ఇండియాను శాకాహార దేశంగా ప్రకటిస్తే హిందువులే తిరగబడతారు
సంఘపరివార శక్తులు ముస్లింలను మానసికంగా, భౌతికంగా వేధించడానికి కొన్ని దశాబ్దాలుగా బీఫ్ పాలిటిక్స్ ను ప్రయోగిస్తున్నాయి. మరోవైపు, బీఫ్ ఎక్స్ పోర్టులో భారత దేశం అగ్రస్థానంలోవుంది. అందులోనూ యోగీ ఆదిత్యనాధ్ ఉత్తర ప్రదేశ్ మరీ ముందుంది.
ఈ ద్వంద్వ నీతి ముసుగును ఊడదీసి సంఘపరివారం నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ముస్లిం నాయకులు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. గోమాసాంన్ని తాము మానేస్తున్నామని ప్రకటించడమేగాక, గోవును జాతీయ పశువుగా గుర్తించమని ప్రభుత్వాన్నే కోరారు. ఈ సర్జికల్ స్ట్రైక్ ను తట్టుకోలేక సంఘపరివార శక్తులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
ఈ డిమాండ్ ను ముస్లింల చేత ఉపసంహరింపచేయడానికి సంఘపరివార శక్తులు నానా తంటాలు పడుతున్నాయి. ఇది ‘ముస్లింల సెల్ఫ్ గోల్’ అని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎలా ఇది సెల్ఫ్ గోల్? ఇందులో ముస్లింలు కొత్తగా కోల్పోయేది ఏమిటీ?
ముస్లింలు ఏమైనా ఆవుమాసం తింటున్నారా? ఆవు మాసం తినడం ఇస్లాం విధుల్లో ఒకటా? ఏమీకాదే!!
ఇస్లాం పుట్టిన సౌదీ ఆరేబియాలో దుంబ (గొర్రె) మాంసాన్నే అత్యధికంగా వినియోగిస్తారు. వాళ్ళకు ఆవుజాతి దాదాపు లేదు.
సంఘపరివార శక్తులే దిగివచ్చి 14 యేళ్ళు దాటిని ఆవును తినవచ్చు. ఇంట్లో తినవచ్చు. మిథున్ ఆవును తినవచ్చు అంటున్నాయి. ఇది ముస్లింల నైతిక విజయం.
దేశంలోని మాంసాహారుల్లో ముస్లింలు 14 శాతం మాత్రమే.; హిందువులు 80 శాతం. ఇండియాను శాఖాహార దేశంగా ప్రకటించే సాహసం ఈ ప్రభుత్వం చేయలేదు. అలాచేస్తే, హిందూ సమాజమే తిరగ బడుతుంది. అంచేత ఆ సమస్య ఎప్పటికీ తలెత్తదు.
No comments:
Post a Comment