Friday, 29 May 2026

విప్లవకర సంస్థ, పార్టి - పూర్తిగా మిస్సయింది.

 



ఈమధ్య కాలంలో చాలా ఆసక్తిగా విన్న ప్రసంగం ఇది. 

ఇందులో మూడు భాగాలున్నాయి. 

గతం, వర్తమానం, భవిష్యత్తు. 

నక్సల్ బరీ గత చరిత్ర  గురించి వేణు చాలా ఉత్తేజకరంగా ప్రసంగించాడు. 

అందుకు అతన్ని ఎంతయినా మెచ్చుకోవచ్చు. 


వర్తమానానికి వచ్చే సమయానికి అలాంటి ఉత్తేజానికి అవకాశంలేదు.  

తాము మాత్రమే విప్లవకారులు, తమది మాత్రమే విప్లవకర సంస్థ అని 

గొప్పలు చెప్పుకున్న మావోయిస్టు పార్టి నాయకత్వం   'వికసిత్ భారత్'  తీర్ధం తీసుకుని ప్రభుత్వానికి వీరోచితంగా లొంగిపోయింది.


వర్తమానమే నిరాశాజనకంగా వున్నప్పుడు భవిష్యత్తును ఆశాజనకంగా చిత్రించడం కష్టం, 


దేశంలో విప్లవకర వాతావరణం అద్భుతంగా వుంది. విప్లవకర శక్తులు పుష్కలంగా వున్నాయి. 

కానీ, విప్లవానికి అవసరమైన మూడు షరతుల్లో ప్రాణప్రదమైనది -  విప్లవకర సంస్థ, పార్టి -  పూర్తిగా మిస్సయింది. 


ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఆలోచనాపరులు ఏం చేయాలీ? 

చొరవ చేసి భవిష్యత్తు కోసం ఒక కొత్త పంథాను రూపొందించాలి. 


1990ల తరువాత మారిన ఆర్ధిక సామాజిక వాతావరణంలో వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం వంటి పాత కార్యక్రమాలను పక్కన పెట్టి కొత్త సామాజికార్ధిక పునాదుల మీద కొత్త కార్యక్రమాన్ని, ఒక కొత్త ఐక్య సంఘటనను ప్రతిపాదించాలి. 

అలాంటి చొరవ వేణు ప్రసంగంలో లోపించింది.   

ఈసారి బక్రీద్ భారత ముస్లింల రాజకీయ చరిత్రలో ఒక ముందడుగు. "గోహత్యను నిషేధించండి", "ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి" అంటూ ఒక వినూత్న  ఉద్యమానికి వాళ్లు నడుంబింగించారు. బక్రీద్ కు నాలుగు రోజులు ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఆ  ప్రస్తావనలేదు. 

అయినప్పటికీ, 80 నిముషాల ప్రసంగంలో ఒక చోట  మైనారిటీలు, ఇంకోచోట ముస్లింలు, క్రైస్తవులు అనే పదాలు వినిపించాయి. అందుకు వేణుకు ధన్యవాదాలు. 


N. Venugopal Breaks Down Charu Mazumdar’s Explosive Letter on Naxalbari | G8news

https://www.youtube.com/watch?v=B7vJ4YQfSJQ

No comments:

Post a Comment