Tuesday 24 September 2019

there was no one left to speak for me.


నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు! 
ఉష యస్ డానీ  


నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు
ఉష యస్ డానీ  

వాళ్లు మొదట ముస్లింల కోసం వచ్చారు
నేను ముస్లింని కాదు గాబట్టి మాట్లాడలేదు.

తర్వాత వాళ్ళు క్రైస్తవుల  కోసం వచ్చారు
నేను క్రైస్తవుడ్ని కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు అర్బన్ నక్సలైట్ల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టు విప్లవకారుడ్ని కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను వర్గ నిర్మూలన వాదిని కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు ప్రతిపక్షాల కోసం వచ్చారు
నేను రాజకీయ కార్యకర్తను కాదు గాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్ళు అంబేడ్కరిస్టుల కోసం వచ్చారు
నేను కుల నిర్మూలనవాదిని కాదు గాబట్టి మాట్లాడలేదు


తర్వాత వాళ్ళు హేతువాదుల  కోసం వచ్చారు
నేను నిరుపేద రామ భక్తుడ్ని గాబట్టి మాట్లాడలేదు

చివరకు  వాళ్ళు  నా  కోసం వచ్చారు
అప్పటికి నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు.

(
జర్మనీ నాజిజం కాలపు లూథరన్  ఫాదర్ మార్టీన్ నీమోల్లర్ ప్రేరణతో


23 సెప్టెంబరు 2019

Fr. MARTIN NIEMÖLLER is perhaps best remembered for the quotation1 :

First they came for the socialists, and I did not speak out—because I was not a socialist.
Then they came for the trade unionists, and I did not speak out— because I was not a trade unionist.
Then they came for the Jews, and I did not speak out—because I was not a Jew.

Then they came for me—and there was no one left to speak for me.

No comments:

Post a Comment