Manefesto of BSVP : Old Wine in a New Bottle
బహుజన శ్రామికవర్గ ప్రజాస్వామిక ప్రణాళిక :
కొత్తసీసాలో పాతసారా
బహుజన పొలిటికల్ సెంటర్ రెండు మూడు రోజుల క్రితం *'బహుజన శ్రామికవర్గ ప్రజాస్వామిక ప్రణాళిక' ముసాయిదా* ను ప్రచురించింది. 48 పేజీల ఆ ముసాయిదా ప్రణాళీకను సిపిఐ ఎంఎల్ (ప్రజాపోరు) రాష్ట్ర నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు ‘భారత్ బచావో’ వాట్స్ అప్ గ్రూపులో చర్చకు పెట్టారు.
ఇప్పుడున్న అన్నిరకాల కమ్యూనిస్టు, బహుజన పార్టీలు భారత సమాజ స్వభావాన్ని నిర్ధారించడంలోనే ప్రాధమిక తప్పులు చేశాయనీ, అలాంటి తప్పుడు నిర్ధారణలతో అవి ఎప్పటికీ మన సమాజాన్ని మార్చలేవు అని ఈ ప్రణాళిక ఒక చోట చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా ప్రకటించింది. (ఆరవ అధ్యాయం మొదటి పేరా; పేజీ 18.). అయితే, ఈ ప్రణాళిక రచయితలు కూడ పాతవాళ్ల అడుగుజాడల్లోనే నడిచి భారత సమాజ స్వభావాన్ని నిర్ధారించడంలో తమ వంతు ప్రాధమిక తప్పులు అనేకం చేశారు.
భారతదేశం *వర్ణ సమాజం* అనే అభిప్రాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1924లో అంబేడ్కర్ ‘బహిష్కృత హితకారిణి సభ’ను ఆరంభిస్తూ భారత దేశాన్ని *కుల సమాజం* అని నిర్ధారించాడు. 1925లో పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టి మనదేశాన్ని *వర్గ సమాజం*గా ప్రకటించింది. అదే సంవత్సరం
(1925)లో పుట్టిన ఆరెస్సెస్ భారత సమాజాన్ని *మత సమాజం*గా నిర్ధారించడమే గాకుండ ముస్లింలు, క్రైస్తవులు తనకు ప్రధాన శతృవులని చాలా స్పష్టంగా ప్రకటించింది. ఆ తరువాత తన ప్రత్యర్ధుల జాబితాలో కమ్యూనిస్టుల్ని చేర్చింది. ఇటీవల ఆ జాబితాలో 'అంబేడ్కరిస్టులయిన' అనే షరతు
(rider)తో ఎస్సీలను చేర్చింది.
ప్రధాన స్రవంతి చరిత్ర రికార్డుల్లో పెద్దగా నమోదు కాలేదుగానీ, ఆదివాసులు మన దేశాన్ని తెగ సమాజంగా భావిస్తుంటారు. మైదానానిది ఒక తెగ, అడవిది ఇంకో తెగ అనేది వారి
అవగాహన. అడవి నుండి బయటికి వచ్చి మైదాన ప్రాంతాల్లో అక్కడక్కడ స్థిరపడిన సమూహాలు కూడ మన సమాజాన్ని ‘తెగ సమాజం’ అనే అనుకుంటాయి. వేరే తండాలు ఏర్పాటు చేసుకుని నివశిస్తుంటాయి.
అందరికీ తెలిసిన ఇంకో వాస్తవం ఏమంటే స్త్రీలు ఈ సమాజాన్ని పురుషాధిక్య సమాజం అనే నిర్ధారణతోనే వుంటారు. ఇంకొంచెం తరచి చూస్తే భాషా, ప్రాంత విభేధాలు కూడ చాలా బాహాటంగా మన సమాజంలో కొనసాగుతున్నాయి. తెలుగువాళ్ళే అయినప్పటికీ ‘ఆంధ్రుల పాలన’
తమకు వద్దంటూ ఒక పెద్ద ఉద్యమం సాగి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడాన్ని ఈ తరం కళ్ళార చూసింది.
వీటన్నింటి అర్ధం ఏమంటే వర్గం అనేది ప్రతి సామాజిక అస్తిత్వంలోనూ వుంటుంది; వుంది. మన రాజకీయ సామాజిక సిధ్ధాంతవేత్తలు ఏనుగును తడిమిన నలుగురు గుడ్డివాళ్ళు లాంటి వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కో
పార్శ్వాన్ని మాత్రమే తడిమారు. తడిమిన మేరకు వాస్తవమే చెప్పారు. మిగిలిన పార్శ్వాలను వారు చూడలేకపోయారు. పాపం వారు సామాజిక ద్వివ్యాంగులు.
ముసాయుదా అంటే పుట్టబోతున్న, రాబోతున్న అని నిఘంటువు అర్ధం. వందేళ్ల తరువాత 2023లో పుట్టబోతున్న *'బహుజన శ్రామికవర్గ ప్రజాస్వామిక ప్రణాళిక' ముసాయిదా* తొలి అధ్యాయం తొలి పేరా మూడవ వాక్యంలోనే భారత సమాజాన్ని *వర్ణ, కుల, వర్గ వ్యవస్థ*గా పేర్కొంది. ఈ అధ్యాయంలో చివరి వాక్యం కూడ అదే; "ఈ సమాజం 'వర్ణ కుల-వర్గ సమాజం' అని మనం నిర్ధారించవచ్చు" అని బల్లగుద్ది చెప్పింది.
“హిందువుగా
పుట్టానుగానీ హిందువుగా మాత్రం చనిపోను” అని బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన ప్రతిజ్ఞ,
ఆయన బౌధ్ధాన్ని స్వీకరించిన తీరు, తద్వార మనది మత సమాజం అని నిర్ధారించడం తదితర
వాస్తవాలు ఈ ప్రణాళిక రచయితలకు క్షణ్ణంగా తెలుసు.
అయినప్పటికీ, భారత సమాజ స్వభావం నుండి మతాన్ని ఒక ప్రణాళికాబధ్ధంగా తప్పించారు. వీరు వందేళ్ళ చరిత్రను కాచివడబోసి
రూపొందించినట్టు చెప్పుకుంటున్న సిధ్ధాంతంలో పాపం తెగలు కూడ లేవు.
భారత సమాజంలోని మత స్వభావాన్ని తొలగించడం ద్వార ఈ ముసాయిదా ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మత అల్పసంఖ్యాక వర్గాల అస్తిత్వాన్ని నిరాకరించింది. నేరుగా CAA-NPR-NRC: చట్టాలకు కొత్త సమర్ధనను ఇచ్చింది. “ముస్లింల ఓట్లు
మాకు వద్దు” అనేది బిజెపి ఎన్నికల ఎత్తుగడ. ముస్లింల ఓట్లు వద్దంటేనే హిందూ ఓట్ల
సమీకరణ విస్తారంగా బలంగా సాగుతుందని ఇటీవలి ఎన్నికలు నిరూపిస్తున్నాయి. అలాంటి ఒక కుట్రపూరిత వ్యూహం ఈ ప్రణాళికలో చాలా
స్పష్టంగా కనిపిస్తున్నది. ముస్లిం, క్రైస్తవ, శిక్కులతోపాటు ఎస్టీలను కూడ కలుపుకుంటే సమాజ స్వభావ
నిర్ధారణలోనే 26 శాతం సామాజికవర్గాక్ల ఉనికిని ఈ ప్రణాళిక రచయితలు పక్కన పెట్టారు.
ఈ ముసాయిదా MS గోల్వాకర్ విరచిత 'Bunch of
thoughts' 'We or Our Nationhood Defined' లోని సిధ్ధాంతాలకు సరికొత్త రూపం. కొత్త సీసాలో పాత సారా.
సమాజ విశ్లేషణలో
ఎవరైనా ఏం చెప్పారూ? అన్నది అంత ప్రధానమైనదికాదు; ఎందుకు చెప్పారు? అన్నది
అంతకన్నా ప్రధానమైనది. పాక్షిక మార్క్సిస్టులు, పాక్షిక అంబేడ్కరిస్టులు అయిన
కొందరు రాసిన ఈ ప్రణాళికలో కార్ల్ మార్క్స్,
అంబేడ్కర్ కొటేషన్లు చాలా వున్నాయి. ఒక అనుకూలంగా వాళ్ళకు మార్క్స్ కొటేషన్ ఒకటి గుర్తుకు రాలేదు.
మనుషుల సామాజిక అస్తిత్వాన్ని వాళ్ళ చైతన్యం నిర్ణయించదు; అందుకు విరుధ్ధంగా మనుషుల సామాజిక అస్తిత్వం వాళ్ళ చైతన్యాన్ని నిర్ణయిస్తుందని’ ఒక సందర్భంలో కార్ల్ మార్క్స్ చాలా స్పష్టంగా నిర్ధారించాడు. (It is not the consciousness of men that determines their being,
but on the contrary their social being, that determines their
consciousness.") వర్ణ సమూహాలను
సంఘపరివార శక్తులు సహజ మిత్రులుగా భావిస్తాయి. ఆ తరువాత, తమకు ఆకర్షింప బడడానికి వీలుగా (susceptible) హిందూ సమాజపు చేతివృతుల సామాజికవర్గాలు వుంటాయని సంఘపరివార
శక్తుల అంచనా. ఆ
సామాజికవర్గాల్లో వర్గ స్వభావంకన్నా మత ప్రభావం బలంగా పనిచేసే సందర్భాలుంటాయి. ముస్లింలతో దోస్తీ
చేసి సంఘపరివార శక్తుల ఆగ్రహానికి గురికావడంకన్నా ముస్లింలను
దూరంగా పెట్టి సంఘపరివార శక్తుల అనుగ్రహానికి పాత్రులు కావడం
మేలనే అభిప్రాయం వారిలో బలబడుతున్న పోకడలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి
నేపథ్యంలో పుట్టిన ప్రణాళిక ఇది. బహుజన శ్రామికవర్గ ప్రజాస్వామిక ప్రణాళిక అనడంలో దీని సామాజికవర్గ నేపథ్యం
చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఒక చారిత్రక సందర్భంలో అణగారిన సమూహాలన్నింటినీ దళితులు అనేవారు. ఇప్పుడు దళితులు అంటే ఎస్సీలు అని
నిర్దిష్ట అర్ధం. బుధ్ధుడు బహుజన సుఖాయా బహుజన హితాయా అన్నప్పుడు; ఇస్లాం, క్రైస్తవం
పుట్టనేలేదు. దళితోద్యమాల రెండవ దశలో ఎస్టి
ఎస్సీ బిసి మైనారిటీ సమూహాలను కలిపి బహుజన
పదాన్ని వాడేవారు. ఆ తరువాత అది నిర్దిష్ట అర్ధంలో కేవలం బిసి సమూహాలను సూచించే పదంగా
మారిపోయింది. ఆ అర్ధంలోనే ఈ ప్రణాళిక రచన సాగింది.
బహుజన శ్రామికవర్గ ప్రజాస్వామిక
హిందూ చేతివృత్తుల సామాజికవర్గాల్లో
మార్క్సిస్టు నేపథ్యం ఆలోచనాపరులున్నారు. వాళ్ళు ముస్లింలకు మిత్రులుగానే వుంటున్నారు.
No comments:
Post a Comment