Saturday, 14 December 2024

They are my Teachers

 వాళ్ళు నా గురువులు 


1981 నాటి సంగతి. 

జవహర్ లాల్ యూనివర్శిటి (JNU) ఆ ఏడాది సెప్టెంబరు చివరి వారంలో చైనా రచయిత లూసన్ (లూ క్షన్) శతజయంతి ఉత్సవాలు నిర్వహించింది. అప్పట్లో JNU విద్యార్ధులుగా వున్న బిబిజి తిలక్, ఎం మోహన రెడ్డి ఫారిన్ లాంగ్వేజెస్ డిపార్ట్ మెంటు డీన్ కు నా గురించి చెప్పారట. లూసన్ ను ఎక్కువగా చదివిన వారిలో నేను ఒకడినని అన్నారట. దానితో ఆ ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించాలని నాకు ఆహ్వానం పంపారు. 


నేను ఈ అవకాశాన్ని కొంచెం ప్రతిష్టాత్మకంగా భావించి ఓ వారం రోజులకు పైగా ఇంగ్లీషు నోట్సు రాసుకున్నాను.  అప్పట్లో నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్  కాలేజీ సమీపంలోని జమిందార్ బిల్డింగ్ హాస్టల్ లో వుండేవాడిని. చెలంగా పిలిచే తెంటు లక్ష్మీ నరసింహాచలం నా రూమ్ మేట్. 


మేమిద్దరం అప్పట్లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని  పీపుల్స్ వార్ లో వుండేవాళ్ళం. చలం రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) విభాగానికి జిల్లా నాయకుడు. నేను రాడికల్ యూత్ లీగ్ (RYL) విభాగానికి జిల్లా అధ్యక్షుడిని. సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ కు ఎప్పుడూ పూర్తి స్థాయి  కృష్ణాజిల్లా కమిటి లేదు. అప్పట్లో నేను అడహాక్ బాధ్యునిగా వుండేవాడిని. అలా పార్టీ యంత్రాంగంలో  నేను కొంచెం పెద్ద, చలం కొంచెం చిన్న. కలైకూరి ప్రసాద్, రంగావఝాల భరద్వాజ, తరువాతి కాలంలో నా భార్యగా మారిన ఏలూరి అజిత తదితరులు ఇంకొంచెం చిన్న. గురుశిష్యుల సంబంధం ఓ ఇరవై యేళ్ళు గడిస్తే స్నేహితులుగా మారిపోతుంది. 


In January 1927, he and Xu moved to Guangzhou, where he was hired as the head of the Chinese literature department at Sun Yat-sen University. His first act in his position was to hire Xu as his personal assistant, as well as Xu Shoushang, one of his old classmates from Japan, as a lecturer. While in Guangzhou, he edited numerous poems and books for publication, and served as a guest lecturer at Whampoa Academy. Through his students, he established connections within both the Kuomintang and Chinese Communist Party (CCP).


After the Shanghai massacre in April 1927, he attempted to secure the release of several students through the university, but failed. His failure to save his students led him to resign from his position at the university, and he left for the Shanghai International Settlement in September 1927. By the time he left Guangzhou, he was one of the most famous intellectuals in China.[25]

No comments:

Post a Comment