Tuesday, 11 July 2023

Muslim Satellite News Channels

విజయవాడ

11జులై 2023

 

పెద్దలు జవహర్ అలీ గారికి,

అస్సలాము అలేకుమ్ !

 

ముస్లిం సమాజం కోసం రెండు సాట్ లైట్ ఛానెల్స్ విజయవాడ కేంద్రంగా ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించిన మీ ఉత్సాహాన్ని చూసి చాలా అశ్చర్యం వేసింది.

 

Print and electronic, Telugu and English mediaలో 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. నేటి నెంబర్ ఒన్ శాటిలైట్ ఛానల్ NTVలో Output Editor గా ఆరేళ్లు పనిచేశాను.

 

          నా అనుభవం మేరకు చెపుతున్నాను; ఇప్పటి పరిస్థితుల్లో ముస్లిం ప్రమోటర్లు ఎవ్వరూ విజయవాడ కేంద్రంగా ముస్లిం సమాజం కోసం ఒక్క శాటిలైట్ ఛానల్  ను కూడ పెట్టలేరు. మహా అయితే, హైదరాబాద్ నుండి ముస్లిం ప్రమోటర్లు నడుపుతున్న ఏదైనా ఒక శాటిలైట్ ఛానల్ కు విజయవాడలో ఒక బ్యూరో ఆఫీసు పెట్టవచ్చు.  అలాంటి బ్యూరో ఆఫీసులు మీ కాకినాడలోనూ ఒక డజనుకు పైగా వుంటాయి. ఆ మాత్రం దానికి ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారూ?

 

ఒక్కో శాటిలైట్ ఛానల్ కు హీనపక్షం పెట్టుబడి 25-30 కోట్ల రూపాయలు కావాలి. అసలు అప్లయి చేయడానికే ప్రమోటర్ 20 కోట్ల రూపాయల నెట్ వర్త్ ఆస్తి తనకు వున్నట్టు రుజువు చేయాలి. నెలకు కోటి – కోటిన్నర  రూపాయల ఖర్చు వస్తుంది. అయినా అది వ్యూవర్స్ ను గొప్పగా ఆకర్షించదు. వ్యూవర్స్ ను ఆకర్షించేలా ఛానల్ వుండాలంటే వందల కోట్ల రూపాయలకు పైగా  పెట్టుబడి కావాలి. TV-9ను ఇటీవల 700 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. శాటిలైట్ ఛానల్ రేంజ్ అది.

 

మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే ప్రస్తుతం ఏ సంస్థ కూడ  ఒక్క శాటిలైట్ ఛానల్ ను కూడ నడపడం లేదు. NTV, TV-5, TV9, ABN ఆంధ్రజ్యోతి, సాక్షి టివిలకే విజయవాడలో శాటిలైట్ uplinking facility లేదు. అంతటి ముఖ్యమంత్రి జగన్ కే ఆంధ్రప్రదేశ్ లో శాటిలైట్ ఛానల్ లేనప్పుడు ఒక ముస్లిం సంస్థ పెట్టగలదని నేను అనుకోను. న్యూస్ ఛానల్స్  గురించి బొత్తిగా తెలియనివాళ్ళు మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని మాత్రం నేను కఛ్ఛితంగా చెప్పగలను.

 

ఎవరో ప్రైవేటు వ్యక్తులు ఓ కమ్మర్షియల్ ఛానల్ పెట్టుకుంటే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏమీ వుండదు. నడపగలిగితే అది నడుస్తది నడపలేకుంటే మూతపడుతుంది. అలాకాక, ముస్లిం కమ్యూనిటికి మీడియా సేవలు అందించడం కోసం ఛానల్ పెడుతున్నామంటూ ముస్లిం కమ్యూనిటి నుండి నిధులు సేకరించినపుడు దాన్ని నడిపేవాళ్ళకూ, ముస్లిం కమ్యూనిటీకి కూడ పరస్పరం బాధ్యత వుండాలి. 

 

గతంలో ఇలానే ఓ ఏడాదిన్నర పాటు హడావిడి చేసి ముస్లింల నుండి నిధులు సేకరించి గత ఏడాది  K9TV  నెలకొల్పారు. అదేమయిందీ? ఆ టివి ముస్లిం సమాజానికి చేసిన సేవ ఏమిటీ? అసలు ఎన్ని వీడియోలను ప్రసారం చేసిందీ? వాటిల్లో ముస్లిం అనుకూలమైనవి ఎన్నీ? వసూలు చేసిన నిధులు ఎక్కడికి పోయాయీ? దాని పెర్ఫార్మెన్స్ ను కంటెంట్‍ పరంగా, ఫైనాన్స్  పరంగా ఎవరయినా ఆడిట్ చేశారా?

 

ఒక 24 X 7 ఛానల్ రోజుకు 17 గంటల ఫ్రెష్ కంటెంట్ తయారు చేస్తుంది. 7 గంటలు రిపీట్ కంటెంట్ ఇస్తుంది. ఒక్కో వీడియో క్లిప్పు డ్యూరేషన్ 6-10 నిముషాలు అనుకుంటే రోజుకు 100కు పైగా వీడియో క్లిప్పులు అప్ లోడ్ చేస్తుంది. ఇంత హడావిడి చేసి మొదలెట్టిన అ ఛానల్ ఏడాది కాలంలో కేవలం  53 వీడియోలను మాత్రమే అప్ లోడ్‍ చేసింది. అవి కూడ ఏవిధంగానూ ముస్లిం సమాజాజానికి పనికొచ్చేవి కావు. నాకు తెలిసి అదొక పూర్తి మోసపూరిత ప్రాజెక్టు. ఈ కింది లింకు కొడితే దాని బండారం బయట పడుతుంది.

 

https://www.youtube.com/@k9tvnews

 

నేను మీకు లేఖ రాయడానికి ఒక సామాజిక కారణం వుంది. తరచూ ఇలాంటి మోసపూరిత ప్రాజెక్టుల్ని లాంచ్‍ చేస్తుంటే ముస్లిం సమాజం ఇక మనల్ని నమ్మదు. అవసరమైన సమయంలో ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది విజయవాడ నుండి  శాటిలైట్ ఛానల్ గురించి కాదు; కేబుల్ టీవీ గురించీ కూడ కాదు. ఆ రెండింటినీ కమ్మర్షియల్ గా మాత్రమే నడపాలి. దానికి అవసరమైన భారీ పెట్టుబడిని మనం సమకూర్చలేము. ఒక వేళ కూర్చినా ఆ ఫార్మాట్ ముస్లీం సమాజ సేవకు పనికిరాదు.

 

మనకున్న స్తోమత మేరకు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ నడప గలిగితే అదే గొప్ప.

 

20 – 25 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడి (CAPEX)తో, నెలకు లక్షన్నర – రెండు లక్షల రూపాయల నిర్వహణ వ్యయం (OPEX)తో  ఒకమంచి యూట్యూబ్ ఛానల్ ను నడపవచ్చు. దాని నుండి రెవెన్యూ ఆశిస్తే తిరిగి అది కమ్మర్షియల్ ఛానల్ అయిపోతుంది. దాని నుండి ముస్లిం సమాజ సేవను ఆశించాలంటే Capex, Opex లను ముస్లిం సమాజమే భరించాలి.

 

పెద్దలు మీరు ఆలోచించగలరు.

 

అల్లా హాఫీజ్

 

మీ

డానీ

No comments:

Post a Comment