Monday, 19 May 2014

Historical Responsibilities

చారిత్రక బాధ్యతలు
డానీ

తెలంగాణ-సీమాంధ్రాల్లో వెలువడబోయే ఎన్నికల ఫలితాల గురించి దాదాపు ఏకాభిప్రాయం కుదురుతున్నట్టుగావుంది! ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో కౌంటింగ్ మొదలుకాక ముందే  ప్రభుత్వ ఏర్పాట్ల గురించి చర్చలు, చర్యలు మొదలైపోయాయి. పోలింగ్ తరువాత కేసిఆర్ పాల్గొన్న తొలి మీడియా సమావేశం సారాంశం ఇదే.

తెలంగాణలో టీఆర్ ఎస్, సీమాంధ్రలో వైసిపీ అని కేసిఆర్ తేల్చేశారు. రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఒక చారిత్రక అవసరాన్ని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే వారిని గుర్తించాలన్నారు. “జగన్ ఏమైనా అంటరాని పదార్థమా?” అని ఒక్క ప్రశ్నతో అనేక సంకేతాలు  పంపించారు.

వారు జగన్ కు స్నేహ హస్తం చాచి ఊరుకోలేదు; చంద్రబాబునిగాన్ కేస్అన్నారు. “చాకలోని కుక్క ఇంటికీ పనికిరాదు, చాకిరేవుకూ పనికిరాదు” (“దోబీ కా కుత్తా  నా ఘర్ కా  నా ఘాట్ కా”) అని ఘాటుగా విరుచుకుపడ్డారు. కేంద్రంలో వీలుకుదిరితే కాంగ్రెస్ తో కలిసి రాహుల్ గాంధీని ప్రధానిచేస్తామనీ. కుదరకపోతే తామంతా కలిసి మూడో ఫ్రంటుకు మద్దతిస్తామనీ ఇంకో ప్రత్యామ్నాయాన్నీ ప్రకటించారు

యన్డీయేతో జతకట్టేదిలేదని కేసిఆర్ కరాఖండీగా తేల్చి చెప్పేయడం సహజంగానే వెంకయ్యనాయుడుకు మంట తెప్పించివుంటుంది. ఇన్నాళ్ళూ కాంగ్రెస్, టీఆర్ ఎస్ డూప్ ఫైట్ చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయని వారు  విరుచుకుపడ్డారు. వెంకయ్యనాయుడుగారికి నచ్చినా నచ్చకున్నా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్తెలంగాణ తెచ్చింది టీఆర్ ఎస్ఎన్నికల సమయంలో ఒకరినొకరు విమర్శించుకుని వుండవచ్చుగానీ, మళ్ళీ కలుసుకోలేనంతటి రాజకీయ వైరం కాంగ్రెస్, టీఆర్ ఎస్ మధ్య వుండే అవకాశం లేదు. అవసరమైతే, యంఐయం, సిపీఐ కూడా కాంగ్రెస్ - టిఆర్ ఎస్ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. నాలుగు పార్టీలు టిడిపీ, బీజేపి లను రాజకీయంగా అంటరాని పార్టీలుగానే చూస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్, టిఆర్ ఎస్ నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుధ్ధం సారాంశం ఏమంటే కింగ్ ఎవరు కావాలి? కింగ్ మేకరు ఏవరు కావాలీ? అనేది మాత్రమే!  

కేంద్రం మద్దతు లేకుండా రాష్ట్రమైనా అభివృద్ధి సాధించలేదని కేసిఆర్ ను వెంకయ్య నాయుడు హెచ్చరించే ప్రయత్నం కూడా చేశారు. నిజానికి  వెంకయ్య నాయుడు చెప్పిన నియమం ప్రకారమే జగన్ తో దోస్తీకి కెసిఆర్ సిధ్ధమయ్యారు. వేగంగా అభివృధ్ధి చెందాలంటే దేశానికైనా పొరుగు దేశంతోనూ, రాష్ట్రానికైనా కేంద్రంతోనేకాదూ పొరుగు రాష్ట్రంతోనూ సత్సంబంధాలు వుండాలి.

కేసిఆర్ అలా కరాఖండీగా నరేంద్ర మోదీతో కటిఫ్ చెప్పగలగడానికి వారికి ఒక బలమైన ఆర్ధిక పునాది వుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తే సాలీన జీడిపి సగటు అభివృధ్ది రేటు గత పదేళ్లలో 8 శాతం వుండగా, హైదరాబాద్ తో కూడిన తెలంగాణలో అది 12 శాతం వరకు వుందిఇది మోదీ మార్కు గుజరాత్ కన్నా ఎక్కువ.

సీమాంధ్ర పరిస్థితి వేరు. సాలీన జీడిపి సగటు అభివృధ్ది రేటు రాష్ట్ర సగటు  కన్నా చాలా తక్కువగా వుంది. మరోవైపు ఆదాయవనరుల పంపకాల్లోనూ సీమాంధ్రకు అన్యాయం జరగబోతోంది. ఎందుకంటే 40 శాతం జనాభావున్న తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ వాటా 60 శాతం వుండగా, 60 శాతం జనాభావున్న సీమాంధ్ర ప్రాంతంలో రెవెన్యూ వాటా 40 శాతం మాత్రమే వుంది. కొరతను తీర్చడానికి సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వం తొలి రోజు నుండే నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడితీరాలి

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో  ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్  సీమాంధ్రకు ఆరు హామీలు ఇచ్చారు. వాటిల్లో చివరిది,  “కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏడాది, - మరీ ముఖ్యంగా అప్పాయింటెడ్ డే నుండి 14  ఆర్థిక  సంఘం  సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలోగా - తలెత్తే రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు  2014-15  జాతీయ బడ్జెట్ లోనే నిధుల్ని కేటాయిస్తాముఅనేది.  

నేపథ్యంలో మూడు సందేహాలు ఇప్పుడు సీమాంధ్రను వెంటాడుతున్నాయిహామీలు ఇచ్చిన మన్మోహన్ సింగ్ కాకపోయినా వారి పార్టీకే చెందిన రాహుల్ గాంధీ అయినా ప్రధాని కాకపోతే పరిస్థితి ఏమిటీ? అసలు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామలకు చట్టబధ్ధత వుందా? ఒకవేళ ఎన్డీయే అధికారాన్ని చేపడితే యూపీయే ఇచ్చిన హామీని వెరవేరుస్తుందా? అనేవి సందేహాలు.

 నిజానికీ సందేహాలన్నీ తీరకుండా సీమాంధ్రలో అధికారాన్ని చేపట్టే పార్టి కేంద్రంలో అధికారాన్ని చేపట్టే కూటమితో ఎలాంటి సంబంధాలని ఏర్పరుచుకోవాలనేది స్పష్టంకాదు. ప్రస్తుతం జగన్ శిబిరంలో ఇలాంటి సంధిగ్ధమే కొనసాగుతోంది. అయితే, సీమాంధ్రలో వైసీపీకి  ఎక్కువ సీట్లు వచ్చాయంటే, వాటిని కేవలం జగన్ గొప్పతనం అనుకోవడంకన్నా  మతతత్వం, ద్వేషరాజకీయాల మీద  ప్రజలు వ్యక్తం చేసిన వ్యతిరేకతగానూ భావించాల్సివుంటుంది.   

ప్రజలు అభివృధ్ధినీ కోరుకుంటారు. సామాజిక ప్రశాంతతనూ కోరుకుంటారు. రెండింటిలో ఎదో ఒకదాన్నే ఎంచుకోవాల్సివస్తే వాళ్ళు సామాజిక ప్రశాంతతనే కోరుకుంటారుభారతదేశం విభిన్నమతాలు, జాతుల నిలయం అని అందరికీ తెలుసు. ఇక్కడ కులాలు కూడా మతాలకన్నా తక్కువేమీకాదు. మతసామరస్యం అంటే కులమత సామరస్యమనే అర్ధం చేసుకోవాలి, అందర్నీ కలుపుకునిపోయే సామరస్య రాజకీయ విధానాలే మన దేశంలో మనగలుగుతాయి. మోదీ మతతత్వ మార్గంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జయప్రకాశ్ నారాయణ సాగించిన రాజకీయాలని సీమాంధ్రులు వ్యతిరేకించారు. వైసీపీ గెలిస్తే సెక్యులర్ ఓట్లుగా భావించాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ అనడంలోని అర్ధం ఇదే!

తన నాయన వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినరాజన్నపాలనను కొనసాగించడానికి తాను రాజకీయ పార్టీ పెట్టినట్టు జగన్ చాలాసార్లు చెప్పివున్నారుఇప్పుడు వారి మీద ప్రజలు మరో బాధ్యతను కూడా మోపారు. అది కులమత సామరస్యాన్ని పరిరక్షించడం. చారిత్రక సంధి సమాయాల్లో నాయకులుగావున్నవారికి వ్యక్తిగత లక్ష్యాలేకాదు చారిత్రక బాధ్యతలు కూడా వుంటాయి

(రచయిత సీనియర్ పాత్రికేయులురాజకీయార్ధిక విశ్లేషకులు)
10 May 2014


http://www.andhraprabha.com/columns/historical-responsibilities/17145.html

No comments:

Post a Comment