*Muslim Ten Commandments*
*ముస్లింల ముందు 10 కర్తవ్యాలు*
25 ఫిబ్రవరి 2023
1.
భారత ముస్లిం గుడ్ విల్ ను, ఆమోదాంశాన్ని పెంచడానికి కృషిచేయాలి.
2.
సమాజంలో ముస్లింల మీద కొనసాగుతున్న అసహన వాతావరణాన్ని
తొలగించడానికి హిందూ-ముస్లిం సమాజాల మధ్య మత సామరస్యాన్ని పటిష్టం చేసేందుకు కృషిచేయాలి
3.
భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక మతసామరస్య ఆదర్శాలను
పరిరక్షించుకోవడానికి నిరంతరం కృషిచేయాలి.
4.
సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ఫాతిమా
షేక్ వంటి ముస్లిం జాతీయ నాయకుల ఆలోచనా విధానాలను ప్రచారం చేయాలి.
5.
ప్రధాన స్రవంతీ
మీడియాతోపాటూ సోషల్ మీడియాల్లోనూ నిరంతరం
వుధృతంగా కొనసాగుతున్న ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి.
ప్రత్యేకంగా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అన్ని భాషల్లో ముస్లింలకు స్వీయ మీడియా
సంస్థలు కావాలి.
6.
ప్రస్తుతమున్న కార్పొరేట్ నిరంకుశత్వానికి మతతత్త్వ లక్షణం కూడ వుండడంతో దీనికి ప్రధాన బాధితులు ముస్లింలే.
అయినప్పటికీ తరతమ స్థాయిలో దీని బాధిత సమూహాలు
అనేకం వున్నాయి. ఈ సమూహాలన్నింటి మధ్య ఒక సామాజిక ఐక్యతను సాధించడానికి ముస్లింలు అంకిత భావంతో పనిచేయాలి.
7.
కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ పాలనను పార్లమెంటరీ ప్రాతినిధ్య
ప్రజాస్వామిక విధానంలో ఓడించడానికి విపక్షాలన్నింటి మధ్య రాజకీయ ఐక్యతను సాధించడానికి
మనవంతు కృషిచేయాలి. ప్రజాసంఘాలు, పౌరసమాజం
పరిధుల్నిదాటి రాజకీయ జోక్యం చాలా అవసరం అని గుర్తించాలి.
8.
భారత ముస్లిం సమాజం పత్రికలు చదివేలా, టివీ -న్యూస్ ఛానళ్ళు
చూసేలా ప్రోత్సహించాలి. ఆధునిక విద్య ఒక్కటే జీవన ప్రమాణాలను పెంచుతుందనే భావాన్ని
ముస్లిం సమాజంలో పెంపొందించాలి.
9.
ప్రతి ముస్లిం ప్రాంతీయ భాషల్లో నైపుణ్యాన్ని సాధించేలా, సామాజిక ఉద్యమాల్లో, సంఘ సేవల్లో చురుగ్గా పాల్గొనేలా
అవగాహనను పెంచాలి.
10. పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాల్లో
వున్న ముస్లింలు సరసమైన ధరకు నాణ్యమైన సేవలు అందించేలా ప్రత్యేక శ్రధ్ధతీసుకోవాలి.
ఏయం ఖాన్ యజ్దానీ
(డానీ)
కన్వీనర్,
*ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*
25 February 2023
No comments:
Post a Comment