
38.
ఎంపిక చేసుకున్నవర్గాల
సంపదను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి, నిరుపేదల సంక్షేమానికి తక్కువ ప్రాధాన్యత
ఇచ్చిన నేతల్లో చంద్రబాబు ముందు పీఠిన వుంటారు.
39.
కాల్దారి
రైతుల మీద కాల్పులు, చినగంజాం ఉప్పు కార్మికుల
మీద కాల్పులు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారి మీద (బషీర్ బాగ్
) కాల్పులు చంద్రబాబు హయాంలోనే కరిగాయి.
40.
ఆర్ధిక రంగంలో
అభివృధ్ధి (development) విధానాలు వేరు; పెరుగుదల (growth) విధానాలు వేరు.
41.
చంద్రబాబువి
ప్రపంచ బ్యాంకు మోడలు పెరుగుదల (growth) విధానాలు. తాను సంపదను పెంచానని గొప్పగా ప్రచారం
చేసుకున్న ప్రతిసారీ ప్రజలు ఆయన పార్టీని అవమానకరంగా
ఓడించారు. 2004లో, 2014లో జరిగింది ఇదే.
42.
చంద్రబాబు
పక్కన పడేసిన ఎన్టీఆర్ (ఆయుధాలను) విధానాలను ఒడిసి పట్టుకునే వైయస్సార్ 2004 ఎన్నికల్లో
చంద్రబాబును ఓడించారు. చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన ప్రజా సంక్షేమాన్ని పట్టుకునే వైయస్
జగన్ 2004 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారు.
43.
కొత్త హైదరాబాద్
ను తానే నిర్మించానని చంద్రబాబు గొప్పగా చెప్పుకునేవరు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని
వారు అంతే గొప్పగా ప్రచారం చేసుకునేవారు.
44.
పెరుగుదల
విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
45.
హైదరాబాద్
లో టిడిపి నామ రూపాలు లేకుండాపోయింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు విస్తరించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ
టిడిపికి ప్రజల మద్దతు దొరకలేదు.
46.
ఇంకాస్త
వివరంగా చెప్పాలంటే, పట్టణాభివృధ్ధి, ఐటి శాఖల మంత్రుల మీద ప్రజలు ఒక రకం కక్షనే పెంచుకున్నారు.
(ఇంకావుంది)
No comments:
Post a Comment