Saturday, 11 April 2026

JNJ Postings 11-04-2026

 JNJ Postings 11-04-2026

1.

"మాకు ఫ్యూచర్ సిటీలో -  రోడ్లు, విద్యుత్తూ, నీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థల వంటి  మౌలిక  సదుపాయాలు కల్పించి, ఇండివిడ్యువల్ గా లే - అవుట్లు  వేసి, - ఇంటి స్థలాలు కేటాయించ వలసిందిగా  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము" 


ఈ తీర్మానం మీద సర్వసభ్య సమావేశం అభిప్రాయాన్ని తీసుకోవాలి. 


- డానీ, 134



2. 

మన భావోద్వేగాలన్నీ నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాలతో  ప్రగాఢంగా ముడిపడి వున్నాయి.  ఆ విషయం అందరికి తెలుసు. కానీ, నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాల్ని దక్కించుకునే మార్గాన్ని ఏ ఒక్కరూ ఇంతవరకు చెప్పలేకపోయారు. నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాల్ని దక్కించుకునే మార్గం  ఎవరికయినా తెలిస్తే ఇప్పుడయినా చెప్పవచ్చు. లేనప్పుడు ఏమిటీ పరిష్కారం? ప్రత్యామ్నాయాలు ఆలోచించక తప్పదుకదా?  


- డానీ, 134




3. 


నిజాంపేట్, పేట్ బషీరాబాద్ స్థలాల్ని దక్కించుకునే మార్గం  ఎవరికయినా తెలిస్తే ఇప్పుడయినా చెప్పవచ్చు. 


- డానీ, 134


4.

చట్టం మనకు అనుకూలంగా ఉంటే 

దానికి సీఎం తో పనిలేదు. 

మన  రెండు స్థలాలు మనకే వస్తాయి. 

ఇప్పుడు చట్టం మనకు అనుకూలంగా లేదని 

నా అభిప్రాయం. 


చట్టం మనకు వ్యతిరేకంగా మారడానికి 

బివోడి కూడా కారణమా? అనేదీ ఒక అంశమే. 

కానీ దాన్ని సాగదీయడంవల్ల ప్రయోజనం లేదు. 

ఇప్పుడు పనికొచ్చే పనేదైనా ఉంటే అది మాత్రమే చేయాలి. 


సొసైటీలో రాజకీయ ప్రయోజనాలు ఆశించేవారు 

ముందుకు కదలరు. 

బ్లేమ్ గేమ్ ముఖ్యం వాళ్లకు.

వాళ్ళు ఏపనీ చేయలేరు.  

 


- డానీ, 134


5

కాసేపు బివోడిని పక్కన పెట్టి ఆలోచిద్దాం. 


ఆ రెండు స్థలాలను మనకు ఇవ్వాలని సీఎం తలచుకుంటే 

సుప్రీం కోర్టు తీర్పు మనకు అడ్డంకికాదు. 

ఇది బాగుంది. 


సియం మనకు ఇవ్వాలని తలచుకోకపోయిన సరే 

అయన చేత  ఆ రెండు స్థలాలను మనకు 

ఇప్పించే స్తొమత సుప్రీం కోర్టు తీర్పుకు ఉందా? 

 లేదు అనేకదా  సమాధానం!!!


మన కేసులో సీఎం సుప్రీం.   


ముందు ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


దాన్ని బట్టి కార్యాచరణను రూపొందించుకోవాలి. 


- డానీ, 134




 సుప్రీం కోర్టులో మన curative పిటిషన్ పై దృష్టి పెట్టడం మేలు. జర్నలిస్టుల సొంత ఇంటి కలను స్వయంగా సుప్రీం కోర్టే దూరం చేయడం అన్యాయమని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయ పడిన నేపథ్యంలో...curative పిటిషన్ మన ఆశలకు సజీవ రూపం ఇచ్చే అవకాశం ఉంది.


No comments:

Post a Comment