మూడు యుధ్ధనీతులు
నాకు ఎవరెవరు బోధించారో. ఎలా ఎలా ఉపదేశించారో ఇప్పుడు వివరంగా చెప్పలేనుగానీ వారి మాటల సారం నా మనసులో బలంగా నాటుకుపోయింది. అదేమంటే.
1. నీకు తెలియాల్సింది నీ బలం గురించి మాత్రమేకాదు; నీ బలహీనతలూ నీకు కఛ్ఛితంగా తెలియాలి.
2. శత్రువుతో తలపడాల్సినప్పుడు నీ శక్తిని తక్కువగా అంచనా వెయ్యి; ప్రత్యర్ధి శక్తిని ఎక్కువగా అంచనా వెయ్యి.
3. యుధ్ధరంగంలో ద్రోహుల్ని, గుంటనక్కల్ని దరిదాపుల్లోనికి కూడ రానియ్యకు. వాళ్ళు నీ శత్రువులకన్నా ప్రమాదకారులు.
రాత్రి ఒకరు ఫోన్ చేస్తే మాటలు నమలకుండా ఒక మాట చెప్పాను "నువ్వు గుంటనక్క" అని. ఇలా అన్నందుకు నేను ఎన్నడూ చింతించను.
No comments:
Post a Comment