Friday 14 June 2013

Book Review : 'On Communalism' BY K Balagopal

మతతత్వంపై పాతికేళ్ళ పోరు
. యం. ఖాన్యజ్దానీ ( డానీ)

          ప్రతి ఉద్యమంలో అంతర్గతంగా రెండు సమూహాలు వుంటాయి. ఒకటి కార్యకర్తలది. ఇంకోటి ఆలోచనాపరులదికార్యక్షేత్రాల రీత్యా రెండు సమూహాలమధ్య నిరంతరం ఒకరకమైన  ప్రఛ్ఛన్న యుధ్ధం సాగుతూవుంటుంది. నిజానికీ వీళ్ళిద్దరూ లేకుండా ఉద్యమం కూడా ముందుకు సాగదుకార్యకర్తలు లేకపోతే అసలు ఉద్యమాలే మొదలుకావు. మేధావులు లేకపోతే ఉద్యమాలకు దశ-దిశ అర్ధంకాదు. కష్టపడేది తామైతే కీర్తి ప్రతిష్టలు మేధావులకు దక్కుతున్నాయని కార్యకర్తలు అసంతృప్తితో వుంటే, బండచాకిరీ చేస్తారుగానీ, భూతభవిష్యత్తుల గురించి కార్యకర్తలు  బొత్తిగా పట్టించుకోరని మేధావులు  అసహనంతో వుంటారు. చాలాచాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే రెండు సమూహాల మధ్య సయోధ్య సాధ్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అలాంటి అరుదైన సయోధ్య పేరే బాలగోపాల్‌.

          బాలగోపాల్ మేధావుల్లో కార్యకర్త. కార్యకర్తల్లో మేధావి. కొత్తగా ముందుకు వచ్చిన ఒక సమస్యపట్ల సమాజంలోని అట్టడుగుశ్రేణులు ఏమనుకుంటున్నాయో తెలిసుకోవాలనుకుంటే మేధావులు బాలగోపాల్వైపు చూసేవారు. మరోవైపు, తమ ఉద్యమాలపట్ల మేధావుల ఆలోచనలు ఎలావున్నాయో తెలుసుకోవాలంటే అట్టడుగుశ్రేణులు కూడా బాలగోపాల్వైపే చూసేవారు. ”బాలగోపాల్అయితే ఎలా ఆలోచించి వుండేవాడు?” - అనేది గత ఏడాదిన్నర కాలంగా మనకు అలవాటవుతున్న కొత్త  ఆచారం.

          మతం వేరు. మతతత్వం వేరు. చాలా మంది రెండింటి మధ్య తేడాను గమనించరు. ఇందులో మొదటిది భావోద్వేగాలకు, నమ్మకాలకు సంబంధించినది. రెండోది ప్రధానంగా రాజకీయార్ధికానికి సంబంధించింది. తిరుమల తిరుపతి దేవస్థానందర్గా కమిటీలు, మసీదు కమిటీలు, చర్చి కమిటీలు వంటివి కేవలం  మతసంస్థలు. రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్వంటివి మతతత్త్వ సంస్థలు.  (పోటీ కోసం కొందరు జమాతే ఇస్లామ్ను మతతత్వ సంస్థ అంటుంటారుగానీ, దానికీ సంఘ్పరివార్కార్యకలాపాలకు పరిధిలో, విస్తృతిలో పొంతనలేదు.)

          ప్రకృతికి సంబంధించిన అపోహలే గణ వ్యవస్థలో కర్మకాండగా వుంటాయి. అవి తరువాత వర్గవ్యవస్థలో వ్యవస్థీకృతమై మతంగా మారుతాయి. పెట్టుబడీదారీ వ్యవస్థలో, మతం పెట్టుబడీదారుల్ని బలపరచడానికి  మతతత్వరూపం దాలుస్తుందిమతం నేరుగా పెట్టుబడీదారుల్ని బలపరస్తుంటే ప్రజలు ఒప్పుకోరు. అందుకనిసాంప్రదాయ మతప్రయోజనమైన మోక్షం స్థానంలో, దేశభక్తి అనే కొత్త సాంప్రదాయాన్ని మతతత్వం ప్రవేశపెడుతుంది. అప్పటికీ మార్కెట్ప్రయోజనాలు నెరవేరకుంటే మతతత్వం సాయుధం అవుతుంది. లష్కరే తోయిబా, జైషే  మహమ్మద్‌, అభినవ భారత్ (స్వామి ఆసిమానంద్, సాధ్వీ రితుంబర, ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌) వంటివి సాయుధ మతతత్వ సంస్థలు. వీటినే మత ఉగ్రవాదం అంటున్నాం.

          తొలినాటి కర్మకాండల్నీ, వ్యవస్థీకృత మతాల్నీ, పెట్టుబడీదారీ మతతత్వాన్నీ విశ్లేషించే  రచనలు అనేకం వున్నాయి. ప్రపంచ మార్కెట్లో కమ్యూనిస్టు శిబిరం బలహీనపడిపోయి, సరళీకృత ఆర్థిక  విధానం బలపడి, రాజ్యాన్ని శాసించే స్థాయికి  మార్కెట్ఎదిగిన దశలో, కొత్త వ్యవస్థను  సమర్ధించేందుకు మతతత్వం తీసుకున్న కొత్త రూపాన్ని అర్ధం చేసుకోడానికీ, దాన్ని మార్చడానికీ పాత పనిముట్లు పనికిరాకుండాపోయాయి. దశలో, శిధిలమైపోయిన పాతపనిముట్లను పక్కన పడేసి, వాటి స్థానంలో, కొత్తపనిముట్లను తయారు చేసేందుకు ఉపక్రమించిన వాళ్లలో నిస్సందేహంగా బాలగోపాల్అగ్రగణ్యుడు.

          కోవలో బాలగోపాల్రాసిన తొలివ్యాసందేశభక్తి’ (1983) లోనే, సంఘ్పరివారాన్ని ఫ్యూడల్హిందూత్వ సంస్థగాగాక ఫాసిస్టు హిందూ జాతీయవాద సంస్థగా  నిర్ధారిస్తాడు. అది ముస్లింలు, క్రైస్తవులకు ఎంత శత్రువో, అంతర్జాతీయవాదులకు, మానవతావాదులకు, శ్రామికులకు కూడా అంతే శత్రువని హెచ్చరిస్తాడు

          బాలగోపాల్అనుసరించే విశ్లేషణ విధానం, సరళంగా, సూటిగా, అత్యంత ప్రజాస్వామికంగా వుంటుందిప్రతి సందర్భంలోనూ, ఆయన, బాధితుల పక్షాన నిలబడి కొత్త పరిణామాల్ని విశ్లేషిస్తాడు. అందువల్ల బాలగోపాల్అభిప్రాయాలతో విబేధించేవారు సహితం ఆయన అనుసరించే బాధిత-పక్షపాతాన్ని నిరాకరించలేరు.

          మార్కెట్స్వభావంలో వచ్చిన మార్పుల్నీ, దానికి అనుగుణంగా మతతత్వంలో వచ్చిన మార్పుల్నీ ఇప్పుడు అర్ధం చేసుకుంటున్నంత సులువుగా ఇరవైయేళ్ల క్రితం అర్ధం చేసుకోవడం సాధ్యం అయ్యేదికాదు. అద్వానీ  స్వర్ణజయంతి రథయాత్రను లాలూ ప్రసాద్అడ్డుకున్న తరువాత చారిత్రక సందర్భాన్ని అర్ధం చేసుకోడానికి వ్యాసకర్త బాలగోపాల్ను సంప్రదించాడు. దాని ఫలితమేహిందూ మత రాజ్యంవ్యాసం.

          బాలగోపాల్పాతికేళ్లకుపైగా మతతత్వంపై తిరుగులేని పోరాటం చేశాడు. చనిపోవడానికి మూడు నెలలు ముందు రాసినఆదివాసీ సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలను తిరస్కరిద్దాంఅనే  వ్యాసంలోనూఆదివాసి సమాజాన్ని తమ అదుపులోనికి తెచ్చుకోవడం కోసం, దానిని రెండు వర్గాలుగా చీల్చి, ఘర్షణలుపెట్టి, హింసను రెచ్చగొట్టడానికి ...” సంఘ్పరివార్చేస్తున్న ఆగడాలను వివరిస్తాడు.

          మతతత్వాన్ని విశ్లేషించే సమయంలో, బాలగోపాల్ ఒక్క అంశానికే పరిమితంకాడురాజ్యం, న్యాయవ్యవస్థ, శిక్షాస్మృతి, ధర్మం, చట్టం, చరిత్ర రచన, విద్యావ్యవస్థ, రాజకీయాలు, టెర్రరిజం, ఆదివాసీ పోరాటలు, సల్వాజుడుం తదితర సామాజిక వ్యవస్థలన్నింటిలోనూ లీనమైపోయిన మతతత్వాన్ని మనకు పట్టి చూపిస్తాడు. కేంద్ర మంత్రి చిదంబరంశాఫ్రాన్టెర్రరిజంఅనడానికి పన్నెండేళ్ల ముందే బాలగోపాల్ ప్రమాదాన్ని పసికట్టాడు. ”మిగిలిన టెర్రరిస్టు బృందాలు రహాస్యంగా పనిచేస్తాయి. పోలీసు దాడులకూ, సైన్యం దాడులకు గురవుతాయి. వారి పధ్ధతుల మంచిచెడులు ఎలావున్నా, వారిలో కొందరి లక్ష్యాలలో ఆమోదనీయమైన అంశాలు వున్నాయి. కానీ, సంఘ్పరివార్టెర్రరిస్టులు బహిరంగంగా పనిచేసే టెర్రరిస్టులు. ’చట్టబద్దంగాఅధికారం చేపట్టిన టెర్రరిస్టులు. పోలీసులు, సైన్యం వీరి ఆధీనంలో వున్నాయి. వీరి లక్ష్యాలలో ఆమోదనీయమైనది కోశానా లేదు”. అంటూ ప్రకటిస్తాడు.

          మన కళ్ల ముందు జరుగుతున్న పరిణామాల్ని అర్ధం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది.

మతతత్వంపై బాలగోపాల్
పేజీలు 302  ధర రూ. 150/-
ప్రచురణ : హైదరాబాద్బుక్ట్రస్ట్

90102 34336

హైదరాబాద్‌, 6 మార్చి 2011

ప్రచురణ : ఆంధ్రజ్యోతి మార్చి,  2011






No comments:

Post a Comment