Friday, 22 August 2014

మాట్లాడడానికి ఒక మనిషి కావాలి!


మాట్లాడడానికి ఒక మనిషి కావాలి!
లఘుచిత్రం

ఈ షార్ట్ ఫిల్మ్ ను అక్టోబరులో తీయాలని నిర్ణయించాము.

కాన్సెప్ట్, స్క్రిప్ట్ :      డానీ
క్రియేటివ్ హెడ్  :     అనిల్ అక్తర్ ఖాన్ చౌదరి
టెక్నికల్ హెడ్ :      అరుణ్‍ ఇక్బాల్ ఖాన్ చౌదరి
ప్రొడక్షన్  :         యేలూరి అజిత
నటీ నటులు  :        (ఇప్పటికి ఇలా అనుకుంటున్నాం)
డానీ, సుఫియా బేగం (డానీ వాళ్ల అమ్మ)

స్క్రిప్టు
                       

1.          హైదరాబాద్ రోడ్లు.
2.          విపరీతమైన ట్రాఫిక్
3.          పుట్ట చితికిన చీమాల్లా మనుషులు కంగారుగా నడుస్తున్నారు.
4.          ఎవరి జీవితం వారిది.
5.          ట్రాఫిక్ ఇలాండ్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది.
6.          కొడుకు  స్కూటర్ కు బ్రేక్ వేశాడు.
7.          కొడుకు  వయస్సు 50 సంవత్సరాలుంటాయి.
8.          ఎగువ మధ్య తరగతి జీవి.
9.          ఫార్మల్ డ్రెస్సు. ఫార్మల్ షూస్.
10.      స్కూటర్ చుట్టూ క్యారీ బ్యాగులు వేలాడుతున్నాయి.
11.      క్యారీ బ్యాగుల్లోంచి పండ్లు, మందులు, హాట్- స్వీట్స్, ఓఆర్ ఎస్ కనిపిస్తున్నాయి.
12.      కొడుకు  ముఖంలో కంగారు, ఆతృత, ఆందోళన,
13.      అంతా వెహికిల్స్ పొగమయం.
14.     కొడుకు  సెల్ ఫోన్ / వాచీలో టైం చూసుకుంటున్నాడు.
15.      సమయం సాయంత్రం ఏడు అయింది.
16.      గీన్ సిగ్నల్ పడింది.
17.      వెహికిల్స్ హారన్ల మోత.
18.      కొడుకు  కంగారుగా స్కూటర్ స్టార్ట్స్ చేసి ముందుకు సాగాడు.
19.      కొడుకు స్కూటర్ ఒక వీధిలోనికి తిరిగింది.
20.      బంజారా హిల్స్ లో పెద్ద అప్పార్ట్ మెంట్
21.      పెద్ద కాంపౌండ్ వాల్
22.      గేటులో సెక్యూరిటీ గార్డ్ వున్నాడు.
23.      “నమస్తే  ......  సాబ్ ” అన్నాడు సెక్యూరిటీ గార్డ్.
24.      స్పందించే స్థితిలో లేడు కొడుకు.
25.      కొడుకు  ర్యాంప్ మీదుగా సెల్లార్ లోనికి దిగి స్కూటర్ స్టాండ్ వేశాడు.
26.      క్రారీ బ్యాగులన్నీ కంగారుగా తీసుకుని లిప్ట్ దగ్గరకు పరుగెట్టాడు.
27.      లిప్ ఎక్కడో పదవ అంతస్తులో వుంది.
28.      కొడుకులో ఆతృత పెరిగిపోతోంది.
29.      కర్చిఫ్ తో చెమట తుడుచుకున్నాడు.
30.      లిఫ్ట్ వచ్చింది.  కొడుకు గబుక్కున లోపలికి దూరబోయాడు.
31.      లిఫ్ట్ లో నుండి గార్బేజీ బ్యాగులు తీసుకుని హౌస్ కీపింగ్ స్టాఫ్ దిగుతున్నారు.
32.      కొడుకులో  అసహనం.
33.      హౌస్ కీపింగ్ స్టాఫ్ వెళ్ళాక కొడుకు  గబుక్కున లోపలికి వెళ్ళి  6-వ నెంబరు నొక్కాడు.
34.      లిఫ్ట్ లో గార్బేజి వాసన వస్తోంది.
35.      కర్చిప్ తో ముక్కు మూసుకున్నాడు.
36.      వాచీలో టైమ్ చూసుకున్నాడు.
37.      లిఫ్ట్ 6-వ ఫ్లోరుకు చేరుకుంది.
38.      కొడుకు లిప్ బయటికి వచ్చి కారిడార్ లో పరుగులాంటి నడక నడుస్తున్నాడు.
39.      604 ఫ్లాటు దగ్గరికివచ్చి గబగబ కాలింగ్ బెల్ నొక్కాడు.
40.      604 ఫ్లాటులోపల ఒక ముసలామె టీవీ చూస్తూ కుర్చీలో కూర్చునివుంది.
41.      ఆమెకు 80 సంవత్సరాలుంటాయి.
42.      తెల్లటి జుట్టు, తెల్లటి చీరా, జాకెట్టు. గోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు.
43.      టివీలో మదర్ ఇండియా / మిస్సమ్మ  లాంటి పాత సినిమా వస్తోంది.
44.      విలాసవంతమైన 3BHK ఫ్లాట్ అది.
45.      కొడుకు బయటి నుండి కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు.
46.      లోపల సినిమా చూస్తున్న ముసలామెకు కాలింగ్ బెల్ వినిపించడంలేదు.
47.      కొడుకు గట్టిగా “అమ్మా! అమ్మా!” అని అరవడం మొదలెట్టాడు.
48.      లోపల ముసలామెకు “అమ్మా” అన్నమాట వినిపించింది.
49.      ముసలామె నెమ్మదిగా కుర్చీలోంచి లేచి, డోరు దగ్గరికి వెళ్ళింది.
50.      ముసలామె డోరుకు సేఫ్టీ చైన్ వేసి, నెమ్మదిగా డోరు తెరిచి అనుమానంగా చూసింది.
51.      డోరు సందులోంచి కొడుకు కనిపించాడు.
52.      కొడుకు  ముఖం చూడగానే ముసలామె ముఖంలో ఒక వెలుగు వచ్చింది.
53.      ముసలామె డోరు పూర్తిగా తెరిచింది.
54.      క్యారీ బ్యాగులతోపాటూ కొడుకు కంగారుగా లోపలికి వచ్చాడు.
55.      ముసలామె డోరు మూసి, గడియ పెట్టి కొడుకు  వెనక నడిచింది.
56.      “ఎన్నిసార్లు బెల్ కొట్టాలి?” అన్నాడు కొడుకు  చిరాగ్గా.
57.      “వినిపించలేదురా” అంది తల్లి.
58.      “టివీ వాల్యూమ్ అంత పెద్దగా పెట్టాలా?”  అన్నాడు కొడుకు మళ్ళీ చిరాగ్గా.
59.      “అది తప్ప నా బతుక్కి ఇంకే ముంది?” అంది తల్లి అంతే చిరాగ్గా.
60.      కొడుకు  దగ్గర మౌనం తప్ప  సమాధానం లేదు.
61.   కొడుకు టేబుల్ మీద ట్రేలు పెట్టి క్యారీ బ్యాగుల్లోని సరుకులు బయటికి తీసి వాటిల్లో సర్దుతున్నాడు. 
62.      “ఇవి షుగర్ ట్యాబ్లెట్లు. “
63.      ముసలామె మౌనంగా చూస్తోంది.
64.      “ఇవి బీపీ ట్యాబ్లేట్స్ రోజూ వేసుకోవాలి. స్ట్రిప్పు గులాబీ రంగులో వుంటుంది. మరచిపోకు” అన్నాడు కొడుకు.
65.      ముసలామే ఆ స్ట్రిప్పును చేతిలోనికి తీసుకుని దాని రంగును చూస్తోంది.
66.      “ఇంతకు ముందువి గచ్చకాయ రంగులో వుండేవికదరా?” అంది తల్లి
67.      “ఇప్పుడు డోసు పెంచారు. ఇవి కొత్తవి” అన్నాడు కొడుకు.
68.      ముసలామె “డోసు పెంచారు. హు!” అని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వింది.
69.      టేబుల్ మీదున్న ట్రేల్లో  పండ్లు, హాట్ –స్వీట్లు సర్దుతున్నాడు కొడుకు.
70.      “నీకు హాట్ కావాలంటే హటు తిను. నో ప్రాబ్లం. కాజూ మిక్చర్. అల్ మండ్ హౌస్ నుండి తెచ్చా.  షుగర్ లెవల్ డౌన్ అవుతుంటే మాత్రం కొద్దిగా స్వీటు తిను. ఎక్కువగా తినకు. యాపిల్, దానిమ్మ, బత్తాయి. బొప్పాయి తినొచ్చు” అన్నాడు కొడుకు.
71.      “నేను ఎప్పుడయినా పొప్పాయా తిన్నానా?. మీనాన్న తినేవారు పొప్పాయా. నాకు ఆ వాసనే నచ్చదు ”
72.      “మరి నీకు ద్రాక్షపళ్ళు ఇవ్వద్దన్నాడు డాక్టర్.” అన్నాడు కొడుకు.
73.      “అంతేలే ఇక అన్నీ బందుపెట్టుకుంటా పోతారు” అంది తల్లి మళ్ళీ.
74.      ఓఅర్ ఎస్ టెట్రా ప్యాకులు తీసి ఫ్రిజ్ లో  పెడుతున్నాడు కొడుకు .
75.      “గాబరాగా అనిపిస్తే ఓఆర్ ఎస్ తాగు.  ఫ్రిజ్ లో నుండి తీయగానే తాగకు. కాస్సేపు బయట వుంచి తాగు. లేకపోతే నిమోనియా రావచ్చు” అన్నాడు కొడుకు కొంచెం హెచ్చరికగా.
76.      “అదొకటుందా?” అంది తల్లి.
77.      “ఇది దగ్గు మందు. ఇవి ఒంటి నెప్పులకు బిళ్లలు. ఇవి ....” చెప్పుకుంటూ పోతున్నాడు కొడుకు.
78.      “ఇంతకీ నేను చెప్పింది తీసుకువచ్చావా? అంది తల్లి అసహనంగా
79.      “ఏంటదీ?” అన్నాడు కొడుకు  పండ్లు సర్దుతూనే.
80.      “ఇన్ని తెస్తావు. దేనీకీ? నెత్తినెట్టి కొట్టుకోడానికా? చెప్పింది మాత్రం తేవూ” అంది  తల్లి.
81.      “ఏదీ మిస్సు కాలేదే. లిస్టు రాసుకుని మరీ వెళ్ళాను. అన్నీ తెచ్చానే.” అన్నాడు కొడుకు.   
82.      “నేనూ, ఆ టీవీ ఇదేగా బతుకు?” అంది తల్లి
83.    “ఇంట్లో రెస్టు తీసుకోవడం ఎంత విలాసమో నీకేం తెలుసు. ఆపీసు టెన్షన్ చూస్తే తెలుస్తుంది నరకం అంటే ఏమిటో? ” అన్నాడు కొడుకు.
84.      “నన్ను ఈ హైదరాబాద్ కు తెచ్చి జైలు బతుకు చేసేశావుగా, “ అంది తల్లి.
85.      “ ఈ వెటకారాలొద్దు. విషయం చెప్పు” అన్నాడు  కొడుకు అసహనంగా.
86.      “నాతో మాట్లాడడానికి ఒక మనిషిని తెమ్మని పోరుతున్నానా?  తెచ్చావా?” అంది తల్లి.
87.      “మనిషా? ఈ హైదరాబాదు నగరంలోనా?” నోరు వెళ్లబెట్టాడు డానీ.


END



  • Chetan Venky Meru rasindi chadiva sir hyd lo nijangane matladadaniki manusullera
  • A.m. Khan Yazdani Danny Chetan Venky! ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో వృధ్ధులతో మాట్లాడే మనుషులు లేరు. ఇది నేను రోజూ మా అమ్మ అనుభవిస్తున్న సమస్య. దాదాపు పది గంటలు మనిషన్నవాడు కనిపించడు.
  • A.m. Khan Yazdani Danny Sreeram Kannan గారూ। దాని అర్ధం బాగుందనేనా? కొన్ని సూచనలు ఇవ్వండి.
  • Prasu Raya manushulu unna social networks lo ite matladutharu kani direct ga matladaru ga paapam aaa amma ki social networks maintain cheyadam radhaye
  • Chakravarthy Sreenivasa “ఇంట్లో రెస్టు తీసుకోవడం ఎంత లగ్జరీయో నీకేం తెలుసు. ఆపీసు టెన్షన్ చూస్తే తెలుస్తుంది నరకం అంటే ఏమిటో? ”
  • Chakravarthy Sreenivasa చాల బావుంది సర్ స్క్రిప్ట్ . లఘు చిత్రం తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
  • Prasu Raya eppudu intlone unde vallaki telusthundhi aaa narakam ela untundho
  • Prasu Raya nijamga picture thisthe hit sure sir
  • నవీన్ కుమార్ గాదరి చాలా బావుంది డానీ గారు. నిజంగా వృద్ధాప్యం లో ఒంటరిగా బతకడం కంటే నరకం మరోటి ఉండదేమో..!!
  • Rekulapally SaiChandan Reddy రాకెట్ యుగం ఇది , నశిస్తున్న అడవులు ,పెరుగుతున్న కాంక్రిట్ జంగల్లు.
    కాంక్రిట్ ల గట్టిగా ఉండకుండా ఇ సభాంద బాద్యాలు నాణ్యత లెని సిమెంట్ 
    లా పెకమెడల్ల ఇ సంభందలు కూలిపోతున్నయి. తల్లి అనే కాదు ఓక భార్య, పిల్లలు
    ...See More
  • A.m. Khan Yazdani Danny Prasu Raya। మనవన్నీ డిజిటల్ రిలేషన్స్. సెల్ ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడుతాం. ఫేస్ బుక్ తో గంటల కొద్దీ గడుపుతాం. సజీవమైన మనిషితో అర నిముషం మాట్లాడం. ఇది డిజిటల్ డివైడ్. ఈ మధ్య హాలివుడ్ లో HER (Film) వచ్చింది అందులో హీరో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తో ప్రేమలో పడతాడు.
  • Mohan Ravipati ఆమె ఒంటరి తనాన్ని మరికొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందేమో
  • Prasu Raya idi correct kadhu ani prathi okkariki telusu kani andaru ade chestharu sir nenu kuda ma urlo ma amma naana matrame untaru pedda intlo naana udayam velli night eppudo vastharu appati daka amma okkate idi gurthochinappudalla na mida nake asahyam kopam vasthay kani nannu nenu poshinchukovalante naku job thappani sari
  • A.m. Khan Yazdani Danny Rekulapally SaiChandan Reddy। ధన్యవాదాలు.
  • Suresh Vanguri sir, na comment inbox chesanu.
  • A.m. Khan Yazdani Danny Suresh Vanguri గారు మంచి సూచన చేశారు. దాన్ని ఇక్కడ. పెడుతున్నాను.

    సార్। నాకు అనిపించింది రాస్తున్నాను. అన్యదా భావించొద్దు. (ప్రధాన సమస్య అమ్మ ఒంటరి తనం గనుక, దాదాపు పది గంటల పాటు, మాట్లాడే మనిషి ఉండకపోవటం గనుక) ఫోకస్ అమ్మ ఒంటరితనం మీద ఉండాలి అని నా ఉ
    ...See More
  • Prasu Raya s sir dany garu padda kashtalne chupicharu(chepparu )kani amma udayam nundi dany garu vache varaku anubhavinchina ontari thanam gurinchi cheppaledhu
  • Prasu Raya idi indake cheppalankunna peddavallu miku cheppe anthati danni kadani calm ipoya
  • Gopi Krishna script..CHADIVANU...SUPERb ga undi..!
  • Gopi Krishna నా ఐడియా...యేంటంటే........డానీ....రోడ్ల మీద..ఎన్ని తిప్పలు పడుతున్నాడో...ఇక్కడ ముసలావిడ..కూడా..అసహనంతో....ఉన్నాట్ట్లు..సైమల్టేనియస్గా..కొన్ని షాట్లు పెడితే...బావుంటుందని...!! డానీ....బయట..ఎంతమంది..జనాలతో..ఉన్నా ఒంటరిగాఉన్నట్లు....ఫీలింగ్స్ పెడితే...బెటరని నా..ఊహ..!!
  • Gopi Krishna ఒక రకంగా ఆలోచిస్తే...మీ స్రిప్టే బావుంది...! లాస్ట్లో..డానీ...ఫీలింగే....కరెక్ట్ ..ఎండ్..!! అప్పటిదాకా సస్పెన్స్గా ఉన్నట్లుంటుంది....ముందే...ముసలావిడ తిప్పలు చూపిస్తే....రొటీన్ కావొచ్చు..!!
  • Sreeram Kannan Sir, కథాంశం అద్భుతంగా ఉంది. ముందుగా మీరు అంత తిప్పలు పడుతూ ట్రాఫిక్ పద్మవ్యూహంలోంచి బయట పడి అమ్మ దగ్గరికెళ్ళి మందులూ ఇతర సరంజామాలూ అందజేస్తూ ఒక్కొటొక్కటిగా ముఖ్యమైన జాగ్రత్తలు చెప్తారు. అమ్మ వంటరిగా ఉందని, ఆమెకూ మాట్లాడడానికి ఒక మనిషి కావాలని బాధపడుతూ చెప్పడం చివర్లోకథకుడే కాదు చదువరికీ విస్మయం కలిగించే ముగింపు అనిపించింది.అలానే ఉంచెయ్యండి సార్. ఇలాంట్ ఆబ్సర్డ్ కథలకే మంచి సినిమా కాగలిగే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
  • A.m. Khan Yazdani Danny పసితనంలో మా అమ్మ నా కోసం వెచ్చించిన సమయంలో పదో వంతు కూడా ఇప్పుడు నేను ఆమె కోసం చెచ్చించలేకపోతున్న నిస్సహాయత నుండి పుట్టిన కథ ఇది.
  • A.m. Khan Yazdani Danny This is our failure in the costume of success.
  • A.m. Khan Yazdani Danny Sreeram Kannan గారూ! కథ మీకు నచ్చిన తీరు నాకు చాలా ఆనందాన్నిచ్చింది. వృధ్ధురాలి బాధ గురించి నేను వేరే కథ డెవలప్ చేస్తున్నాను. దాని టైటిల్ "ఆరు కుక్కలు - ఒక వృధ్ధురాలు'.
  • Anjana Rajesh katha lo daanny pov ekkuva inattu anipinchindi.main conflict talli di kadha.adi register inattu anipinchaledu.title prakaaram danny meeda ki sympathy kanna talli problem register ithe bagundunu.naa humble reqest meeru shot wise kaakunda oka kathala raaaste clarity vastundi.meeru ichina orderlo iddaaru corect idi answer leni prasna anipinchindi..idi kevalam naa abhiprayam.thank you sir
  • Aparna Kothapalli Amma ku oka smart phobe konipettsdamuuuu oka alternative...
  • Aparna Kothapalli Koduku 'responsibility attentiveness ' baga highlight chesaru... amma vontarithanam, manishi avasaram kavalo cheppaledu. Jovial ga undi. Oka laghu kadha ga bavundi . Endi ng twist ame Digin di ... koduku thelinadi...... seriousness ledu. Mooviki ...See More
  • A.m. Khan Yazdani Danny Aparna Kothapalli garu! Your suggestions well taken.
  • KN Murthy అమ్మ ఒంటరి తనం మరింత ఎష్టాబ్లిష్ కావాలి ...కోడలు ఉద్యోగానికి వెళ్ళడం లేదా పక్కింటి వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉండటం...ఇక పిల్లలు ఫోనులో మాట్లాడు కోవడం,నెట్ చూస్తూ గడపడం లాంటి సీన్ లతో ఒంటరి తనం ఎష్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది,
  • A.m. Khan Yazdani Danny కొడుకు పాత్రను నేను, తల్లి పాత్రను మా అమ్మ నటించాలని డిసైడ్ చేశాం. మా ఆమ్మ ప్రస్తుతం పూనా వెళ్ళింది. సెప్టెంబరు మొదటి వారంలో ఆమే రాగానే షూటింగ్ చేస్తాం. ఈలోపు స్క్రిప్టును డెవలప్ చేస్తాం.
  • Hema Sunder check it...
    5 mins · Like
  • A.m. Khan Yazdani Danny

Monday, 11 August 2014

Government in Exile


ప్రవాస ప్రభుత్వం
డానీ

చరిత్ర పునరావృతమౌతుంది; మొదటిసారి విషాదంగానూ, రెండోసారి ప్రహసనంగానూ అన్నాడు కార్ల్ మార్క్స్. ఆంధ్రప్రదేశ్ ప్రవాస ప్రభుత్వ ప్రహసనం  కార్ల్ మార్క్స్ మాటల్ని పదేపదే గుర్తు చేస్తోంది.

సరిగ్గా నూరేళ్ళ క్రితం, 1915లో కాబూల్ పర్వతసాణువుల్లో భారత ప్రవాస ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు నడిచింది. వలస పాలనకు వ్యతిరేకంగా దేవ్ బందీ ముస్లింలు కొందరు చొరవతో  దీన్ని నెలకొల్పారు. మౌలానా బర్కతుల్లా ప్రధానిగానూ, మహేంద్ర ప్రతాప్ అధ్యక్షునిగానూ, చంపాకరన్ పిళ్ళె విదేశాంగ మంత్రిగా,  మౌలానా బషీర్ యుధ్ధమంత్రిగానూ ఇందులో వున్నారు.  మొదట్లో పరోక్షంగా మద్దతు ఇచ్చిన ఆఫ్ఘన్ ఆమిర్ తరువాత బ్రిటీష్ వత్తిడికి లొంగి భారత ప్రవాస ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాడు.    అప్పుడు వలసపాలన  వుందిగాబట్టి ప్రవాస ప్రభుత్వం అనివార్యం, వీరోచితం కూడా. ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్ లో ఒకరకం ప్రవాస ప్రభుత్వం నడుస్తోంది. ఇది వీరోచితమూకాదు, అనివార్యమూకాదు. కేవలం ప్రహసనం.

        రాష్ట్ర విభజన అంశం ముందుకు వచ్చినపుడు ఏ కారణం వల్లనోగానీ  అనేక ప్రధాన విషయాలకన్నా హైదరాబాద్ అంశం కీలకంగా మారింది. ఎవరు ఎప్పుడు ఎవరి బుర్రలో ఈ మాట పెట్టారోగానీ, చివరి దశ వరకూ “యూటీ, ఐటీ” చుట్టూనే చర్చంతా సాగింది. అవి రెండూ  సీమాంధ్రుల అదుపులోవుంటే, మిగిలినవి అసలు సమస్యే కాదనే ప్రచారం వుధృతంగా సాగింది. ఇప్పుడు వాటికన్నా ప్రాణప్రదమైన సమస్యలు అనేకం ముందుకు వచ్చాయి. ఇంకా వస్తూనే వున్నాయి. మొత్తం రాష్ట్రాన్ని ఏలగలిగే సామర్ధ్యం తమకే వుందని తరచుగా చెప్పుకునే రాయలసీమ - తీరాంధ్ర నాయకులకు ఈ ప్రమాదాల గురించి బొత్తిగా తెలీదు అనైనా అనుకోవాలి. లేకపోతే వాళ్లకు ఒక రహాస్య ఎజెండా  వుందని అయినా అనుకోవాలి.

సీమాంధ్ర రాజకీయనాయకుల్లోని మూర్ఖులు సమైక్యవాదాన్ని సృష్టించారు. లేకపోతే రాష్ట్ర విభజన విధివిధానాలపై త్రైపాక్షిక చర్చలకు, 2009 నుండి 2014 వరకు దాదాపు నాలుగేళ్ళ సుదీర్ఘ వ్యవధి వుండేది. ఇంతటి విలువైన సమయాన్ని, అవకాశాన్నీ దుర్వినియోగం చేసిన  పాపం ప్రధానంగా లగడపాటి రాజగోపాల్ దే అనిపిస్తుంది.  ప్రధానంగాఅన్నప్పుడూ ఆ పాపం ఆయన ఒక్కడిది మాత్రమే అనికాదు.సీమాంధ్ర రాజకీయనాయకులు అందరూ మూర్ఖులు అనీఅర్ధంకాదు. అయితే, సమైక్యాంధ్రా అంటే బొత్తిగా తెలియనివాళ్లకు ఆ చైతన్యాన్ని కలిగించింది తానే అని రాజగోపాల్ స్వయంగాచాలాసార్లు చెప్పుకున్నారు. మరోవైపు, "విభజనకు షరతులు ఇలా వుండాలి. ఇవన్నీ అంగీకరించి, సాకారం చేశాకే విడిపోదాం. కాదంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మీద  తీవ్రంగా ఉద్యమం చేస్తాం" అనే ప్రతిపాదనతో 2009 డిసెంబరులోనే కొందరు  ముందుకు వచ్చారు. సమైక్యవాదుల ముసుగులో అప్పట్లో వీరంగం సృష్టిస్తున్నవాళ్ళు ఇలాంటి చర్చలకు అవకాశం ఇవ్వలేదు.

రాష్ట్ర విభజన జరిగాక, సీమాంధ్రలో అందరూ సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైరాం రమేష్,  దిగ్విజయ్ సింగ్ లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ వుండవచ్చుగానీ, వాళ్ళు చేసిన మేలు కూడా చాలా వుంది. ఆంధ్రప్రదేశ్ పునర్  వ్యవస్థీకరణ బిల్లులో అన్ని అంశాల్ని వాళ్లకు వాళ్ళుగానే పెట్టారు. ఎల్. కే.  అడవాణీ అన్నట్టు  ఆ బిల్లు అనేక అవకతవకల పుట్ట కావచ్చు. అయినప్పటికీ, సీమాంధ్ర నుండి ఎవరూ కోరకుండానే ఆ బిల్లు తయారయిందని గమనించాలి. బిల్లులో ఫలానా అంశం వుండాలని కోరడం అంటేనే ఆంధ్రుల విభజనను అంగీకరించినట్టే అన్నంత అతివాదాన్ని అప్పట్లో సీమాంధ్ర నాయకత్వం ప్రదర్శించింది.  ఇక ముందు సీమాంధ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఏది కోరాలన్నాదానికి  చట్టబద్ద ప్రాతిపదిక ఆ బిల్లే. మరోమార్గంలేదు.  సీమాంధ్ర నాయకత్వం చేసిన తప్పిదాల్ని ఇప్పుడు కేసిఆర్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. విభజనకు అంగీకరిస్తే చాలు సీమంధ్రుల డిమాండ్లన్నీ ఒప్పుకుంటాం అనే విధంగా అప్పట్లో తెలంగాణ నాయకులు అనేవారు. ఇప్పుడు బంతి వాళ్ల కోర్టులో వుంది. పునర్ వ్యవస్థీకరణ బిల్లులో వున్న అంశాలను సహితం నిరాకరించే విధానాన్ని కేసిఆర్ అవలంబిస్తున్నారు.  బీసీ విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్సుమెంటు వివాదం దీనికి తాజా ఉదాహరణ.

హైదరాబాద్ యూటీ చేస్తే సీమాంధ్ర ప్రజలకు  ఒనగూడే ప్రయోజనం ఏమిటో, ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. హైదరాబాద్ యూటి కాకపోయినా ఉమ్మడి రాజధాని అయింది. ఇది వరమో శాపమో తెలియని పరిస్థితి. పరిపాలనలో అపార అనుభవంవున్న చంద్రబాబుకు జరగబోయే పరిణామాలన్నీ ముందే తెలుసు. వుమ్మడి రాజధాని కావడంవల్ల ప్రయోజనమూ లేదని తెలుసు. కొత్త రాజధాని నగర నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని వారొకసారి నిజం చెప్పి నాలుక కరుచుకున్నారు. ఆ తరువాత   వారు ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. ఎన్నికల ప్రచారంలో గొప్ప వెసులుబాటు వుంటుంది.  ఏది చెపితే ఓట్ల వర్షం కురుస్తుందన్నదే ముఖ్యంతప్ప. ఆ చెప్పేది నిజం కావల్సిన పనిలేదు.  ఇలాంటి నియమనిబంధనలు లేకపోవడంవల్ల ఎన్నికల ప్రచారం అనేది అబధ్ధాల పోటీగా మారిపోతోంది.

ప్రజల దగ్గర చంద్రబాబు దాచిన నిజాలు ఇప్పుడు క్రమంగా వారి మెడకే చుట్టు కుంటున్నాయి. అందులో రాజధాని అంశం కాగా, రైతుల రుణమాఫీ అంశం మరొకటి. రాజధాని విషయంలో చంద్రబాబు దాదాపు వారానికో వెర్షను చెపుతున్నారు. ఒక వెర్షన్ కూ మరో వెర్షన్ కూ పోలిక పొంతన వుండడం లేదు. ముందు మంగళగిరి అన్నారు. వారంలో మూడు రోజులు మంగళగిరి, రెండ రోజులు హైదరాబాద్, ఇంకో రోజు ఢిల్లీలో విడిది అన్నారు.  ప్రభుత్వోద్యోగుల్నిపిలిచి తక్షణం హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోదాం అన్నారు.  చెట్ల కింద పనిచేద్దాం అన్నారు. ఉద్యోగులు కూడా సరే అన్నారు. అంత వరకు బాగానే వుంది. ఏ వూర్లో ఏ చెట్ల కింద పనిచేయాలి అనే ప్రశ్న వచ్చినపుడు ముఖ్యమంత్రి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.  ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నగరం ఏదో చెప్పాల్సిన  ఇబ్బందిలో వారు పడిపోయారు. రాయలసీమ, విశాఖపట్నంల నుండి రాజధాని కోరిక ముందుకు రావడంతో  వారు మౌనమే మేలు అనుకుంటున్నారు.


దానితో చెట్ల కింద సియం కార్యాలయం పథకం ఆగిపోయి, కోట్ల రూపాయలతో  హైదరాబాద్ లో సియం క్యాంపు కార్యాలయం ఆధునికీకరణ  పథకం మొదలయ్యింది. ఇప్పుడు చంద్రబాబు స్థాయికి  తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో  సియం ఛాంబరును ఆధునీకరిస్తున్నారు. దానికి మరికొన్ని కోట్లు, మరికొన్ని నెలలు పట్టవచ్చు. ఫలితంగా జరిగింది ఏమంటే, కొత్త రాజధాని నిర్మాణం చేపట్టడం కాదుదుకదా, ఎక్కడ నిర్మించాలనే విషయమే వివాదంగా మారిపోయింది. ముఖ్యమంత్రి దీన్ని పదమూడు జిల్లాలకు పదమూడు కళ్ల సిధ్ధాంతంగా మార్చుకున్నా ఆశ్చర్యం ఏమీలేదు.  పోలవరం కూడా కొత్త జిల్లా అయితే పధ్నాలుగు కళ్ళ సిధ్ధాంతంగావచ్చు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజధానిలేదు. మూడు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి  హైదరాబాద్ చేరుకున్నా అక్కడా ముఖ్యమంత్రి ఛాంబరు లేదు. వెరసి ప్రభుత్వమే లేదన్న భావన సీమాంధ్రలో కొనసాగుతోంది. అయితే వాళ్లకు ఇదేమీ కొత్త అనుభవం కాదు.  కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ప్రభుత్వం తన అస్థిత్వాన్ని కోల్పోయింది. చంద్రబాబు హయాంలో ఆ సాంప్రదాయం కొనసాగుతోంది.


(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
3 ఆగస్టు 2014

Monday, 4 August 2014

రైతు (రుణ) మాఫీ!

రైతు (రుణ) మాఫీ!

వర్తమానం: డానీ
అప్పట్లో చంద్రబాబు స్పీడ్‌ను చూసి చాలా మంది కంగారు పడేవారు. ఇప్పుడూ ఆయన్ని చూసి జనం కంగారు పడుతున్నారు. అయితే, అది వారి స్పీడ్ ను చూసికాదు; వారి వాయిదాల తీరును చూసి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్షణంలోనే చంద్రబాబు అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ తొలి సంతకాలు చేస్తారని చాలా మంది భావించారు. చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచార ఘట్టంలో అలాంటి హామీలే ఇస్తూ వచ్చారు. కానీ అలా జరగలేదు. కొత్త ముఖ్యమంత్రి రికార్డు స్థాయిలో గంటకు ఒక నిర్ణయం చొప్పున తీసుకుంటున్నారని యనమల రామకృష్ణుడు ఘనంగా చెపుతున్నారు. అయితే,  గడిచిన నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాలు ఏమిటో మాత్రం వారు చెప్పలేక పోతున్నారు. నెలకు 720 గంటలని ఆర్థిక మంత్రికి తెలియని విషయం కాదు. 
మిగిలిన విషయాలెలా వున్నా రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు రైతుల రుణమాఫీ, రాజధాని నగరం అనే రెండు అంశాల మీద కేంద్రీకృతమై వున్నదని చంద్రబాబుతోసహా అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఆరంభమయిపోయింది. సాగునీటి పారుదలతోపాటూ, రైతుల రుణమాఫీ అంశాన్ని తక్షణం పరిష్కరించాల్సిన ఒత్తిడి కొత్త ప్రభుత్వంపై పెరిగింది. కృష్ణాడెల్టాకు దాదాపు 180 శతకోటి ఘనపు అడుగుల సాగునీటి పారుదల అవసరం కాగా కృష్ణా వాటర్ బోర్డు నుండి ఇప్పటికి రెండు విడతలుగా పొందింది తాగునీటి కోసం 6 టీయంసీలే. 
ఎన్నికలకు ముందు తెలుగు తమ్ముళ్ళు గ్రామాల్లో తిరిగి రుణాలు చెల్లించ వద్దనీ, తాము అధికారంలోనికి రాగానే రుణాలన్నీ మాఫీ చేసేస్తామని రైతాంగంలో ప్రచారం చేశారు. ఇప్పుడు పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు రాక రాష్ట్రంలో మొత్తం వ్యవసాయమే సంక్షోభంలో పడిపోయింది. రైతు రుణ మాఫీ విధివిధానాలు రూపొందించడానికి చంద్రబాబు వేసిన కోటయ్య కమిటి కోటప్ప కొండకు వెళ్ళిపోయినట్టుంది!. ఏదైనా విషయాన్ని నిరవధికంగా వాయిదా వేయడాన్ని ఇప్పుడు చాలా మంది వ్యంగ్యంగా “కోటప్ప కమిటి వేస్తా” నంటున్నారు. అంతగా అప్రతిష్టను మూట కట్టుకుంది ఆ కమిటి. 
రుణమాఫీ వ్యవహారం రిజర్వు బ్యాంకు అనుమతి, అంగీకారాలతో ఏడేళ్ళు సాగించాల్సిన సంక్లిష్టమైన సుదీర్ఘ ప్రక్రియ అని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గుర్తు చేస్తున్నది. అపార రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబుగారికి ఆ సంక్లిష్టమైన సుదీర్ఘ ప్రక్రియ గురించి ముందుగానే తెలిసివుండాలి. ఆ అడ్డంకుల్ని అధిగమించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించైనా ఈపాటికే ప్రజలకు చెప్పి వుండాల్సింది. ఇకముందయినా ఎప్పటికప్పుడు తాజా పరిణామాల్ని పారదర్శకంగా ప్రకటిస్తూ వుండాలి. లేకపోతే తొలి అడుగులోనే మాట తప్పారు అనే అపవాదును వారు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.   
సియంవోలోగానీ, సియం క్యాంపు కార్యాలయంలోగానీ జరుగుతున్న కార్యకలాపాలను గమనిస్తే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నగర నిర్మాణం విషయంలో చాలా ఆతృత చూపుతున్నట్టు కనిపిస్తున్నది. రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో ప్రకటించడానికి వారికి కొన్ని రాజకీయ ఇబ్బందులు వున్నట్టున్నాయి. అయితే, స్థల నిర్ధారణ జరక్కపోయినా నిర్మాణ ప్రక్రియను మాత్రం వారు చకచకా సాగిస్తున్నారు. ఈ పాటికే వారు సింగపూర్ నగరంలోని విఖ్యాత నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు మొదలెట్టారు. సింగపూర్ విదేశాంగ మంత్రితో మంతనాలు జరిపారు. “ముందు మీ అవసరాలు చెప్పండి. దాన్నిబట్టి మా ప్రతిపాదనలు సమర్పిస్తాము” అని వారన్నట్టు సమాచారం. ఎక్కడ నిర్మించాలో తెలీకుండా పది సింగపూర్లు నిర్మిస్తాననడం సాహసం అనిపించుకోదు; దుస్సాహసం అని కూడా అనిపించుకోదు; గాల్లో మేడలు కట్టడం అనిపించుకుంటుంది.  
నిర్మాణరంగంలో తన సామర్ధ్యాన్ని చంద్రబాబు తరచూ గుర్తు చేస్తుంటారు. మాధాపూర్ హైటెక్ సిటీ, గచీబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫ్లై ఓవర్లతోపాటూ శంషాబాద్ ఎయిర్ పోర్టు, మెట్రో రైలు తదితర నిర్మాణాలని వారు ఇలాంటి సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. అది గత కాలపు వ్యవహారం కావచ్చు. ఇప్పుడు వారు చేపట్టిన కొత్త పునర్ నిర్మాణ పథకం సియం క్యాంపు ఆఫీసుగా మారిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఆధునికీకరణ. చంద్రబాబు పర్యవేక్షణ స్తోమత బలహీనపడిందో, వారికి ఆ ఆసక్తి తగ్గిందోగానీ, రాకరాక వచ్చిన స్వల్ప వర్షాలకే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ పైకప్పు కొంత భాగం కూలిపోయింది. 
ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై యేళ్ళకు పెంచడం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం అని టిడిపి ప్రముఖులు గొ్ప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ  పెరుగుతున్నప్పుడు పదవీ విరమణ వయస్సును పెంచడం నిస్సందేహంగా అవసరమైన చర్యే. కానీ కొత్త ప్రభుత్వానికి ప్రభుత్వోద్యోగుల సంక్షేమమే ప్రాణప్రదమైన తొలి చర్య కానక్కరలేదు. అలా కావడం సమంజసమూ కాదు. 
ఎన్జీవోలు వృత్తిరీత్యానేకాక ప్రవృత్తిరీత్యా కూడా పాలక యంత్రాంగంలో భాగం. సహజంగానే ప్రజలకు ప్రభుత్వోద్యోగుల వ్యవస్థ మీద ఒక రకం నిరసన వుంటుంది. అందులో అసమంజసమైనది కూడా ఏమీలేదు. మంచివాళ్ళు, నిజాయితీపరులు, పాపభీతి వున్నవాళ్ళు ప్రతి వ్యవస్థలోనూ వుంటారు. అలాంటి నాలుగైదు శాతాన్ని మినహాయిస్తే, లంచం తీసుకోకుండా ప్రజాసేవ చేసే ప్రభుత్వ ఉద్యోగులు మనకు ఎక్కడా కనిపించరు. పరిపాలన సాగించడానికి ప్రభుత్యోగుల వ్యవస్థ ’ఒక అవసరమైన దెయ్యం’ అనేవారూ లేకపోలేదు. దెయ్యం వ్యయం మన ఆదాయాన్ని కూడా మించిపోవడం దేన్ని సూచిస్తుంది? 
ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం ఉద్యోగుల జీత భత్యాలకే పోతున్నదని యన్టీ రామారావు కాలం నుండి ఇప్పటి వరకు అసంతృప్తిని ప్రకటించని వాళ్ళులేరు. అవసరం కదా అని ఇంటిని మించిన తాళం కప్పను కొనడం సమర్ధ చర్య అనిపించుకోదు. అసలు ఇల్లే లేకుండా తాళం కప్పను కొనడం ఏ ధోరణికి సంకేతం? 
ఆంధ్రప్రదేశ్ విభజన, సమైక్యరాష్ట్ర ఉద్యమాల ద్వారా అందరికన్నా ముందుగా లబ్ది పొందిన సమూహం ప్రభుత్యోద్యోగులు. కిరణ్ కుమార్ ప్రభుత్వంలో వారు భారీ రాయితీలు సాధించుకుని పండుగలు జరుపుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును సన్మానం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నదీ వాళ్ళే! 
సమాజంలో అత్యధికులయిన సామాన్య ప్రజల ఆదాయ స్తోమతను పెంచాల్సిన ప్రభుత్వాలు, పెంచుతామన్న హామీతో అధికారాన్ని చేపట్టిన నాయకులు ఇప్పుడు పోలీసులు, ప్రభుత్యోగులకు వరాలు కురిపించడం దేనికి సంకేతం? పోలీసులు, ప్రభుత్వోద్యోగులూ ప్రజల్లో భాగమే అని తెలుగు దేశం మేధావులు అనవచ్చు. ప్రజలు మాత్రం గతంలో అలా ఎన్నడూ అనుకోలేదు. భవిష్యత్తులో అలా ఎన్నటికీ అనుకోరు.
1970వ దశకంలో ఇందిరా గాంధీ “గరీబీ హఠావో” పథకాన్ని ప్రవేశపెట్టినపుడు విపక్షాలు దాన్ని “గరీబ్ కో హఠావో” అని విమర్శించేవారు. చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించకపోతే వారి రైతు రుణ మాఫీ పథకం రైతు మాఫీ పథకంగా ప్రాచుర్యాన్ని పొందినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
10 జులై 2014

అలీ నవాజ్‌ జంగ్‌-కేయల్ రావు-పోలవరం

అలీ నవాజ్‌ జంగ్‌-కేయల్ రావు-పోలవరం

వర్తమానం: డానీ
నీటిపారుదల ఇంజినీర్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సర్ ఆర్థర్ కాటన్. 19వ శతాబ్దం మధ్యలో గోదావరి, కృష్ణా నదుల మీద  ఆనకట్టలు కట్టి కాలువ వ్యవసాయ యుగాన్ని ఆరంభించిన ‘నీటిదేవుడు’ ఆయన. ఆ రంగంలో మరో విఖ్యాత ఇంజనీరు ”ద క్యుసెక్స్ క్యాండిడేట్’ కేఎల్‌ రావు. విజయవాడ ప్రజలు 1967లో కేఎల్‌ రావును లోక్ సభకు ఏకగ్రీవంగా ఎన్నుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
నిజాం సంస్థానంలో నీటిపారుదల ఇంజినీరు అనగానే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందరికీ గుర్తుకు వస్తారు. అయితే, సర్ యంవీ సమకాలికులు, ప్రతిష్ఠాత్మక  నిజాంసాగర్‌, వైరా, పాలేరు, పోచంపాడు, నందికొండ, భీమ, పెన్‌గంగ, ఇచ్చంపల్లి, లోయర్‌ మానేరు తదితర ప్రాజెక్టుల రూపశిల్పి అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ (మీర్‌ అహ్మద్‌ అలీ) పేరు చాలా మందికి తెలీదు. విద్య, వైద్యంతో పాటూ హైదరాబాద్ సాంస్కృతిక సుగంధాలని వెదజల్లుతున్న ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కాలేజీ భవనం, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి భవనం తదితరాలు భవననిర్మాణ రంగంలో మీర్‌ అహ్మద్‌ అలీ  ప్రతిభకు సజీవ సాక్ష్యాలు.
మీర్‌ అహ్మద్‌ అలీ, కేయల్ రావు ఇద్దరూ జులై నెలలోనే పుట్టడం యాదృచ్ఛికమేగానీ, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో వాళ్ళ జయంత్యోత్సవాలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారతదేశం అంతటా సర్ యంవీ పుట్టిన రోజైన సెప్టెంబరు 15న  ఇంజినీర్స్ డే నిర్వహిస్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ పుట్టిన రోజైన  జులై 11ను ముఖ్యమంత్రి కేసిఆర్  ఇంజినీర్స్ డే గా ప్రకటించారు. దానికి పోటీగా అన్నట్టు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో  కేఎల్ రావు పుట్టిన రోజైన జులై 15న ఇంజినీర్స్ డే జరపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మీర్‌ అహ్మద్‌ అలీ, కేయల్ రావు ఇద్దరికీ బహుశ  ఇది మరణానంతర (posthumously) అవార్డు కావచ్చు.
అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జయంత్సోత్సవాలని ఎర్రమంజిల్‌లోని జలసౌధలో నిర్వహించగా, కేఎల్ రావు జయంత్యోత్సవాన్ని అమీర్‌పేటలోని కమ్మసంఘంలో జరిపారు.  ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం విడిపోతున్నపుడు ప్రధాన వివాదం మద్రాసు రాజధాని, తిరుపతి దేవస్థానం చుట్టూ తిరిగాయి. మద్రాసును తమిళులకు వుంచి,  ఆంధ్రాను శాంతింప చేయడానికి తిరుపతిని ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ పంపకాల్లో  హైదరాబాద్ రాజధాని, పోలవరం ప్రాజెక్టు, భద్రాచలం  రామాలయం చర్చనీయాంశంగా  మారాయి. చెరొకటి ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌ను,  శ్రీ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని తెలంగాణకు వుంచి,  సీమాంధ్రకు మేలు చేసే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇప్పుడు పోలవరం అంటే  అనేకానేక వివాదాలకు కేంద్ర బిందువు. ఇది కేవలం తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు వివాదమో, కేసిఆర్ – చంద్రబాబుల రాజకీయ వివాదమో మాత్రమేకాదు, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇది మన్యం-మైదాన వివాదం, ఆదివాసీలు- నాగరీకుల వివాదం, రాయలసీమ-తీరాంధ్ర వివాదం, అన్నింటికీ మించి ఇది సాంకేతిక వివాదం.
1956 లో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు, ఆంధ్ర రాష్ట్రంలోవున్న భద్రాచలం డివిజన్ ప్రాంతాన్ని తిరిగి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కలపడం, ఆయకట్టు, ప్రాజెక్టు, ముంపుప్రాంతం ఒకే రాష్ట్రంలో వుండడం వంటివి సమంజసమైన పరిష్కారాలుగా కనిపించవచ్చుగానీ, ఇందులోనూ అనేక కొత్త సమస్యలున్నాయి. ఈ పరిష్కారం  ఆదివాసుల మేలు కోసమా? వాళ్లను ముంచడం కోసమా? అన్నది కీలకాంశం. ప్రాజెక్టులవల్ల సమాజానికి మేలు జరుగుతుందని గతంలోలా అమూర్తంగా అనుకునే కాలం కాదిది. ఏ సామాజికవర్గానికి మేలు? అనే ప్రశ్న అనుక్షణం మనల్ని వెంటాడుతున్న రోజులివి. సరిగ్గా ఈ కారణవల్లనే కేఎల్ రావు మీద తీరాంధ్రలో కనిపించే అభిమానం  తెలంగాణ లోనేకాదు, రాయలసీమలో కూడా వుండకపోవచ్చు.  ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి.
కేయల్ రావు వంటివారి సాంకేతిక పరిజ్ఞానంవల్ల తీరాంధ్రలో అయినా  ’అందరికీ”  మేలు జరిగిందా? అంటే ”కొందరికే’ అనే సమాధానమే వస్తుంది. దీన్ని అర్ధం చేసుకోవడానికి పెద్ద పరిశోధనలు కూడా అక్కరలేదు. సహజంగా భూమివున్నవాళ్ళే సాగునీటిని వాడుకోగలరు. ఆ ప్రాంతంలో, భూమిలేనివాళ్ళు  మాత్రమేకాక, కొద్దిపాటి భూములుండి సాగునీటి సౌకర్యం అందనివాళ్ళు సహితం క్రమంగా సాగునీటి సౌకర్యం వున్నవాళ్ల భూముల్లోనో, ఫ్యాక్టరీల్లోనో, వాణిజ్యసంస్థల్లోనో కూలీలుగానో, ఉద్యోగులుగానో మారాల్సివుంటుంది. దళితుల మీద దాడులు సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లోకన్నా సాగునీటి సౌకర్యం ఎక్కువగావున్న కారంచేడు, చుండూరు, వేంపెంట లాంటి చోట్ల మరింత కిరాతకంగా జరిగాయని మరచిపోవడం న్యాయంకాదు. ధవళేశ్వరం, బెజవాడ ఆనకట్టలు కేవలం నీటికి అడ్డుకట్టలు మాత్రమేకాదు, మెట్ట-డెల్టాల మధ్య సామాజిక, ఆర్ధిక, ప్రాంతీయ విభజన రేఖలు కూడా. మనలో చాలామందికి ఇప్పటికీ మింగుడుపడకపోవచ్చుగానీ, సాంకేతిక పరిజ్ఞానానికి కులం, మతం, ప్రాంతం, దేశం అన్నీ వుంటాయి. యూదుల మీద హిట్లర్ ఊచకోత సాగిస్తున్న కాలంలో విఖ్యాత శాస్త్రవేత్త  అల్బర్ట్  ఐన్ స్టీన్ తాను యూదుడు కాకుండా వుంటే, తన భౌతికశాస్త్ర సమీకరణల (e=mc2) ఆధారంగా, అణుబాంబును తయారు చేయాల్సిందిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ను కోరివుండేవాడా? అస్థిత్వాల ఘర్షణ యుగంలో సమాధానాలు వెతకాల్సింది ఇలాంటి ప్రశ్నలకి.  సాంకేతిక పరిజ్ఞానం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. ఎవరో ఒకరు కనిపెట్టకుండా, ఎవరో ఒకరు వాడకుండా, అసలు ఎవరో ఒకరికి అవసరం లేకుండా,  సాంకేతిక పరిజ్ఞానం అనుభవంలోనికి రాదు. దాన్ని కనిపెట్టేవాడూ, ఉపయోగించేవాడూ మనిషే కనుక. మనిషులకుండే అస్థిత్వాలన్నీ సాంకేతిక పరిజ్ఞానానికీ వుంటాయి. అంటే, సాంకేతిక పరిజ్ఞానం అస్థిత్వంలోనికి వచ్చే సమయానికే దాన్ని కనిపెట్టినవాళ్ళ, దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళ అస్థిత్వాలన్నీ అందులో ఇమిడి వుంటాయి. పోలవరం ప్రాజెక్టును కేవలం సాంకేతిక అంశంగా మాత్రమే చూస్తే అది మనకు ఎన్నటికీ అర్ధంకాదు. సామాజిక అంశంగా, మరీ నిర్దిష్టంగా,  మన్యానికీ, మైదానానికి మధ్య సరిహద్దు గోడగా దాన్ని చూడగలిగినపుడే అది మనకు ఎంతో కొంత అర్ధం అవుతుంది.  
పోలవరం ఈరోజు మన ముందు అనేక ప్రశ్నల్ని సంధిస్తోంది. అన్యాక్రాంతం కావడానికి వీల్లేని ఆదివాసీల భూమిని ప్రాజెక్టు వంకతోమాత్రం ఎలా కబ్జా చేస్తారూ? ఏజెన్సీ ప్రాంతంలో ఎకరం ఆక్రమిస్తే నేరం అయినప్పుడు లక్ష ఎకరాలు కబ్జాచేస్తే అభివృధ్ధిగా  మారిపోతుందా?  ఎప్పుడూ మైదానం కోసమే అడవి త్యాగం చేయాలా? అడవి కోసం మైదానం ఒక్క త్యాగం కూడా చేయదా? ఆదివాసుల మీద ప్రేముంటే వాళ్లను అడవిలోనే అభివృధ్ధి చేయాలిగానీ వాళ్లను అడవినుండి దూరం చేయడం దేనికీ? గోదావరి నీటిని విషతుల్యంగా మార్చేస్తున్న కార్పొరేట్ సంస్థల్ని పల్లెత్తు మాట అనలేని డెల్టావాసులకు ఆదివాసుల్ని నిర్వాసితుల్ని చేసే హక్కు ఎవరిచ్చారూ? పోలవరం సాధన యాత్రలు సాగాల్సింది  అడవిలో లేదా రాయలసీమలో.  గోదావరి డెల్టాలో సాగుతున్నాయంటే దాని అర్ధం ఏమిటీ?  వీటన్నింటికీ ఇప్పుడు సమాధానాలు కావాలి. అలాంటి సందర్భాల్లో  అల్లూరి మనకు స్పూర్తి కావాలి.
 మైదానం మన్యం పక్షాన నిలబడాలి.  
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు )
మొబైల్‌ _  9010757776
హైదరాబాద్‌, 18 జులై  2014 

Danny Notes 2014 August

Danny Notes
5 August 2014

ప్రభుత్వం పనిచేయడంలేదు?
ప్రభుత్వం బాగా  పని చేస్తోంది.
బాగా పనిచేయడం అంటే?
పూటకో కమిటీ వేయడం.

కమిటీలు పనిచేయడంలేదు.
కమిటీలు బాగా  పని చేస్తున్నాయి
కమిటీలు బాగా పనిచేయడం అంటే?
నివేదికను ఎప్పటికీ ఇవ్వకపోవడం

Danny Notes
5 August 2014

వారెప్పుడూ నిద్రపోరు
నిద్రలో  ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంటుతో
లోను గురించి  మాట్లాడుతుంటారు
సింగపూరు, న్యూయార్కు నగరాలకు
ఆధునీకీకరణ పథకాలు తయారు చేస్తుంటారు

వారెవర్నీ నిద్రపోనివ్వరు
రైతులు ఆకాశంలోనికి చూస్తుంటారు
విద్యార్ధులు కౌన్సిలింగ్ కోసం చూస్తుంటారు
ప్రజలు రాజధాని ఎక్కడని చర్చిస్తుంటారు


Danny Notes
5 August 2014

చంద్రబాబుగారికి భద్రత అవసరంలేదు

ఎటువైపు నుండి చూసినా వారు ప్రజలకు
మూడు వందల కిలో మీటర్ల దూరంలో వుంటారు.

Danny Notes
5 August 2014

షారోన్ ప్రియాంక
'యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి' కేసు నిందితురాలు 
 షారోన్ ప్రియాంక వివరాలు  నెల్లూరు మిత్రులు ఎవరయినా  చెప్పగలరా?

పరిశోధన కోసం ఆమె జీవన శైలి కావాలి.








Danny Notes
15 August 2014

జిన్నా, ఇక్బాల్ 

భారత ముస్లిం స్వాతంత్ర సమరయోధుల్లో శిఖరాయమానమైనవాళ్ళు ముహమ్మదాలీ జిన్నా, 

అల్లమా ఇక్బాల్. వీళ్లిద్దరూ ఎందువల్లలో ఈ డాక్యుమెంటరీలోలేరు.  పాకిస్తాన్ లో స్థిరపడిన అనేక రాజకీయ ప్రముఖులు సహితం (కనీసం 1947 ఆగస్టు 14 వరకైనా) భారత ముస్లిం స్వాతంత్ర సమరయోధులనే అవగాహన ఈ డాక్యుమెంటరీలో లోపించింది. లాల్ కిషన్ అద్వానీ పాకిస్తాన్‍ వెళ్ళి జిన్నా సమాధి దగ్గర నిలబడి ఆయన్ని మహత్తర దేశభక్తునిగా కొనియాడారు. జిన్నాను కీర్తిస్తూ జస్వంత్ సింగ్ భారీ పుస్తకమే రాశారు. సంఘ్ పరివారికులు చూపిన చొరవ కూడా భారత ముస్లిం రచయితలు చూపలేకపోతున్నారు. ఇది విషాదం!