*వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ శక్తుల ఐక్యతా సదస్సు*
విజయవాడలో జరిగిన 'వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ శక్తుల ఐక్యతా సదస్సు' ఎలాంటి రోడ్ మ్యాప్ ను ప్రతిపాసించిందో సమాచారం లేదు.
'వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ శక్తుల ఐక్యతా సదస్సు' ముసాయిదా పత్రం ప్రపంచయాత్ర ఎక్కువగా చేసింది.
'వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ శక్తుల ఐక్యతా సదస్సు' ముసాయిదా భారత సామాజికార్ధిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయలేదు.
ఈ సందర్శంగా 12 అంశాలు
1.
వామపక్షాలు రాజకీయార్ధిక అంశాలను అద్భుతంగా మాట్లాడుతున్నాయి. అది చాలదు. కుల, మత, తెగ, లింగ సమస్యల్ని మాట్లాడకపోతే కుదరదు.
2.
రాజకీయార్ధిక అంశాలతోపాటు కుల, మత, తెగ, లింగ, భాషా, ప్రాంత సమస్యలకు పరిష్కారం చెప్పగలిగినవాడే నేటి ఆలోచనాపరుడు.
3.
అస్తిత్వ సమూహాలతో తమకు పనిలేదని కమ్యూనిస్టు పార్టీలు అనుకోవచ్చు. అప్పుడు, ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటించాలి.
4.
ఆర్ధిక సమస్యల్ని పరిష్కరిస్తే ఇతర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నది వందేళ్ళుగా అతిగా వాడేసిన సూత్రం. అది ఇంక చెల్లదు.
5.
40 యేళ్ళుగా అస్తిత్వ సమూహాలు సామాజికంగా కీలక ప్రశ్నలు సంధిస్తున్నాయి. వాటికి ఇప్పుడైనా సమాధానం చెప్పాలని అనుకోకపోతే ఎలా?
6.
ప్రజలు వామపక్షాలకు దూరం కావడానికి బయటి పార్టీల ఆకర్షణకన్నా లోపలి తప్పులే ఎక్కువని ఆత్మవిమర్శ ఇప్పుడయినా చేసుకుందామా?
7.
హేట్ మైనారిటీస్ అనే సింగిల్ స్ట్రాటజీతో సంఘపరివారం ఎన్నికల్లో గెలుస్తున్నది. దానికి ఆలోచనాపరులు విరుగుడు కనిపెట్టారా?
8.
దేశమంతా హేట్ ముస్లిం పాలసీ నడుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో హేట్ క్రీస్టియన్స్ పాలసి కూడ నడుస్తున్నది. దీన్ని పట్టించుకోవాలిగా!
9.
డిజిటల్ జెనెరేషన్ కు గొప్ప ఆవేశం వుంది. నిరసన శక్తి వుంది. వాళ్ళను ఆకర్షించి, ఆలోచనలు నింపే నవయోధుడు ఎవరూ?
10.
ఆయా చారిత్రక దశల్లో సుందరయ్య, రాజేశ్వరరావు, కొండపల్లి విద్యావంతులైన కొత్త తరాల్ని గొప్పగా ఆక్లర్షించారు. ఇప్పుడెవరూ?
11.
వాస్తవ సమాజపు వాస్తవ సమస్యల్ని అర్ధం చేసుకుని అణగారిన సమూహాలను కూడగట్టని ఉద్యమం ఎన్నటికీ ఆ సమాజాన్ని మార్చలేదు.
12
వర్గం ఆర్ధికరంగంలో మాత్రమే వుంటుందా? లేక కులమతతెగ తదితర వ్యవస్థల్లోనూ వర్గం వుంటుందా?
13
కమ్యూనిస్టులు మాత్రమే ఫాసిస్టులను ఓడించగలరు అనడం అతిశయోక్తి. అయితే కమ్యూనిస్టులు లేకుండా ఫాసిస్టులను ఓడించడం కూడా సాధ్యం కాదు.
14.
మార్క్సిస్టుల నుండి దూరంగా వెళ్ళిపోయిన ST, SC, BC, మైనారిటీలు, మహిళలు కూడ సమసమాజం దిశగా సాగింది ఏమీలేదు.

వామపక్షం మరియు ప్రజాతంత్రం అనేవి కలిసి ఉండే భావజాలాలు కానేకావే! వామపక్ష ప్రజాతంత్ర ఏమిటి అసందర్బం. ఇది పచ్చిమోసకారీ మాటే. ఏకమ్యూనిష్టు ప్రభుత్వమైనా ఏదేశంలోనైనా ప్రజాస్వామ్యం పాటించిందా?
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete