Friday, 14 June 2013

Alchemist Novel and Liquid Modernity


ద్రవాధునిక వ్యవస్థపై దాడి
.యం. ఖాన్యజ్దానీ (డానీ)

          ”ముస్లిం సాంస్కృతిక  సైన్యంలో మరో అలోచనాపరుడు చేరాడు. అతని పేరు బి. చంద్రశేఖర్” - సండే ఇండియన్‌ (24 జనవరి-6 ఫిబ్రవరి 2011) లో మిత్రుడు చంద్ర వ్యాసం చదివినపుడు నాకు కలిగిన అభిప్రాయం ఇది.

          విమర్శ అంటే సాహిత్య రంగంలో సాగించే వర్గపోరాటం అని త్రిపురనేని మధుసూదనరావు చాలాసార్లు అనేవారు. చిలకపలుకులతో పుస్తక సమీక్షలు చేయడం, పొగడ్తలతో ముందు మాటలు రాయడం ఆయనకు గిట్టేదికాదు. పుస్తకాలు అమ్ముకునేవాళ్ళు రాసుకోవాల్సిన రైటప్పుల్ని సమీక్షల పేరుతో మనం రాసిపెట్టడం దేనికీ? అనేవారు. ఒక రచనలోవున్న కథావస్తువును (కథాంశంకాదు) సమగ్రంగా ఆవిష్కరించడమే విమర్శకుడు చేయాల్సిన పని అనేది ఆయనపెట్టిన నియమం. చంద్ర కూడా పూర్వాశ్రమంలో  త్రిపురనేని  పాఠశాల విద్యార్ధే. అందుకే, బ్రెజిల్ కు చెందిన పోర్చుగీసు రచయిత పౌలో కోయిల్హో రాసిన ఆల్కెమిస్ట్నవలలోని  సామ్రాజ్యవాద అనుకూలతముస్లిం వ్యతిరేకతల్ని జిగ్మంట్బౌమన్ద్రవాధునికత సిధ్ధాంతం ఆధారంగా  వివరించాడు. ఈ మూడు కోణాల్నీ  దృష్టిలో పెట్టుకుని రచన సాగించడం అంత సులువైన విషయంకాదు. 

          కొత్తవాళ్లకు అర్ధంకావడం కోసం కాబోలు, చంద్ర, కొంచెం పొడవాటి శీర్షిక పెట్టాడు. గానీ, ’ముస్లిం వ్యతిరేక క్రైస్తవ ద్రవాధునిక నవలఅనేకన్నా  ’ద్రవాధునికతఅంటేచాలు. సందర్భం ఏదైనా, ’ద్రవాధునికతఅంటే అది ముస్లిం వ్యతిరేకమైనదనే అర్ధం.

          ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వేదికపై ఈనాడు  ఇస్లాం అనేది చర్చనీయాంశంఅనేకమంది ఆలోచనాపరులు వివాదాన్ని మతపరమైనదిగా మాత్రమే  చూస్తున్నారు. వాస్తవానికి ఇది ప్రాపంచిక దృక్పధానికి సంబంధించిన వివాదంఇస్లాం ధార్మిక దృక్పధాన్ని వివరించడానికి ఇది సందర్భం కాకపోయినా, ’ఏకధృవ వ్యవస్థగా భావిస్తున్న వర్తమాన  ప్రపంచంలో ఇస్లాం ప్రాసంగికతను ప్రస్తావించక  తప్పదు.

          ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక దేశంలో, ఏదో ఒక జాతి, జాతీయత, కులం, మతం, తెగ, ప్రాంతం, భాష, లింగం, వర్ణం, సంస్కృతుల్లో  పుడతాడు. అందువల్ల ప్రతిమనిషిపై వీటన్నింటీ ప్రభావం ఎంతోకొంత తప్పనిసరిగా వుంటుంది. అయితే, వీటన్నింటినీ, ఇతరులకన్నా, కాస్త ఎక్కువగా పట్టించుకునే ప్రజాసమూహం ముస్లింలు. ఇలా వీటిని ఎక్కువగా పట్టించుకునే తత్వమే ముస్లింలను ప్రత్యేక ప్రజాసమూహంగా మారుస్తుందిముస్లింలకు ఇస్లాం విధించే నియమాలు తమంతట తాముగా ఒక సమగ్ర రాజకీయార్ధిక, సాంస్కృతిక జీవన విధానం. దానితో, విభేదించేవాళ్ళు వుండవచ్చు. అది వేరేవిషయం.

          ఘన ఆధునిక సమాజాల్లోగానీ, ఆధునికానంతర సమాజాల్లోగానీ, ద్రవాధునిక సమాజాల్లోగానీముస్లింలని ఇతర ప్రజాసమూహాల నుంచి విడగొట్టేది, చాలా మంది అనుకుంటున్నట్టువాళ్ల సాంస్కృతిక జీవన విధానం కాదు; వాళ్ల ఆర్ధిక దృక్పధం. ప్రతిమనిషీ జీవితంలో  సుఖాన్నీ, శాంతినీ కోరుకుంటాడు. ముస్లింలకు శాంతి ప్రాధమికం. సౌఖ్యం ద్వితీయం. ఇద్దరు ముస్లింలు తారసపడ్డప్పుడుబెస్ట్ఆఫ్లక్‌” అనుకోరు. పరస్పరం శాంతి (సలామ్‌) కలగాలని కోరుకుంటారు. వాళ్లకు సమూహం ప్రాధమికం. వ్యక్తి ద్వితీయం. రెండు ప్రాతిపదికలు పెట్టుబడిదారీ వ్యవస్థకు మౌలికంగా వ్యతిరేకమయినవిపెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తి ప్రాధమికం; సమిష్టి ద్వితీయం. సౌఖ్యం ప్రాధమికం; శాంతి ద్వితీయం. అందుకే, పెట్టుబడీదారీ వ్యవస్థలో సౌఖ్యాలు పెరిగేకొద్దీ  ప్రశాంతత అనేది లోపలా, బయటా ఎండమావిగా మారిపోతుంది.


          క్రైస్తవం, జుడాయిజంహిందూయిజం సహా దాదాపు అన్ని మతాలూ క్రమంగా పెట్టుబడీదారీ వ్యవస్థకు లొంగిపోయాయి. గతంలో తమ మధ్య కొనసాగిన  సాంస్కృతిక వివాదాల్ని సర్దుకుని, ఒక విధంగా పెట్టుబడీదారీ వ్యవస్థకు ప్రమోటర్లుగా మారిపోయాయి. అందువల్ల, ప్రస్తుతం సామ్రాజ్యవాదం అంటే సాంస్కృతికంగా ఇస్లామేతర మతాలు అనుకున్నా తప్పుకాదు. ప్రపంచ పటం మీద, పెట్టుబడీదారీ వ్యవస్థతో ఆదినుంచీ రాజీలేని పోరాటం చేస్తున్నది ముస్లింలే. కొన్ని సందర్భల్లో కేవలం అక్షరాల యుధ్ధంగానూ, మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలకు తెగించిన అయుధాల యుధ్ధంగానూ ఇది కొనసాగుతూనేవుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచ మతాలు రెండు శిబిరాలుగా చీలిపోయాయి. ఒక శిబిరం సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. రెండో శిబిరం సామ్రాజ్యవాదాన్ని సమర్ధిస్తుంది. మొదటిది ముస్లింలది. రెండోది ముస్లిమేతరులది.

          వర్తమాన సమాజంలోపెట్టుబడీదారీ దేశాల కూటమికీ, ముస్లిం దేశాలకూ మధ్య సాగుతున్న ఘర్షణకు మూలం రాజకీయార్ధికమే. సామ్రాజ్యవాదం నిలబడేదే ఫైనాన్స్కేపిటల్మీదవడ్డీ తినకుండా ఫైనాన్స్కేపిటల్ఒక్క క్షణం కూడా బతకలేదు; మరుక్షణం చచ్చిపోతుందివడ్డీని అంతం చేయడమే ఇస్లాం ధార్మిక లక్ష్యం.

          వడ్డీని అంతం చేసేవాళ్ళే తననూ అంతంచేస్తారని సామ్యాజ్యవాదానికి కూడా స్పష్టంగా తెలుసు. అందుకే ఇస్లాంను సామ్యాజ్యవాదం ధార్మిక శత్రువుగా భావిస్తుంది. అమెరికాపై  ఆర్ధిక మాద్యం విరుచుకుపడుతుందనీపేదరికం పెరిగిపోతుందనీ తెలిసినా సరే, సీనియర్బుష్‌, జూనియర్బుష్షులు గల్ఫ్ యుధ్ధానికి వెనుకాడలేదుఅంపశయ్యపైవున్న సామ్రాజ్యవాదాన్ని, ప్రాణరక్షణ మందులు పోసైనా సరే, మరికొంతకాలం బతికించుకోవాలనే తాపత్రయంతోనే వాళ్ళు, గల్ఫ్ యుధ్ధాల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. చావు భయంతోనే సామ్రాజ్యవాదం, ఇస్లాంపైధార్మిక పోరాటం చేస్తుంది

          సోవియట్రష్యా పతనం తరువాత ఏకధృవ ప్రపంచం ఏర్పడిందని కొందరి భావన. కమ్యూనిస్టు అనుకూలురు, వ్యతిరేకులు కూడా ఏకధృవ ప్రపంచ సిధ్ధాంతంపై ఏకాభిప్రాయంతో వుండడం విశేషం. నిజానికి ఏకధృవ ప్రపంచం అనేది, సామ్రాజ్యవాదానికి పెద్దన్నగావున్న, అమెరికా స్వీయకోరిక మాత్రమే. ప్రపంచం ఎప్పుడు రెండు ధృవాలుగానే వుంది. సామ్రాజ్యవాదానికి ప్రత్యర్ధిగా ఎప్పుడూ ఇస్లాం వుంటూనేవుంది.

          పెట్టుబడీదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన కమ్యూనిజం చేసిన హోరులోముస్లింల పెట్టుబడీదారీ వ్యతిరేక పోరాటాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక  పోరాటాలు దాదాపు శతాబ్దకాలం మరుగున పడిపోయాయి. 1980 దశకం చివర్లో సాగిన తూర్పు యూరోపు పరిణామాలు, 1990 దశకం ఆరంభంలో సోవియట్రష్యా పతనం తరువాతే, మళ్ళీ ముస్లింల సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు వెలుగులోనికి వచ్చాయి.

          సరిగ్గా కాలంలోనే పౌలో కోయిల్హో ఆల్కెమిస్ట్రాశాడు. తూర్పు యురోప్లో పరిణామాలు వేగంగా సాగిపోతున్న 1988లో, పోర్చుగీసు భాషలో ఆల్కెమిస్ట్తొలి ప్రచురణ వచ్చింది. అప్పట్లో దానికి అంతగా గుర్తింపు రాలేదు. రష్యా పతనం తరువాత 1993లో వచ్చిన ఇంగ్లీషు అనువాదం, సహజంగానే, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కమ్యూనిస్టుల తరువాత, ప్రపంచంలో  అణిచివేయాల్సింది ఇక ముస్లింలనే అనే సామ్రాజ్యవాదుల అంతర్జాతీయ వ్యూహం నవల రచనకు నేపథ్యం.

          అంతర్జాతీయ వేదికల మీద ముస్లింలపై సాగుతున్న సాంస్కృతిక దాడికి భారత దేశంతో కూడా సంబంధం వుంది. 1989లో ఎల్‌.కే. అద్వానీ నాయకత్వంలో  సంఘ్పరివార్‌  చేపట్టిన స్వర్ణజయంతి రథయాత్ర, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కాలంలోనే జరగడం కేవలం యాధృచ్చికం అయితేకాదు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలోనే భారతదేశంలో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి.


          చంపదలుచుకున్న కుక్కను పిచ్చిది అనాలన్నట్టు, ముస్లిం సమాజంలో సహజాతంగా వుండే సామ్రాజ్యవాద వ్యతిరేకతను కప్పిపుచ్చి, వాళ్ల మీద సాంస్కృతిక దాడి చేస్తాయి సామ్రాజ్యవాద మతాలు. ఆల్కెమిస్ట్నవలలో, పౌలో కోయిల్హో, సరిగ్గా కర్తవ్యాన్నే నిర్వహించాడు.

          స్వర్గం అనేది మనుషుల కాళ్ల కిందే వుంటుందనేది ఒక ధార్మిక వ్యక్తీకరణ. అంటే, ధార్మిక ఆచరణ ద్వార మనుషులు తమ జీవితాలను స్వర్గమయం చేసుకోవచ్చు అనేది దీని భావంకాళ్ల కింద స్వర్గాన్ని వుంచుకుని దానికోసం ప్రపంచమంతా కాళ్ళు అరిగేలా తిరిగే మనుషుల కథలు పౌరాణిక సాహిత్యంలో  అనేకం వున్నాయి.

                    కథాంశంలోనూ, కథనంలోనూ ఆల్కెమిస్ట్‌’ మహత్తర రచన ఏమీకాదు. పౌలో కోయిల్హోను సమర్ధుడైన రచయిత అనడంకన్నా నిబధ్ధత కలిగిన మతప్రచారకుడు అనవచ్చు. ’అరేబియా రాత్రుళ్ళుకథల్లో, 352 రాత్రి చెప్పిన కథ - రూయిన్డ్ మ్యాన్ హూ బికేమ్ రిచ్ అగైన్ త్రూ డ్రీమ్- (రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ సేకరణ, అనువాదం నాలుగవ సంపుటం) ('The Ruined Man Who Became Rich Again Through a Dream' -by  Richard Francis Burton) పౌలో కోయిల్హో  ’ ఆల్కెమిస్ట్‌’ కు మూలం.

          బాగ్దాద్లో బతికి చెడిన చిరు వ్యాపారికి కైరోలో ఒక చోట నిధి వున్నట్టు రోజూ ఒక కల వస్తూవుంటుంది. నిధిని వెతుక్కుంటూ అతను కైరో వెళతాడు. అక్కడ చేయని నేరానికి జైలు శిక్షను అనుభవిస్తాడు. కలలో కనిపించిన నిధిని వెతుక్కుంటూ వచ్చానని చెపితే కారాగారం అధికారి నవ్వుతాడు. తనకు కూడా బాగ్దాద్లోని ఇంట్లో నిధి వున్నట్టు రోజూ కల వస్తున్నదని చెపుతాడు. బాగ్దాద్లోని తన ఇల్లే కైరో కారాగారం అధికారికి కలలో కనిపిస్తున్నదని చిరు వ్యాపారికి అర్ధం అవుతుందిఇంతకాలం తన ఇంట్లోనే వున్న నిధిని అందుకోవడానికి బాగ్దాద్కు తిరుగు ప్రయాణం కడతాడు.

          మనిషి తాను వున్న చోటనే స్వర్గాన్ని నిర్మించగలడని చెప్పడానికి, పదమూడవ శతాబ్దంలో సూఫీ తత్వవేత్త  జలాల్ ఉద్దీన్ ముహమ్మద్   రూమీ కూడా ఇలాంటి కథలనే తరచూ చెప్పేవాడు. రూమీ రాసిన  మస్ నవీ కావ్యంలోఇన్ బాగ్దాద్ డ్రీమింగ్ ఆఫ్ కైరోఇన్ కైరో డ్రీమింగ్ ఆఫ్ బాగ్డాద్’ ( In Baghdad, Dreaming of Cairo: and vice-versa) అనే కథవుంది. క్రైస్తవ పునరుజ్జీవన దశలో, అరేబియన్ రాత్రులు కథలు భాషాంతరంమతాంతరం చెందాయి. అర్జెంటీనా కు చెందిన సుప్రసిధ్ధ స్పానిష్ రచయిత జార్జ్లూయిస్బోర్జెస్‌ ’టేల్ఆఫ్టూ డ్రీమర్స్‌’(1935)  (Tale of two dreamers by Argentine writer Jorge Luis Borges) కథను రాశాడు. కథే ఆల్కెమిస్ట్కు తక్షణ ప్రేరణ. భారతదేశంలో, జైన, బౌధ్ధ దేవాలయాలు తరువాతి కాలంలో హిందు దేవాలయాలుగా మారిపోవడాన్ని మనం కొన్ని చోట్ల చూస్తున్నాం. పశ్చిమదేశాల సాహిత్యంలో ఇప్పుడు పౌలో కోయిల్హో వంటి రచయితలు సరిగ్గా పనే చేస్తున్నారు. సామ్రాజ్యవాదుల మతంగా మారిన క్రైస్తవం పక్షాన నిలబడి, ముస్లింల పౌరాణిక కథతోముస్లింల మీద సాంస్కృతిక దాడి చేయడంలోనే పౌలో కోయిల్హో తెలివి అంతా ఇమిడి వుంది.

          ఆర్య సాంప్రదాయంలో రామలీల చేస్తారు. అందుకు విరుధ్ధంగా ద్రావిడ సాంప్రదాయంలో రావణలీల చేస్తారు. అందుకే, రావణ్వంటి సినిమా కథ మణిరత్నం వంటి తమిళులకే తట్టే అవకాశాలు ఎక్కువ. ఎన్టీరామారావు తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా సీతారామా కళ్యాణం. అందులో రావణాసురుడ్ని రావణ బ్రహ్మగా మార్చడమేగాక ప్రతినాయక పాత్రను ఎన్టీ రామారావు ఇష్టపడి పోషించారు. ఇది గాల్లో నుంచి వచ్చిన అలోచనకాదుత్రిపురనేని రామస్వామి చౌదరి సూతాశ్రమ  ప్రభావంవున్న గుడివాడ తాలుకాలో ఎన్టీ రామారావు పుట్టారు. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్.వీ. రామస్వామి నాయకర్కార్యక్షేత్రమైన తమిళనాడులో ఎన్టీ రామారావు పెరిగారు. రెండు ప్రభావాలే వెండితెరపై రావణబ్రహ్మ ఆవిష్కరణకు దారితీశాయి. అదేవిధంగా, పౌలో కోయిల్హోకున్న స్పెయిన్ అనుబంధమే ఆల్కెమిస్ట్‌’ రచనకు దారితీసింది. స్పెయిన్ లో అతను కేథలిక్కుల పవిత్ర యాత్రా మార్గమైనవే ఆఫ్ సేయింట్ జేమ్స్గుండా స్వయంగా ప్రయాణించి 'శాంటియాగో డి కంపోస్టెలా' చేరుకున్నాడు

          క్రీస్తు శకం 712 నుంచి 1492 వరకు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు స్పెయిన్ను ముస్లింలు పాలించారు. స్పానిష్భాషా, సంస్కృతుల్లో, శిల్పకళా రీతుల్లో అన్నింటా అరబ్బిక్సాంప్రదాయం ఇప్పటికీ కనిపిస్తుంది. 1492 తరువాత కేవలం 120 సంవత్సరాల కాలంలో స్పెయిన్లో ముస్లింలు అంతరించిపోయారు. నిజానికి 16 శతాబ్దంలో అప్పటి నాగరీక దేశాలన్నీ ముస్లింల పాలనలోనే వున్నాయికాన్స్టాంటినోపుల్ను అట్టోమన్టర్కులు పాలిస్తున్నారు. బాల్కన్ద్వీపకల్పం కూడా వాళ్ల ఆధీనంలోనే వుంది. ఈజిప్టును మమ్లూక్స్పాలిస్తున్నారు. పర్షియా అబ్బాసీల ఆధీనంలో వుంది, భారత ఉపఖండాన్ని  మొఘల్లు పాలిస్తున్నారు. వివిధ దేశాల్లో ముస్లింల వైభవం ఇంతగా సాగుతున్న కాలంలోనే స్పెయిన్లో మాత్రం ముస్లింలు మొత్తంగా అంతరించిపోవడం చరిత్రలో ఒక విచిత్రం. విచిత్రాన్ని సాధించడానికి అక్కడి యూదు, క్రైస్తవ  సామాజికవర్గాలు   పధ్ధతుల్ని ప్రయోగించాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే.

          ఆధునికతపట్ల భిన్నాభిప్రాయాల కారణంగా, అనేక దేశాల్లోని పాలక సామాజికవర్గాలకు ముస్లింలు కొరకరాని కొయ్యలుగా కనిపిస్తారుముస్లింలను అణిచివేయాలనుకున్న పాలక సామాజికవర్గాలన్నీ 16 శతాబ్దపుస్పెయిన్ప్రయోగాన్నిఅధ్యయనం చేస్తుంటాయి. విధంగా, ‘స్పెయిన్ప్రయోగం అనేది అనేక దేశాల్లో ముస్లింల అణిచివేతకు ఒక సాధనంగా మారింది. ఇజ్రాయిల్ఇంటెలిజెన్స్ఏజెన్సీ మొస్సద్నిరంతరం స్పెయిన్ప్రయోగాన్ని అధ్యయనం చేస్తూ దానికి ఆధునిక రూపాలను కనిపెడుతూ వుంటుంది. వాటిని వివిధ దేశాల్లోని  ముస్లింవ్యతిరేక సామాజికవర్గాలకు పంపిణీ చేస్తూవుంటుంది. బాగ్దాద్చిరువ్యాపారిని తీసుకొచ్చి, స్పెయిన్కు చెందిన అండలూసియన్గొర్రెల కాపరిగా  మార్చినప్పుడే పౌలో కోయిల్హో నవల ఎత్తుగడదాని లక్ష్యం స్పష్టం అయిపోయింది. నవలలో మిగిలిన కథనం అంతా ఒక లాంఛనమే!

          ”మీరు ద్రవాధునికతకు అనుకూలమా? ప్రతికూలమా?” అనే ప్రశ్న చంద్ర వ్యాసం అంతటా పాఠకులకు అంతర్లీనంగా వినిపిస్తూ వుంటుంది. ప్రశ్నను మనంవర్తమాన సమాజంలో ముస్లింల పక్షమా? లేక ముస్లింవ్యతిరేకుల పక్షమా?” అని కూడా అర్ధం చేసుకోవచ్చు. దీనికి ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెప్పుకునే అవకాశం ఎలాగూ  వుంటుంది. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి మతాలు వారివి. "లకుమ్దీనికుమ్ వలియ దీన్".

(రచయిత సీనియర్జర్నలిస్టు, సామాజిక కార్యకర్త)

404,స్కిల్ప్రెసిడెన్సీ
హైదరాబాద్
1ఫిబ్రవరి 2011

 ప్రచురణ : ది సండే ఇండియన్ 21 ఫిబ్రవరి - 6  మార్చ్ 2011


No comments:

Post a Comment