Wednesday, 23 September 2026

September 17 360 Degrees

 September 17 360 Degrees

సెప్టెంబరు 17, 360 డిగ్రీలు

*డానీ*

*సమాజ విశ్లేషకులు* 

          నిజాం చరిత్రలో  ఎవరికి ఎలా కావాలో అలా కనిపించే  రోజు సెప్టెంబరు 17.  విలీనం, విమోచన, విద్రోహం, ప్రజాపాలన వగయిరా  చాలా పేర్లతో చాలామంది దాన్ని పిలుస్తున్నారు. ఒక బిందువు దగ్గరుండే డిగ్రీలలో ప్రతిదానికీ  ఓ నేరేటివ్ ను ఎంచుకుని  సెప్టెంబరు 17 మీద ఓ 360 అధ్యాయాల చరిత్రను రాయవచ్చు.

 

నిజాం పరిపాలన చట్రం మూడు అంతస్తుల దొంతర. కింద దేశ్ ముఖ్ లు, పైన నిజాం అనే  పరిపాన చట్రమే బహుళ ప్రచారంలోవుంది. ఆపైన బ్రిటీష్ రెసిడెంట్ వుండేవాడని చాలామందికి  తెలీదు. నిజాం సంస్థానంలో బ్రిటీష్ రెసిడెంట్ ను గుర్తించినవాడు  తుర్రేబాజ్ ఖాన్. సిపాయిల తిరుగుబాటు సమయంలో  కోఠీలోని రెసిడెంట్ భవనం మీద దాడిచేశాడు.   ఈ మూడు అంతస్తుల పరిపాలన నిర్మాణ  చట్రం తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం మీద అప్పటి కమ్యూనిస్టు నాయకులు రాసిన  పుస్తకాల్లోనూ కనిపించదు.

 

మత ప్రమాణాలతో చూస్తే మూడు అంతస్తుల్లోనూ  మూడు మతాల ప్రాబల్యం కనిపిస్తుంది. పరిపాలన కింది అంతస్తుల్లో హిందూ  జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు కనిపిస్తారు. ఆపై అంతస్తులో ముస్లింల ప్రాబల్యం కనిపిస్తుంది. అన్నింటికన్నా పైన కనిపించని  అంతస్తులో  ఆంగ్లేయ క్రైస్తవుల ప్రాబల్యం కనిపిస్తుంది. మధ్య అంతస్తులో ముస్లింలు అస్సలు లేరనికాదు. వాళ్ల సంఖ్యా చాలా చిన్నది, విసునూరు, ఎర్రపహాడ్ జాగీర్దార్లతో పోలిస్తే వాళ్ల స్థాయి కూడా చాలా చిన్నది. ముస్లిం జాగీర్దార్లకు వ్యతిరేకంగా అక్కడి రైతులు పోరాడారు అనే మాట కూడ మనకు ఎక్కడా వినిపించదు. ఇది కూడ ఒక నేరేటివ్.

 

          1527 వరకు ఈ ప్రాంతాన్ని ఖిల్జి, తుగ్లక, బహమనీ వంశాలు పాలించాయి. కులీ కుతుబ్ షాహీలు 1687 వరకు దాదాపు 160 యేళ్ళు పాలించారు. ఆ తరువాత కొంత కాలం మొఘలులు ఢిల్లీనుండి నేరుగా  పాలించారు.. 1724లో ఆసఫ్ జాహీ పాలన మొదయింది. దీనే నిజాం పాలన అంటున్నాం. ఇది ఇంకో  224 ఏళ్ళుసాగి 1948లో సంస్థానం ఇండియాలో విలీనం కావడంతో ముగిసింది.

 

 కులీ కుతుబ్ షాహీల పాలన గురించి ఎవరికీ పెద్దగా విమర్శలు, ఆరోపణలు లేవు. ఆసఫ్ జాహీల 160 సంవత్సరాల పాలనలో ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ వరకూ పెద్దగా విమర్శలు లేవు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో  విమర్శలున్నాయి. అందులోనూ ఎక్కువ వివాదాస్పదమైనది చివరి ఏడాది మాత్రమే.

 

నిజాం ఒక రాజు. సంస్థానాధీశుడు. సంస్థానాధీశులకుండే రాజరిక దుర్లక్షణాలన్నీ అతనికి వున్నాయి. వాళ్లకు ఉండాల్సిన అవసరంలేని కొన్ని గొప్ప లక్షణాలూ అతనికి వున్నాయి. నీటి పారుదలా, డ్రైనేజి,  విద్యుత్తు, రోడ్లు, రైల్వే, విమానయాన, వైద్య, విద్య, పారిశ్రామికవాడలు తదితర  మౌలిక  సదుపాయాలన్నింటినీ గొప్ప నాణ్యతతో  ఇప్పటికీ గుర్తు ఉండిపోయేలా  ఏర్పాటు చేశాడు.  ఆదిఆంధ్ర భాగ్యరెడ్డి వర్మను ప్రోత్సహించాడు. అంబెడ్కర్ కు స్కాలర్షిప్ అందించాడు. శాంతి నికేతన్ నిర్మాణానికి విరాళాలు ఇచ్చాడు. 20  వ శతాబ్దం ఆరంభంలోనే రాబోయే వందేళ్లలో హైదరాబాద్ లో  పెరిగే జనాభాకు సరిపడా తాగునీటి  సదుపాయం కల్పించాడు.

 

          ఇరవయ్యవ శతాబ్దం తొలి దశాబ్దంలోనే నిజాం సంస్థానంలో ఆర్యసమాజ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. 1927లో మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఆవిర్భవించింది. కొంచెం అటూఇటుగా సంస్థానంలో హిందూ మహాసభ కూడ  ప్రవేశించింది. 1938లో పారా మిలటరీ సంస్థగా రజాకార్ మొదలయ్యింది. గ్రామీణ ప్రాంతంలో దేశ్ ముఖ్ లు, జాగీర్దార్లకు బాసటగా నిలబడడం దీని ప్రధాన బాధ్యత. రజాకార్లలో హిందూ ముస్లింలు కూడ వుండేవాడు. వాళ్లను దేశ్ ముఖ్ లు, జాగీర్దార్లు పోషించేవాడు.

 

మహాత్మా గాంధీ హంతకుడైన, హిందూమహాసభ నాయకుడు  నాథురాం గాడ్సే 1930లలో కొంతకాలం నిజాం సంస్థానంలోనూ  పనిచేశాడు.  1922  లో ఆంధ్ర జనసంఘం ఏర్పడి 1930 లో ఆంధ్రా మహాసభగా మారింది. అది క్రమంగా కమ్యూనిస్టు పార్టీ  ప్రభావం లోనికి వెళ్ళింది.  ఆర్యసమాజ్ కు చెందిన స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్  రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ప్రగతిశీలురైన ముస్లింలు హైదరాబాద్  కేంద్రంగా కామ్రేడ్స్  అసోసియేషన్స్ గా ఏర్పడి పనిచేయడం మొదలెట్టారు. ఇందులో ముస్లిమేతర సభ్యులు ఇద్దరు ముగ్గురు మాత్రమే.  ఒక విధంగా ఇది ముస్లీం ఆలోచనాపరుల సంస్థ.  తెలంగాణలో తొలి అమరుడు బందగి. చివరి అమరుడు పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్. అతన్ని అంత దారుణంగా హత్యచేశారని తెలిసిన తరువాత మాత్రమే నెహ్రు పోలీస్ యాక్షన్ కు అనుమతి ఇచ్చాడని అంటారు.

 

మొత్తంమ్మీద 1940    నాటికీ  నిజాం సంస్థానంలో హిందూమహాసభ, ఆర్య సమాజ్, జాతీయ కాంగ్రెస్  కమ్యూనిస్టులు, ఆంధ్రమహాసభ క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.  అప్పటి విద్యావంతులైన పెత్తందారీ కులాల ఉమ్మడి కుటుంబాల్లో ఈ నాలుగు సంస్థల ప్రతినిధులు ఉండేవారు.

 

 

ఇలా ఉండగా అప్పటి నల్గొండజిల్లాలోని  కడివెండి గ్రామంలో విసునూరు దేశ్  ముఖ్  రామచంద్ర రెడ్డి  మనుషులు కమ్యూనిస్టు కార్యకర్త  దొడ్డి కొమరయ్యను హత్యచేశారు. ఇది తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ సాయుధ పోరాటానికి దారితీసింది.

 

నిజాం చరిత్రలో అత్యంత వివాదాస్పదుడయిన కాశీం రజ్వీ రజాకార్ల ని నాయకుడయ్యింది 1946 డిసెంబరు లో. కమ్యూనిస్టు పార్టి నాయకత్వంలో  రైతాంగ సాయుధపోరాటం ఆరంభమయిన ఆరు నెలల తరువాత రజ్వీ వెలుగులోనికి వచ్చాడు.

 

ఈ పరిణామాలన్నింటి అనంతరం 1946  డిసెంబరులో కాశిం రిజివి రజాకార్ల నాయకునిగా నియమించబడ్డాడు.

[13:41, 22/09/2026] khanyazdani: రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాలు గెలిచాయి. ముందుగా చేసిన వాగ్దానం ప్రకారం భారతదేశానికి స్వాతంత్య్రం వాక్స్ ప్రక్రియ మొదలేయింది.

 

 

The Indian Independence Bill was introduced (moved) in the British House of Commons on July 4, 1947, and it was passed by Parliament and received Royal Assent on July 18, 1947.

 

ఏగుడ్డివానికీ అర్ధంకాని ఏనుగులా నిజాం సంస్థానం ఎవరికీ పూర్తిగా అర్ధం కాదు. ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఆంధ్ర భాషలతో ఇతర అనేక భాషల్ని నిజాంలో నివశించేవారు. తెలంగాణ డైతాంగ సాయుధ పోరైటం మీద పుస్తకాలు రాసిన కమ్యూనిస్టు రచయితలు ప్రధానంగా తెలుగు భాషకు సంబంధించిన వారు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పనిచేసినవారు. వీరికి ఆనాటి పరిణామాల గురించి పాక్షికంగా మాత్రమే తెలుసు. భౌగోళికంగా చెప్పాలంటే, ఆంధ్రాప్రాంతం (ఉమ్మడి మద్రాసు రాష్ట్రం)తో  సరిహద్దుగల జిల్లాలలోనే వీరి కార్యకలాపాలు వుండేవి. నిజాం సంస్థానంలో రాచరిక పాలనకు వ్యతిరేకంగా  ఉద్యమించిన ముస్లిం ప్రజాస్వామికవాదుల గురించి వీరికి తెలీదు. అప్పట్లో వచ్చిన తెలుగేతర సాహిత్యం గురించి కూడ వీరికి తెలియదు. వీరికి ఆంధ్రాప్రాంతం నుండి నిజాం సంస్థానంలోనికి వచ్చిన పోలీస్ యాక్షన్ గురించి మాత్రమే తెలుసు. మహారాష్ట్ర ప్రాంతం నుండి నిజాం సంస్థానంలోనికి వచ్చిన పోలీస్ యాక్షన్ గురించి దాదాపు తెలియదు. ఆంధ్రాప్రాంతం నుండి నిజాం సంస్థానంలోనికి వచ్చిన సైన్యంకన్నా, మహారాష్ట్ర ప్రాంతం నుండి లోపలికి దూసుకువచ్చిన సైన్యం చాలా అరాచకాలు చేసింది. పది రెట్లు ఎక్కవ మందిని హతమార్చింది. వాళ్ళలో అత్యధికులు ముస్లింలు. తెలంగాణ పోరాటం ముగిసిన పాతికేళ్ల తరువాత రాసిన పుస్తకాలలోనూ మనకు హైదరాబాద్ ముస్లింల మీద సాగిన నరమేధం ప్రస్తావన కనిపించదు. దేవులపల్లి వెంకటేశ్వరరావు పుస్తకంలో మాత్రం కమ్యూనిస్టు పార్టీలో ఏదో ఒక స్థాయిలో ముస్లిం వ్యతిరేకత వుండిందనే మాట కనిపిస్తుంది.


ఒక సమూహం  భవిష్యత్తులో మతసామరస్యంతో జీవించాలనుకుంటున్నది. రెండో సమూహం వెయ్యేళ్ళ క్రితం ఘర్షించాలనుకుంటున్నది .




No comments:

Post a Comment