“దేవుడే నా న్యాయమూర్తి”
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Tuesday, 28 February 2023
God is my Judge
God is my Judge
కాలేజీ రోజుల్లో
నన్నెవరూ రాగింగ్ చేయలేదు. అప్పటికే నేను ఓ చిన్నసైజు స్ట్రీట్ ఫైటర్ ని
అనిపించుకుంటున్నాను. ఆ తరువాతి రోజుల్లో ఓ రాత్రి ఓ ఫ్రెండ్స్ మీట్ లో ఒకడు తన
ఎత్తును అడ్వాంటేజ్ గా తీసుకుని ఏదో ఒక వంకతో నన్ను ఎగతాళి చేయడం మొదలెట్టాడు.
నేను లేచి కూర్చున్న ఇనప కుర్చీని మడత పెట్టి శక్తికొద్దీ వాడి కాళ్ళ మీద
కొట్టాను. అతను ముందు ఎముకల డాక్టరు దగ్గరకు వెళ్ళి పట్టు వేయించుకుని మరునాడు
పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టాడు. నేను ఐదు అడుగుల మూడు అంగుళాలు. అతను ఆరు
అడుగులు. ఒకడ్ని కొట్టడానికి ఎత్తుతో పనిలేదని అర్ధం అయ్యి చాలా ధైర్యం
వచ్చేసింది. అప్పటి నుండి “Danny is not my name; it’s my attitude” అనడం
మొదలెట్టాను.
అన్నట్టు డానీ అనే
పేరు క్రైస్తవ సమాజంలో తరచుగా వినపడుతుండడం వల్ల నన్ను తొలి పరిచయంలో చాలామంది
క్రైస్తవుడ్ని అనుకోవడం సహజం. డేనియల్ అనే వారు క్రైస్తవులకు, ముస్లింలకు (دانيال) ఉమ్మడి ప్రవక్త.
బహుశ యూదులకు కూడ వారు ప్రవక్తకావచ్చు. డేనియల్ ప్రవక్త సింహాలతో గుహలో
వున్నారని అంటారు. “దేవుడే నా న్యాయమూర్తి” అనేది డేనియల్ ప్రవక్త
ప్రవచనం.
నిజాం సంస్థానానికి
చెందిన దక్కన్ చరిత్రకారుడు గులాం యజ్దానిగారి ప్రేరణతో నాకు యజ్దానీ అని పేరు
పెట్టారు. యాజ్దాన్ మూలం పురాతన కుర్దుల్లో వుందంటారు. కుర్దూలు ఎవరూ? అంటే మళ్ళీ
అదో కత.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment