JNJ MAC Housing Society సభ్యులకు *రెండు సూచనలు*
మన సొసైటీకి మొదట్లో వేరే పేరు వుండేది. అప్పట్లో
రాత్రీంబవళ్ళు ఆ కసరత్తు చేసిన వారిలో నేనూ ఒకడ్ని.
అప్పట్లో వైయస్ రాజ శేఖర రెడ్డి నాయకత్వంలో
కాంగ్రెస్ ప్రభుత్వం వుండడంతో వారికి అనుకూలంగా మన సొసైటీ పేరు *జవహర్ లాల్ నెహ్రు*
జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ గా మారింది. దరఖాస్తుదారుల్లో అర్హులకు సీనియారిటీని బట్టి 700 మందికి ఆ
విడతలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనేది నిర్ణయం. అలా ఎకరాకు 10 మంది చొప్పున లెఖ్ఖలు
కట్టి 700 మందికి 70 ఎకరాలు మన సొసైటీకి కేటాయించింది అప్పటి ప్రభుత్వం.
మిగిలినవారిని తదుపరి
విడతలో ఇస్తారనేది అవగాహన. లబ్దిదారుల సంఖ్య ఏదశలో ఏ సమావేశంలో ఎవరి ఆధ్వర్యంలో ఏ
నిర్ణయం ప్రకారం 1100 మందికి చేరిందో నాకు
తెలీదు.
ఈ 14 సంవత్సరాల్లో
కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త పార్టి అధికారంలోనికి వచ్చింది. ఈ కాలంలో పాత జాబితాలో మిగిలినవారేకాక, కొత్తగా సీనియర్ జర్నలిస్టులుగా మారినవారు చాలా
మంది వచ్చారు. వాళ్ళకూ ఇళ్ళ స్థలాలు కావాలన్నది న్యాయమైన కోరిక. కొత్త స్థలం కేటాయింపు
కోసం కొత్త సొసైటీ వాళ్ళు చేసే ప్రయత్నాలకు మన సొసైటీ పూర్తి సంఘీభావాన్ని
తెలపాలి.
కొత్త హౌసింగ్
సొసైటీకి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టమైన నాయకుని పేరు పెట్టుకుంటే మంచిది. (మనం
అప్పట్లో జవహర్ లాల్ నేహ్రూ పేరు పెట్టుకున్నట్టు). ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఒక ఆప్షన్.
నేరుగా *కేసిఆర్* పేరు పెడితే ఇంకా బాగుంటుంది
అనుకుంటున్నాను. *కేసిఆర్*
జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (KCR JMAC
co-op Housing Society Limited).
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
కాలంలో వైయస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్
జర్నలిస్టులకు 70 ఎకరాలు ఇచ్చారు;
ఇప్పుడు కేసిఆర్ తెలంగాణ జర్నలిస్టుల కొత్త సొసైటీకి 100 ఎకరాలకు పైగా ఇస్తారని నేను
నమ్ముతున్నాను.
*జవహర్ లాల్ నెహ్రు
జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్*, *కేసిఆర్
జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడేడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్* అనేవి
రెండూ వేరు వేరు సంస్థలు. ఈ విషయంలో కొత్తాపాత జర్నలిస్టులు అందరికీ ఒక స్పష్టత వుండాలి. ఈ రెండు సొసైటీలను విలీనం
చేసే ప్రయత్నాలుగానీ, సమన్వయం చేసే ప్రయత్నాలుగానీ ఎవరయినా ప్రతిపాదిస్తే, ఇళ్ళ కేటాయింపు
సమస్య పరిష్కారంకాకపోగా అనేక కొత్త
చిక్కులు వస్తాయి. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందిందిగా మన సొసైటీ పాలకవర్గాన్నీ,
కోర్ కమిటీని, సభ్యుల్ని కోరుతున్నాను.
మీ
*డానీ*
No comments:
Post a Comment