Friday, 4 September 2026

Notes on Vandemataram Song

 వందే మాతరం గేయం :  వలస వ్యతిరేకత నుండి మత విద్వేషం వరకు 


వందేమాతరం నినాదం వందేమాతరం ఉద్యమం వందేమాతరం గీతం ఒకటికావు. 

మాతృదేశాన్ని  ప్రతి ఒక్కరూ గౌరవించాలి. వందేమాతరం అనాలి. మా తుఝే సలాం అనాలి. తల్లీ నీకు వందనం అనాలి. 

హిందూ దేవతలైన కాళిక దుర్గాలే మాతృ భూమి.   ప్రతిపౌరుడు   ఆ దేవతల్ని పూజించాలంటే  విబేధాలు వస్తాయి. 

భారత ముస్లింల జన్మభూమి కర్మభూమి పుణ్యభూమి కూడ భారత దేశమే.

మక్కా, మదీనా, బైతుల్ ముఖద్దస్ (al aqsa mosque) లను ముస్లింలు పుణ్య క్షేత్రాలుగా భావిస్తారు.  అంతమాత్రాన ఆ మూడు పుణ్యక్షేత్రాలున్న సౌదీ అరేబియా, ఇజ్రాయేల్ దేశాలను, పాలస్తీనాను కూడ  ముస్లింలు పుణ్య భూములు అనుకోవు. ఫాదర్ లాండ్ , మదర్ లాండ్ అనుకోరు. 


బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905లో చెలరేగిన వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ముస్లింలు ఎవరూ? 


When and how Rabindranatha Tagore changed his stance on Vandemataram song and became critical of it?


బంకించంద్ర  బ్రిటీష్ ఉద్యోగి. 1857లో హిందూ ముస్లింలు కలిసి భారత  ప్రధమ స్వాతంత్ర్యోద్యమాన్ని సాగించిన 25 ఏళ్ల తరువాత ఆనందమఠ్ నవలను ప్రచురించాడు. 

ఆయన అప్పుడు అధికారంలోవున్న బ్రిటీష వలస పాలనను వ్యతిరేకించలేదు. బ్రిటీష్  పాలన ఆరంభానికి ముందు ముస్లింనవాబుల పాలన కాలంలో  బెంగాల్ లో సాగిన సన్యాసుల తిరుగుబాటును కథాంశంగా తీసుకున్నాడు. ఈ నవలలో హిందూ సన్యాసులు proyogonists;  ముస్లిం పాలకులు antogonists. 

1857 లో భారత హిందూ ముస్లింల మధ్య ఏర్పడిన ఐక్యతను చూసి బ్రిటీష్ పాలకులు భయపడ్డారు. ఆ రెండు మత శిబిరాలను విడదీయాలనుకున్నారు. 

బంకించంద్ర నవల ఆ పనిచేసి పెట్టింది.  

1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన వందేమాతరం వుద్యమంలో ఈ విభజన పనిచేసింది. దానితోనే రబీంద్రనాథ్ టాగోర్ ఈ గీతం మీద తన పూర్వ ఆలోచనల్ని మార్చుకున్నాడు. ఆయన ఏకేశ్వరోపాశకుడు కావడం కూడ దీనికి కారణం. . 

బంకించంద్ర వ్యూహానికి ఆధునిక రూపమే 1923లో దామోదర్ వినాయక్ సావర్కర్ ప్రవేశ పెట్టిన  Hindutva సిధ్ధాంతం. 

No comments:

Post a Comment